❤ వ్యాకరణంలో సంబాషణ!

 


.
*ఈ కథ చాలా పాతకాలందిలెండి.!
ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన బండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి బండి లో కూర్చో బెట్టి బయల్దేరాడు .
త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంది.కుదుపులు ఎక్కువవడం తో .
పోరుగూరినుంచి వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ
వెధవ బండి' అన్నాడు.
దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ
మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా?
అన్నాడు నవ్వుతూ
షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండిఅనే అర్థము వస్తుంది
కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది.
(బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?)
ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి.
(అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు.
యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు.. ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు.
....
ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.
ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.శిష్యుడు అతడి భార్య
ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి కాళ్ళకు నమస్కారము చేసినారు.అప్పుడు గురువు
ఒక శార్దూల వృత్తము(పద్యము) లోమధ్యలో ఒక వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.
అప్పుడు శిష్యుడు నవ్వుతూ గురువుగారూ! మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి
వెళ్ళుట మీకు న్యాయమేనా?అన్నాడు. గురువు గారు నవ్వుతూ ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే
నీకు యేమీ అపకారము చెయ్యదు.పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు.పంచమీ తత్పురుషము
లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..అన్నారు.
పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన భయము' షష్టీ తత్పురుషము నకు
ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా' ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా శార్దూలము యొక్క కాపలా పెట్టారు.
ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు.గురువుగారిని బండీలో ఎక్కించి మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి అన్నాడు శిష్యుడు.
అందుకు గురువు గారు నవ్వుతూ
నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ
'భార్యా భర్తలు' 'తల్లిదండ్రులు'యిస్తారు మామూలుగా.ద్వంద్వా తీతుడంటే
మీ భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩