🚩పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం! (రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌సె
🚩పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం! (రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌సెప్టెంబర్ 2009.) ఆరు దశాబ్దాలనాటి పాటల గురించి ఇప్పుడు రాయడం, నాలుగు దశాబ్దా క్రితం మరణించిన గాయకుణ్ణి తలుచుకోవడం న్యాయంగా పాతచింతకాయపచ్చడి అనిపించుకోవాలి. కాని ఘంటసాల విషయంలో అలా జరగదు. ఆయన కుటుంబసభ్యులే ఆశ్చర్యంతో చెప్పుకున్నట్టుగా ఘంటసాల చివరిరోజులలో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ జనాదరణ పొందుతున్నాడు. పెద్దలు క్షమిస్తే, ఇది తరవాత వచ్చిన సంగీతం ప్రభావం అని నేననుకుంటాను. 👉🏿ఒక 78 ఆర్.పీ.ఎం. రికార్డు రెండువేపులా వినిపించే ఈ ఆరే ఆరు పద్యాల గీతావళి ఈనాటికీ అభిమానులను అలరిస్తుంది. నిజం చెప్పాలంటే అభ్యుదయ కవిత్వం తెలుగువారిని ఉత్తేజపరిచిన 1950లలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారివంటి కవుల రచనలకు ఇంతటి ప్రజాదరణ కలగటానికి ఏకైక కారణం ఘంటసాల స్వరపరచి పాడడమే. ఇందులోని రాగాలన్నీ హిందూస్తానీవే. భావప్రధానంగా సాగే కవిత్వం కనక ఇది సహజమే నేమో. తక్కిన పాటలూ, పద్యాలలోలాగే ఇందులోకూడా ఘంటసాలకు రాగలక్షణాలమీద ఉన్న పట్టూ, కవి రాసిన భావాన్ని గురిగా పట్టుకోవడం, నాటకీయమైన గాత్రశైలీ అన్నీ మనం చూడవచ్చు. కుంతీకుమారిలాగే ఈ పద్యాల మధ్యలో ఆయన తాను రా