🚩🚩కనిపించిన అమ్మాయి .🚩🚩




 🚩🚩కనిపించిన అమ్మాయి .🚩🚩


#ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. 

పరమాచార్య స్వామివారి దర్శనం కోసం నిలుచున్న వరుసలో ఒక ముదుసలి దంపతులు కూడా ఉన్నారు. వారి వంతు రాగానే నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేశారు.

ఆ పెద్దాయన స్వామితో, “పెరియవ! నేను ఉద్యోగ విరమణ చేసాను. నాకు పిల్లలు లేరు. కనుక నాకు కంచి మఠంలో సేవ చెయ్యాలని ఉంది. దయచేసి నన్ను ఆశిర్వదించండి” అని వేడుకున్నాడు. అతని ప్రార్థనలో వినయము, విధేయత కనబడుతున్నాయి. తని పక్కనే అతని భార్య కూడా నిలబడిఉంది.

”నిన్ను చూస్తోంటే జీవితంలో ఇక ఆనందం పొందటానికి ఏమి లేదని చాలా బాధపడుతున్నట్టు ఉన్నావుకదా?” అని అడిగారు. ”అవును పెరియవ”

“నీకు ఒక పని చెప్తాను చెయ్యగలవా?”

“దయచేసి ఆజ్ఞాపించండి పెరియవ. అందుకోసమే వేచియున్నాను. . . ”

ఇప్పుడు పరమాచార్య స్వామివారు వారికి సాష్టాంగం చేస్తున్న ఇంకొక దంపతులవైపు చూశారు. వారి కుటుంబము, పూర్వీకుల గురించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. వీరు కూడా వయసైపోయినవారే. వారి అమ్మాయి కూడా వారితోపాటు నిలబడిఉంది.

”ఈమె మా ఒక్కగానొక్క అమ్మాయి. మేము తనకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాము. కేవలం మీ ఆశీర్వాదం కావాలి.”

ఆ సర్వేశ్వరుడు చెయ్యెత్తి వారిని ఆశీర్వదించాడు. అక్కడ జరుగుతున్నదంతా ముందు వచ్చిన దంపతులు గమనిస్తున్నారు. ఆ పెద్దాయన వంక తిరిగి స్వామివారు, “జీవితంలో ఒక మంచి పని ఏదైనా చేయాలనుకుంటున్నావు కదూ! వీళ్ల అమ్మాయి వివాహం నువ్వు ఎందుకు చెయ్యరాదు? మొత్తం ఖర్చు భరించి చాలా గొప్పగా” అని అడిగారు.

”చేస్తాను. . . నేను చేస్తాను. . . పెరియవ” అని నేలపై పడి స్వామికి సాష్టాంగం చేశాడు.

#మహాస్వామివారు చేతి రెండు వేళ్ళను చూపిస్తూ అతనివంక చూసి తరువాత్ అతని భార్య వంక చూసారు. ఆ ముసలాయన స్వామివారి ప్రశ్నను అర్థం చేసుకుని, “అవును పెరియవ. ఈమె నా రెండవ భార్య. నా మొదటి భార్య చనిపోయిన తరువాత ఈమెని చేసుకున్నాను” అని చెప్పాడు.

స్వామివారి ముఖంలో నిర్ణాయాత్మకమైన మార్పు కనిపించింది. “సరే మరి నీ మొదటి భార్యకు కలిగిన అమ్మాయి సంగతేంటి?” అని అడీగారు.

ఆ మాటలు వినగానే అతను నిచ్చేష్టుడయ్యాడు. ఈ విషయం మహాస్వామి వారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు. తడబడుతూ బాధగా చెప్పాడు “నా రెండవ భార్య ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకునేది కాదు. చాలా చిన్న వయసప్పుడే తను మా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తనకోసం సాయశక్తులా వెతికాము కాని దొరకలేదు”

ఆ #సర్వేశ్వరుడు, “నీ జీవితంలో పనికివచ్చే మంచి పని ఏదైనా చెయ్యాలని అనుకున్నావు కదా! ఇదిగో చిన్నప్పుడు నీ ఇల్లు వదిలిపారిపోయిన నీ కూతురే ఈ అమ్మాయి. ఆ అమ్మాయిని ఆదరించి ఘనంగా పెళ్ళి చెయ్యి” అని చెప్పారు.

అతను ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషంతో కళ్ళ నీరు కారుస్తున్నాడు.

అవును ఇది నిజం. ఆ అమ్మాయిని వెంటబెట్టుకు వచ్చిన ఆ దంపతులు ఆ అమ్మయి ఏడుస్తూ ఒంటరిగా రైల్వేష్టేషనులో వారికి దొరికిందని తెచ్చికుని పెంచుకుంటున్నామని చెప్పారు. కన్నవారు, పెంచిన వారు ఇద్దరూ ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి పెళ్ళికి సిద్ధం చేసుకుంటున్నారు.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐