♦నన్నయ్య గారు కౌరవుల కు కట్టిన పట్టం .!

#తెలుగుభారతం!

♦నన్నయ్య  గారు  కౌరవుల కు కట్టిన  పట్టం .!
#Mythili Abbaraju  ..
✍ముందే నన్ను అపార్థం చేసుకొని దూషించకండి. 
 కొండవీటి వెంకట కవి గారి ( దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వం ), 
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి ( ద్రౌపది )  వక్రీకృత దృక్పథాలకు మూలం 
తెలుగు భారతంలోనే ఉంది. అది కూడా నన్నయభట్టారకుల తెనిగింపులోనే. 
 సంస్కృత భారతం లో లేదుగాక లేదు. 
♦వ్యాసభారతం యథాతథానువాదాన్ని పరిశీలించగలిగితే అర్థమవుతుంది. పుస్తకాలు ఉన్నాయి. ఆన్ లైన్ లో కూడా శ్లోకానికి శ్లోకంగా అర్థం దొరుకుతుంది. 
https://www.sacred-texts.com/hin/mbs/index.htm 
 Mahabharata of Vyasa: Sanskrit Text with English https://www.amazon.in/.../ref=cm_sw_r_cp_apa_i_T38.Cb5TZKZQQ
♦నేను తెలుగుదాన్ని. నన్నయభట్టారకులంతటి వారి ని అగౌరవం పాలు చేయగల ధైర్యం , శక్తి నాకు లేవు, రావు. 
అయినా కూడా ఉన్న విషయాలను మనవిచేయకుండా ఉండలేకపోతున్నాను. " నుతజలపూరితములగు.." అన్న పద్యంలో 
సూనృత వాక్యమెంతటిదో ఆయనే చెప్పి ఉన్నారు కద.
♦1. a.సంస్కృత భారతంలో అంధుడైన ధృతరాష్ట్రుడికి రాజ్యార్హత 
లేదని పాండు రాజుకు పట్టాభిషేకం చేస్తారు. 
పాండురోగం శరీరపటిమకు అడ్డు రాదు కనుక ఆయన దిగ్విజయాలు చేస్తాడు. చాలా కాలం పాటు రాజధాని లో ఉండడు. 
గౌరవం కొద్దీ అన్నగారిని గద్దెమీద కూర్చోబెడతాడు .
 ♦ వేటలో , జింక రూపంలోని మునిదంపతులను కొట్టి సంతతి 
పొందలేని వాడిగా శపించబడినాక విరక్తుడై భార్యలిద్దరితో  వ
నాలకు వెళతాడు. అక్కడ , దేవతల వరాలవలన పాండవులు జన్మిస్తారు. 
ఆ కాలంలో  అటువంటి పుత్రులు పూర్తిగా ధర్మబద్ధమైన సంతానం. రాజకుమారులు కనుక , రాజ్యం వారిది. కొంత వయసువచ్చి, 
తండ్రి మరణం తర్వాత హస్తినాపురానికి తిరిగి వచ్చేలోపు కౌరవుల ది స్థానబలిమి అయి ఉంది. అందుకు ధృతరాష్ట్రుడి లోభం తోడయింది. 
 కౌరవుల కు రాజ్యం మీద హక్కు లేదు. వారు ఒట్టి దాయాదులు. 
♦b. నన్నయ భట్టారకులు ధృతరాష్ట్రుడి కి పట్టాభిషేకం జరిగినట్లు రచించారు. ఆ ప్రకారం గా పాండురాజు కేవలం రాజ సోదరుడు. 
పాండవులు రాజ బంధువులు. వారికి ఏ హక్కూ ఉండదు.
♦శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారంతటి వారు కౌరవులదే 
న్యాయమని వాదించటానికి ఆధారం నన్నయ గారి రచనే. 
 నన్నయ గారి కి ఎంత భక్తులైనప్పటికీ విశ్వనాథ వారు ఈ విషయమై 
ఏమీ మాట్లాడి ఉండకపోవటం ఉచితం కాదు. ఒక వేళ మాట్లాడి ఉంటే తెలియజేయండి. 
♦2.  మయసభలో దుర్యోధనుడు భంగపడినప్పుడు భీమార్జున  నకుల సహదేవులు మాత్రమే నవ్వారని వ్యాసభారతం లో ఉంది.  
♦మహారాజ్ఞి,అంతఃపురస్త్రీ అయిన ద్రౌపది  అక్కడ లేదు.
 నవ్వే అవకాశం లేదు. 
" పాంచాలి యును పాండుకుమారులును నగిరంత " అని
 నన్నయగారు రాశారు. 
♦ పినతండ్రి కొడుకు లు పరిహసించటం వేరు. వారి భార్య నవ్వటం చాలా వేరు.  సభలో అవమానించటానికి ఆ నవ్వే కారణమని భావిస్తూ వస్తున్నారు కాదా ?
♦3. సభలో వస్త్రాపహరణం జరగబోతుంటే ఆదుకొనే వారు లేక 
శ్రీకృష్ణుడిని ప్రార్థించిందనీ ఆయన అదృశ్యం గా ఆవిడ మర్యాదను కాపాడాడనీ సంస్కృత భారతంలో ఉంది. అప్పుడు ఆవిడ చేసిన స్తుతి శ్లోకాలున్నాయి. 
ఇందులో కొత్త ఏముందంటారా ?
♦నన్నయ గారి రచనలో కృష్ణు దలచె భీతయై అని ఒకే వాక్యం ఉంది.  దుశ్శాసనుడు లాక్కు వచ్చినప్పుడు. ఇంకా పద్యాలు, వచనాల  తర్వాత - 
వస్త్రాపహరణ ప్రయత్నం లో   చీర వెంట చీర వస్తుండి పోయిందని మాత్రమే ఉంది.  ఎందుకో ఎలాగో ఏ సూచనా లేదు. 
ఎందుకని అంత undertones ? 
తితిదే వారు ప్రచురించిన ప్రతులలోనూ ఆంధ్రభారతి లోనూ
 కూడా ఈ సంగతులు ఇలాగే ఉన్నాయి. 
 కృష్ణుడు ధర్మం వైపే ఉన్నాడు.  ముమ్మాటికీ. అందులో 
వివాదం ఈషణ్మాత్రమూ లేదు. 
♦ కంసుడి వస్తాదు  చాణూరుడు ఆంధ్రుడట. కురుక్షేత్రంలో ఆంధ్రులు 
కౌరవుల పక్షాన పోరాడారట. 
 ' భగవంతుని మీది పగ ' ఉందా మనకు ? 
 పాపం శమించుగాక !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩