😡-ముక్కు తిమ్మన...గారి తలనొప్పి-😡



♦️♦️ఒకసారి నంది తిమ్మన గారికి విపరీతమైన తలనొప్పి పట్టుకుంది.
అది వచ్చినప్పుడు పిచ్చి పట్టినట్టుగా వుండేది (మైగ్రేన్)
రాయలవారు ఎంతో మంది వైద్యులకు చూపించారు ఎన్నో మందులు వాడారు.
అప్పటికి ఉపశమనమే తప్ప మరీ కొన్నాళ్ళకు వచ్చేది.
♦️ఇలా కాదు కాశీకి వెళ్లి చూపించుకుంటాను అని తన పరివారం తో
సహా కాశీకి ప్రయాణం కట్టారు.అలా వెడుతూ వెడుతూ మధ్యలో
శిరోభారం ఎక్కువైపోయి నెల్లూరి ప్రాంతానికి చెందిన దరిశి మండలములో
వున్న బోదనం పాడు అనే గ్రామ శివార్లలో డేరాలు వేసుకొని బస చేశారు.
తిమ్మన గారికి తలనొప్పి ఎక్కువై పోయి పెద్దగా మూలగా సాగారు.
అది విని ఆదారిలో వెళుతున్న యిద్దరు వైద్య సోదరులు ఆ డేరా దగ్గరికి
పోయి అక్కడ కాపలాగా వున్నవారిని మేము ఘన వైద్యులము యిక్కడెవరో
బాధతో మూలుగుతున్నారు ,మేము లోపలి వెళ్లి చూస్తాము అన్నారు.
♦️మేము యిద్దరూ అన్నదమ్ములంఈ బోదనంపాడు గ్రామానికి
చెందిన వాళ్ళం.
మాపేర్లు పుల్లాపంతుల పుల్లన్న,సూరన్న యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు,
మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి.
మేము వారికి వైద్యం చేస్తాము అన్నారు.
♦️సరే ఆశీనులు కండి అని సైగ చేస్తూ నాకీ శిరోవేదన చాలా ఏళ్ళుగా వుంది.
ఈ మధ్య మరీ ఎక్కువగా వుంది.
ఒక్కోసారి తల గోడకేసి బద్దలు కొట్టుకోవాలని పిస్తుంది.
తలలో ఏదో తోలుస్తున్నట్టు బాధ ఆన్నారు తిమ్మన.
మీరు సెలవిస్తే మేము మిమ్మల్ని పరీక్షిస్తాం.మాకున్న పరిజ్ఞానంతో
మా పూర్వీకుల ఆశీస్సులతో మీకు మంచి వైద్యం అందించ గలమని
మా నమ్మకం. అన్నాడు పుల్లన్న.
ఆయన వేదన సోదరులకు అర్థమైంది.
ఆర్యా!ఆ బాధ నిజంగా వర్ణనాతీతం.
గజరాజు కుంభస్థలం లోకి పాము ప్రవేశించినప్పుడు
 ఆ గజం ఎంతగా విల విల లాడి పోతుందో అది ఎన్ని కొండల్ని
ఢీకొంటుందోఅందుకు వెయ్యి రెట్లు వుంటుందీ శి
రోవేదన.భరించడం ఎవరికైనా కష్టమే.
ఒకసారి చెయ్యి యివ్వండి నాడి పరీక్షిస్తాం.అన్నాడు సూరన్న.
తిమ్మన చెయ్యి అందించారు.సూరన్న.
అతి జాగ్రత్తగా నాడి పరీక్ష చేశాడు.విషయం పుల్లన్నకు వైద్య పరి భాషలో వివరించాడు.
♦️ఆ రోజునుంచీ వరుసగా మూడు రోజులు ఆ వైద్య సోదరులు తిమ్మన ముక్కులోచుక్కల పసరు పిండుతూ వచ్చారు.నాలుగో రోజు ఆ వైద్యానికి కావలిసినపదార్థాలన్నీ ఒక జాబితా తయారు చేసి యిచ్చారు.అందులో విశేషంగా వైద్యానికిమ్కావలిసిన వస్తువులేమీ లేవు.
పుట్టెడు బియ్యం మాత్రం కావాలన్నారు.
♦️పుట్టెడు బియ్యమా?అంటూ వూరందరికీ సమారాధన చేస్తారా?
ఏమి అన్నాడు రాజవైద్యుడు వెటకారంగా.
కాదు అవసరం వుంది తెప్పించండి.
అలాగే 20 మంది వంటవాళ్లు కూడా కావాలి అన్నారు
వైద్య సోదరులు
ఉప్పు,పప్పు కూరగాయలు కూడా తెప్పించండి.
వండి వూళ్ళో పోలేరమ్మ జాతర జరిపించండి సరిపోతుంది
దెప్పి పొడిచాడు రాజవైద్యుడు.
కాదు కాదు
మా వైద్యానికి ఇది చాలా అవసరం అన్నాడు పుల్లన్న.
ఏమి అవసరమో యేమో! మా తిమ్మన గారితో ముక్కు పట్టించి
మూడు చెరువులనీళ్ళు త్రాగిస్తున్నారు.
♦️మరుదినం గాలి కూడా చొరరాని దట్టమైన బాగా ఎత్తైన గుడిసె నొక దానిని నిర్మించారు.బయట వంటవాళ్ళతో పుట్టెడు బియ్యం వండిస్తున్నారు.
అనదరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.తిమ్మనను గుడిసె లోకి పిలుచుకొని వెళ్ళారు.సోదరులు.మిమ్మల్ని ఈ గుడిసె లో తలక్రిందులుగా వేలాడ దియ్యాల్సి వుంటుంది అన్నారు.తిమ్మనకు దిక్కు తోచలేదు.భయపడకండి ఇది వైద్య ప్రక్రియలో భాగమే.అన్నారు వైద్య సోదరులు సరే వైద్యానికి ఒప్పుకున్నాక తప్పుతుందా ఏదైతే అది అవుతుంది అని కానివ్వండి అన్నారు తిమ్మన వెంటనే ఆయనకు లావు కంబళ్ళు శరీరమంతా చుట్టి తలకు ముక్కు మాత్రం బయటకు ఉండేలా ఒక దట్టమైన తొడుగు తగిలించి ఆ గుడిసెకు ఒక మూలగా ఆయన్ను తలక్రిందులుగా వేలాడ దీశారు.
♦️ఒక్కో వంటవాడు అప్పుడే హండాలలో వండి వార్చిన అన్నాన్ని గుడిసె లో గుమ్మరించారు.వారి సహాయకులు.గుడిసె అంతా ఆవిరి సెగలతో నిండిపోయింది.
తిమ్మన శరీరం ముక్కు పుటాల ద్వారా వేడి వేడి అన్నపు
ఆవిరి సెగలునషాళానికి అంటాయి.రెండు క్షణాల .లోనే ఆ
యన ముక్కు పుటాలనుంచిరెండు విష క్రిములు గిజ గిజ లాడుతూ
ఆ అన్నపు రాశి పై పడ్డాయి.వెంటనే స్మృతి తప్పిన ఆయన్ను క్రిందికి దించి బయటకు తీసుకొని వచ్చి శీతలోపచారాలు చేశారు
♦️.క్రమంగా ఆయనను తెలివిలోకి తెచ్చారు.రెండు వారాల్లో పూర్తిగా కోలుకునేలా మంచి
మందు లిచ్చారు.
క్రమేపీ కవిగారి శిరోభారం తగ్గి రోగం నయమైంది.
ఈ శుభ సమాచారాన్ని రాయలవారికిఅండ జేశారు.రాయలు
ఎంతో సంతోషించి రాజసభకు ఆహ్వానించి తీసుకొని రావలిసిందని తిమ్మనకు కి కబురు పంపారు..
♦️పుల్లాపంతుల వైద్య సోదరుల ఖ్యాతి అప్పటికే విజయనగరం పరిసర ప్రాంతాలకు పాకిపోయింది.
ఆ వైద్యులను దర్శించు కోవడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు.కాసేపటికి కృష్ణదేవరాయల వారూ వచ్చారు.
వైద్యులిద్దరూ రాయలవారిని ప్రస్తుతించారు.

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐