❤❤ మోహినీ రుక్మాంగదఅను ఏకాదశి మహత్యం కథ.❤❤
❤❤ మోహినీ రుక్మాంగదఅను ఏకాదశి మహత్యం కథ.❤❤
✍ అయోధ్యా పురాధీశ్వరుడు రుక్మాంగదుడు పరమ భక్తుడు.
అతని భార్య సంధ్యావళి సంతోషం కోసం ఒక ఉద్యానవనాన్ని నిర్మిస్తాడు. ఆ ఉద్యానవన వైభవాన్ని నారదుడు దేవకన్యలకు వివరించగా వారు రోజూ రహస్యంగా రాత్రిపూట ఆ తోటలోకి వచ్చి పువ్వుల్ని కోసుకెళుతుంటారు.
♦విదూషకుడు రాత్రి ఆ తోటకు కాపలాగా ఉన్నాడు. అయినా దేవకన్యలు అదృశ్యరూపంలో వచ్చి పూలను కోసుకు వెళతారు. చివరకు ఆ పుష్పాపహరణ చేస్తున్నదెవరో తెలుసుకునేందుకు
తోటలో పుచ్చకాయ విత్తులు చల్లారు. వాటి ప్రభావం వల్ల దేవకన్యలు అదృశ్యులై తమ లోకానికి ఎగిరిపోయే శక్తిని కోల్ఫోయి పట్టుపడి పోతారు. రాణి వారిని క్షమిస్తుంది.
♦తిరిగి వారు తమ లోకానికి ఎగిరిపోవడానికి రాజు, రాణి తమ పుణ్యాన్ని అంతా ధారపోస్తారు. అయినా ఆ పుణ్యం సరిపోలేదు.
నారదుడు ఏకాదశవ్రత ప్రభావం గురించి చెప్పి ఆ వ్రతం చేసిన వారు ఎవరైనా ఉంటే వారి పుణ్యప్రభావంచే దేవకన్యలు తిరిగి దేవలోకానికి ఎగిరిపోగలరని చెబుతాడు.
♦కోడలితో గొడవపడి ఒక పూటంతా అభోజనంగా ఉండి రాత్రంతా జాగారం చేసి ఏకాదశిని గడిపిన ఒక ముదుసలిని విదూషకుడు తీసుకుని రాగా ఆ ముసలి పుణ్యప్రభావం వల్ల దేవకన్యలు దేవలోకానికి ఎగిరిపోతారు.
♦ఏకాదశవ్రత ప్రభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న రుక్మాంగదుడు తాను ఆ వ్రతం చేయడమే కాక, ప్రజలందరూ ఆ వ్రతాన్ని ఆచరించేటట్లు చేస్తాడు.
♦దేశం సుభిక్షమవుతుంది. రాణి మగబిడ్డను కంటుంది. తల్లిదండ్రులు ఆ బిడ్డకు ధర్మాంగదుడు అనే పేరు పెడతారు. దేశంలోని ప్రజలందరూ ఈ వ్రతం చేయడంతో యమలోకానికి వచ్చే జనాభా తగ్గి యముడు ఖిన్నుడౌతాడు.
♦యముడు బ్రహ్మ సహాయంతో మోహిని సృష్టించి రుక్మాంగదుని వ్రతదీక్ష నుండి మరలించమని పంపిస్తాడు. మోహిని ప్రేమలో రుక్మాంగదుడు చిక్కుకుంటాడు. మోహిని చెలికత్తె చంప విదూషకుని ఇంటిలో చిచ్చు రగులుస్తుంది.
♦మోహినిని తన భర్త వివాహం చేసుకున్న సంగతి విని సంధ్యావళి కలవరం చెందలేదు. ఆమె, ధర్మాంగదుడు తనపట్ల చూపిన సౌజన్యానికి మోహిని ముగ్ధురాలౌతుంది. తన కర్తవ్యాన్ని మరచిపోవద్దని యముడు, బ్రహ్మ ఆమెను శాసిస్తారు
. మోహిని రుక్మాంగదునితో ఏకాదశవ్రతం చేయడానికి వీలులేదంటుంది. కానీ రుక్మాంగదుడు వ్రతం మాననంటాడు.
పెళ్ళి సందర్భంగా ఏది కోరినా ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చమంటుంది. వ్రతం చేసే పక్షంలో పుత్రుని శిరస్సును ఖండించి తనకు సమర్పించమంటుంది.
♦రుక్మాంగదుడు, సంధ్యావళి ఎంతో క్షోభపడతారు. చివరకు రుక్మాంగదుడు ధర్మాంగదుడి తలను నరకడానికి సిద్ధమవుతాడు. రుక్మాంగదుని చేతిలోని కత్తి పూలదండగా మారిపోతుంది.
మహావిష్ణువు ప్రత్యక్షమౌతాడు.
♦యముడు తన ఓటమిని అంగీకరిస్తాడు. కథ సుఖాంతమౌతుంది[1].
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Comments
Post a Comment