🔻'విశాల నేత్రాలు"🔻

 


🚩ఈరోజు పుస్తక పరిచయం లో నాకు బాగా నచ్చిన
 పిలకా గణపతి శాస్త్రి గారి "విశాల నేత్రాలు"
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న
ఈ పుస్తకం చారిత్రిక నవల.
కథాకాలం 11 వ శతాబ్ది.
🚩నాయకుడు రంగనాయకుడు.
నాయిక హేమసుందరి గొప్ప అందగత్తె. ఆమెవి చెంపకి చారెడు
 కళ్ళు. ఓనాడు దేవాలయంలో హేమసుందరి నాట్యం చేస్తూ ఉండగా ఆమె విశాలనేత్రాలని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు రంగనాయకుడు. హేమని తనకి దక్కేలా చేస్తే శ్రీరంగేశునికి హేమసుందరి నేత్రాలని పోలిన పైడి కనుదోయి, స్వర్ణతిలకం సమర్పించుకుంటానని మొక్కుకుంటాడు రంగనాయకుడు. ఒకనాటి రాత్రి హేమసుందరితో కలిసి పొరుగునే ఉన్న పాండ్యరాజ్య ముఖ్య పట్టణం శ్రీరంగానికి పారిపోతాడు రంగనాయకుడు. వారిద్దరూ తమ పేర్లని హేమాంబా ధనుర్దాసులుగా మార్చుకుని భార్యాభర్తలుగా చెలామణి అవుతూ కొత్తజీవితం ప్రారంభిస్తారు.
🚩హేమసుందరి దక్కించుకున్న రంగనాయకుడు దానిని తీర్చుకుని తిరిగి వస్తుండగా రామానుజ యతి ఎదురు పడతాడు. ఆ వృద్ధ యతి ముఖంలో చూడగానే ఆకర్షించేవి విశాలమైన నేత్రాలు.
యతి సమక్షంలో శ్రీరంగేశుని దర్శించుకున్న రంగనాయకుడికి కోటికొక్కరికి మాత్రమే కలిగే మహద్భాగ్యం - శ్రీరంగశాయి నిజ నేత్ర దర్శనం - దొరుకుతుంది.
🚩ఆ విశాల నేత్రాలని దర్శించిన క్షణం రంగనాయకుడి జీవితం మరో అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. హేమసుందరి, రామానుజ యతి, శ్రీరంగనాధ స్వామి వారల 'విశాల నేత్రాలు' అతిసామాన్యుడైన రంగనాయకుడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయన్నదే 'విశాల నేత్రాలు' కథాంశం.
🚩ఇది  ఆంధ్ర పత్రిక  సీరియల్గా  చదివేం .1960లలో   చదివేను.
నిన్న  శ్రీ D Subrahmanyamగారి   స్టేటస్  లో చూసా .. మీకు షేర్ చేస్తున్న ...
 🚩ఆ రోజులలో సినిమా తీద్దాం అనుకున్నాను
ఆదుర్తి  డైరెక్టర్ .. కృష్ణం రాజు .. హేమ మాలిని  ప్లాన్ చేశాను  
ఊహలలో ❤️❤️❤️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐