❤️❤️-గాంధర్వ వివాహం-❤️❤️

 


🔻యువతీ యువకులు ఇద్దరూ యుక్త వయస్సు గలవారైయుండి, మంచి చెడుల విచక్షణ కలిగి ఉండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారం గానీ ప్రమేయము లేకపోయినా, తమంత తాముగా రహస్యముగా వివాహం చేసుకొనడాన్ని గాంధర్వ వివాహము అని అంటాము.
🚩ఇతః పూర్వము శకుంతల దుష్యంతుల వివాహము ఈ విధముగానే జరిగినట్టు జెప్పబడుతుంది. పూర్వము గంధర్వులు, రాజులు, చక్రవర్తుల ఈ విధమైన వివాహము చేసుకునేవారు.
🔻గాంధర్వ వివాహం అనగా పరస్పర ప్రేమతో అంగికారంతో
జరిగే వివాహం, అప్పటికి, ఇప్పటికి, సమ్మతమే, కాదనడానికి లేదు
కాని భద్రత దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినపుడు చిక్కులు కలుగుతాయి,
అదే శకుంతల కూడా పడింది
తరవాత, ఇప్పటివారు కూడా అటువంటి చిక్కులు ఎదుర్కుంటున్నారు….
🚩శాకుంతలం అంటే శృంగారమే చూస్తున్నారు,
ఈ తరవాత జరిగినదాన్ని పెద్దగా పట్టించుకోటం లేదు.
మను చరిత్రలో మాయా ప్రవరునితో వరూధిని సంగమం
తరవాత చదవక్కరలేదంటున్నారు, అలాగే శాకుంతలంలో కూడా,
నిజంగా నేటి కాలానికి ఈ తరవాత జరిగినదే చాలా అవసరం..
❤️🔻 ❤️🔻🔻❤️🔻❤️🔻 ❤️🔻🔻❤️🔻

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐