🚩🚩"బడిపంతులు"🚩🚩



♦జరుగుతున్న జీవన చరిత్రకు నిదర్శనం, "బడిపంతులు" గా అన్నగారి అత్యద్భుత నటనతో అపురూప దృశ్యకావ్యముగ నిలిచిన సాంఘీక చిత్రరాజం (నవంబర్ 23, 1972)
.
 ♦ తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా, ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించడం ద్వారా మకుటం లేని మహరాజుగా వెలిగిపోతున్న ఆ మేరునగధీరునికి కళ పట్ల వున్న విశేష గౌరవము, ఆ చల్లారని కళాతృష్ణ,  క్రమశిక్షణ లకు నిలువెత్తు దర్పణం "బడిపంతులు" లో హెడ్మాస్టర్ రాఘవరావు పాత్ర!! 
♦ స్థాయికి ఆ పాత్రను కాజ్యువల్ గా చేసినా, ఎవ్వరూ కాదనలేరు. కానీ అలనాడు కే.వి.రెడ్డి గారిలాంటిదిగ్దంతులకు ఎంత గౌరవము ఇచ్చారో...ప్రస్తుత దర్శకులకు కూడా అదే గౌరవము (పి.సి.రెడ్డి, కే. రాఘవేంద్రరావు, దాసరి ఎవరైనా) ఇవ్వడము ఆ నటరారాజు విలక్షణ, విచక్షణ!!
♦ ఆ పూజ్యభావన నుండి విరిసిన మరో అద్భుత పాత్ర రాఘవరావు మాస్టారు. భీష్మ పాత్ర ఎంత అంకితభావం తో చేశారో..అదే స్థాయిలో ఈ పాత్రని నిలబెట్టారు!! నికార్సయిన  నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అయిన మాస్టారు గా ఎంతో హుందాగా కనిపిస్తారు. కమిటీ పెద్ద పాపారావు దుర్మార్గాలను ఎదుర్కోవడం లో సున్నితంగానే  చూపెట్టే ధర్మాగ్రహం; పెంకి అయినా తెలివిగల రాము ని సంస్కరించడంలో  వాత్సల్యాభిమానం; ప్రార్థనా గీతంలో ఆయన చూపెట్టిన హావభావప్రకటనలు.."విప్లవ వీరులు వీరమాతలు.." అన్నప్పుడు పిడికిలి బిగించడం..అన్నగారి నటనకు గీటురాళ్ళు!! 
♦తరువాతి కథనంలో మధ్యతరగతి తండ్రిగా, చేయూతగా వుంటారని ఆశలుపెట్టుకున్న కొడుకులు తన నమ్మకాన్ని వమ్ముచేయగా, నిస్సహాయుడై, పుట్టెడు దుఃఖము దిగమ్రింగుకునే  తండ్రిగా, ఆవేశపడిన భార్యను ఓదార్చే భర్తగా ఆయన పాత్రలో జీవించిన  తీరు అపూర్వం!! మౌనంగానే మహాశివుడు గరళాన్ని గొంతులో దాచుకున్న రాఘవరావు మాస్టారు  , తమ దంపతులను పిల్లలు పంచుకోవాలని అనుకున్నప్పుడు
కూడా మౌనం వహిస్తాడు.  
కానీ తన ఇంటి విలువను వారు చులకన చేయడాన్ని సహించలేరు..." ఇది కేవలం ఇసుక, సున్నంతో నిర్మించబడింది కాదు. ప్రతిఫలాపేక్షరహితంగా, నన్ను దేవుడిగా ఎంచి, సేవించిన నిస్వార్థ, నిర్మల ప్రేమాహృదయులైన పిల్లల సుకుమార హస్తాలతో నిర్మించిన పవిత్ర దేవాలయం. ఇక్కడ ప్రతి అణువులోను ఆ సుందరమూర్తుల దివ్యవదనారవిందాలే నాకు కన్పిస్తాయి. ఆ కసిగందుల హృదయస్పందనలే నాకు వినిపిస్తుంది. ఇది నాకు తాజమహలు కన మిన్న. నేను బ్రతికి ఉండగా ఇది అన్యాక్రాంతం కాకూడదని నా ఆశ. ఏమ్ చెయ్యను..ఏమ్ చెయ్యను..జానకీ! ఇది  నా బలహీనత!!" అంటూ తమ ఆవేదనను వెల్లడి చేసే సన్నివేశము లో అన్నగారి నటన అద్భుతం.
 ♦అలాగే సులోచనాలు పగిలిపోయి, అర్ధాంగి ఉత్తరం చదవలేక, అందరినీ అడగడం, చివరకు పగిలిన కంటి అద్దం ముక్క సహాయంతో చదవడం ..మరో ఉత్కృష్ట మైన సన్నివేశాన్ని అన్నగారు పండించిన తీరు న భూతో..!! కళ్ళు ధారాపాతంగాని ప్రేక్షకుడు వుండడు అంటే అతిశయోక్తి కాదు. అదీ..నటనపట్ల ఆ మహానుభావుని అంకితభావం!! అల్లుడు (రాజబాబుగారు) ప్రామిసరీ నోటు చింపేసినప్పుడు మాస్టారి  అసంకల్పిత స్పందన అద్భుతం. ఆ మహానటుని ప్రతిభా విశేషాలకు అద్దంపట్టే ఇలాంటి సన్నివేశాలెన్నో....!! 
♦ఆ రారాజు నట జీవితంలో మరో కలికితురాయి బడిపంతులు. 
పి.యస్: కోడలు జయంతి తో మాట్లాడే సన్నివేశం లో అగ్నికుమారి..జగదేగ ప్రతాపసింహుడు గుర్తొచ్చారా!! అంజమ్మతో అన్నగారిని చూస్తే లవకుశ సీతారాములు గుర్తొచ్చారా!!!
♦మరి.‌...మనమరాలు తో వేటగాడో..!!(సరదాగా)
 దటీజ్ ఒన్ అండ్ ఓన్లీ యన్.టీ.ఆర్!! 🙏🙏🙏
వాఖ్యానం శ్రీ శ్రీధర్ ముప్పిరాల గారు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩