🚩🚩కన్యక -పద్య కావ్యం.-🚩🚩 (గురుజాడ అప్పారావు గారు.)




♦️కన్యక గురజాడ అప్పారావు రచించిన చిన్న పద్య కావ్యం.
ఈ కథను తీసుకుని రాజులు వారు చూచిన సుందరులనెల్ల
తమ కామానికి బలియిచ్చే క్రౌర్యాన్ని, వారికి సామాన్య వైశ్యులకూ
వుండే అంతరువును బహు చాకచక్యంగా చిత్రించారు.
ఇతివృత్తం
♥️తగటు బంగరు చీరె కట్టి
కురుల పువ్వుల సరులు జుట్టి
నుదుట కుంకుమ బొట్టు పెట్టి సొంపు పెంపారన్;
తొగరు కాంతులు కనులు పరపగ
మించు తళుకులు నగలు నెరపగ
నడక లంచకు నడలు కరపగ కన్నె పతెంచెన్ రాజవీథిని.
♦️ఒక అందమైన పడుచు ప్రాయపు వైశ్య కన్యక దేవాలయానికి పూజ కోసం వెళుతుంది.
♥️"పట్టవలెరా దీని బలిమిని
కొట్టవలెరా మరుని రాజ్యం
కట్టవలెరా గండపెండెం రసిక మండలిలో."
నాల నడమను నట్టి వీథిని
దుష్ట మంత్రులు తాను పెండెం
గట్టి కన్నెను చుట్టి నరపతి పట్ట నుంకించెన్.
♦️ఆ దేశపు రాజు ఆమె మీద కన్నువేశాడు. నడివీధిని దుష్టమంత్రుల సహాయంతో ఆమెను పట్టుకోదలచాడు.
♥️"ముట్టబోకుడు, దేవకార్యం
తీర్చి వచ్చెద, నీవు పట్టం
యేలు రాజువు, సెట్టి కూతర నెటకు పోనేర్తున్."
♦️కాని కన్యక నన్ను ముట్టుకోవద్దు, దైవకార్యం
తరువాత రాచకార్యం అన్నారు కదా, నేను ఎక్కడకి దాటిపోనని పలికింది.
♥️"పట్టమేలే రాజ ! బలిమిని
పట్టవలెనా ? నీదు సొమ్మే
కాద కన్నియ ? నీవు కోరుట కన్న మరి కలదా విశ్యజాతికి వన్నె ?"
"యింటి దైవం వీరభద్రుడి
దేవళానికి పోయి యిప్పుడె
పళ్లెరం సాగించి వత్తును, పైని తమ చిత్తం !"
♦️తరువాత వైశ్యులు రాజుతో "మీరు బలిమిని పట్టాలనుకుంటున్నారా లేకుంటే ఆమె మీది కాదా? ఇప్పుడు దేవాలయానికి వీరభద్ర పళ్ళెరం పట్టబోతున్నాం, తరువాత ధర్మసమ్మతమైతే వివాహమాడుదురు" అన్నారు.
♦️"మంచిదే, మరి నడువు, మేమును
తోడ వత్తుము, దేవళంలో
అగ్ని సాక్షిగ కన్యకను మే మందుకొన గలము."
"మేమూ దేవాలయానికొస్తాం, అక్కడ వివాహమాడతాం" అన్నాడు రాజు.
 అట్లే వెళ్ళారు.
♥️అన్నలారా తండ్రులారా
ఆలకించం డొక్క విన్నప
మాలు బిడ్డల కాసు కొనుటకు ఆశలే దొక్కొ కులము లోపల ?
కలగవా యిక్కట్లు ? మేల్కొని,
బుద్ధి బలమును బాహు బలమును
పెంచి, దైవము నందు భారం వుంచి, రాజులలో
"రాజులై మను డయ్య !" ఇట్లని
కన్య నరపతి కప్పుడెదురై
నాలు గడుడులు నడిచి ముందుకు పలికె నీ రీతిన్.
♦️వైవాహికాగ్ని యెదుట భక్తిభావభరితమైన కన్యక తమ కులము సాములకు కాసువీసముతో తృప్తిబొందక బాహుబలమును, బుద్ధిబలమును సంపాదించి మీ యాలుబిడ్డలను కాపాడుకోండని ఉపదేశించింది.
♥️"పట్టమేలే రాజువైతే
పట్టు నన్నిపు" డనుచు కన్యక
చుట్టి ముట్టిన మంట లోనికి మట్టి తా జనియన్ !
♦️రాజును చూసి పట్టుకోవడానికి సమర్థుడవైతే పట్టుకొమ్మని
ఒక్కమాటున అగ్నిగుండాన దూకింది.
______________________
🚩🚩-గురజాడ అప్పారావు గారి -చిలిపితనం .
♦️ఒకసారి కోర్టులో తలుపుమీద సుద్దముక్కతో “జి. వి. అప్పారావు; బి. ఏ., బి. ఎల్., — జిల్లా జడ్జి” అని రాశారు. ఈ విషయం జడ్జీగారి దృష్టికి వచ్చింది.
“నువ్వు జడ్జివని మోసపు ప్రకటన చేసినందుకు నిన్ను శిక్షించవచ్చు” అన్నారు జడ్జ్.
“కాదు సర్! నాది ప్రకటన కాదు. కోరిక మాత్రమే.”
“సరే! నీ కోరికను కోర్ట్ తలవాకిలి తలుపు మీదే వెల్లడించాలా? పక్కన గోడ మీద రాయవచ్చుగా?”
“మరి నేను బొగ్గుముక్కతో రాయలేదు కదా! సుద్దముక్కతో రాసాను.
వెల్లవేసిన గోడ మీద తెల్లని సుద్దముక్కతో రాయడం తెలివి తక్కువ కదా!”
ఇక ఈ న్యాయవాది ముందు ఏ న్యాయమూర్తి ఏం తీర్పు యివ్వగలడు?
*****

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐