-భాష--సామెతలు 🚩ఉడుతా భక్తిగా
-భాష--సామెతలు
-ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు
ఉంచుకున్నవాడు మొగుడూ కాదు - పెంచుకున్నవాడు కొడుకూ కాదు
ఉంటే అమీరు - లేకుంటే పకీరు
ఉంటే ఉగాది - లేకుంటే శివరాత్రి
ఉంటే ఊరు - పోతే పాడు
ఉంటే లిక్కి - పోతే కొడవలి
ఉండ ఇల్లు లేదు - పండ మంచం లేదు
ఉండమనలేక వూదర, పొమ్మనలేక పొగ పెత్తినట్లు
ఉండవే పెద్దమ్మా అంటే కుండ పుచ్చుకు నీళ్ళు తెస్తానందట
ఉండి చూడు వూరి అందం - నానాటికీ చూడు నా అందం అన్నట్లు
ఉండేది ఒక పిల్ల - వూరంతా మేనరికాలు
ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా?
ఉండ్రాళ్ళూ ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకూ ఒక మొగుడేనా?
ఉగ్గుతో నేర్చిన గుణం నుగ్గులతోగానీ పోదన్నట్లు
ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లు
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట
ఉట్టికి నాలుగు చేరులు తెగినట్లు
ఉట్టిమీద కూడు - వూరిమీద నిద్ర
ఉడకవే ఉడకవే ఓ ఉల్లిగడ్డా! నీవెంత వుడికినా నీ కంపు పోదే!
ఉడకవే ఉడకవే ఉగాదిదాకా అంటే నాకేం పనిలేదు యేరువాక దాకా అందట
ఉడిగి ఉత్తరదిక్కు చేరినట్లు
ఉడుతా భక్తిగా
ఉడుత ఊపులకు చింతకాయలు రాలుతాయా?
ఉడుము క్రొవ్వి పోలేరమ్మను పట్టుకొన్నట్లు
ఉత్త కుండకు వూపు లెక్కువ
ఉత్తగొడ్డుకు అరుపు లెక్కువ
ఉత్తచేతులతో మూర వేసినట్లు
ఉత్తపుణ్యానికి మొత్తుకు చచ్చినట్లు
ఉత్తర ఉరిమి కురిసినా, త్రాచు తరిమి కరిచినా తిరుగులేదు
ఉత్తర జూచి ఎత్తర గంప
ఉత్తర పదును - ఉలవకు అదును
ఉత్తరపు వాకిలి యిల్లు వూరి
కే యిచ్చినా తీసుకోరాదు
కే యిచ్చినా తీసుకోరాదు
ఉత్తరలో పూడ్చేకంటే గట్లమీద కూర్చుని ఏడ్వటం మేలు
ఉత్తరలో చల్లిన పైరు కత్తెరలో నరికిన కొయ్య
ఉత్తరాన మబ్బు పట్టితే వూరికే పోదు
ఉత్తరాయణం వచ్చింది ఉరి పెట్టుకో మన్నాడుట
ఉదయం ముద్దుల ఫలహారం - మధ్యాహ్నం కౌగిలి భోజనం - రాత్రికి అందాల విందులు అందట
ఉదర పోషణార్ధం బహుకృత వేషం
ఉద్దర అయితే వూళ్ళు కొంటారు, నగదు అయితే నశ్యంకూడా కొనరు
ఉద్దర అయితే నా కిద్దరన్నట్లు
ఉద్యోగం పురుష లక్షణం
ఉద్యోగం పురుష లక్షణం గదా! గొడ్డలి తేరా నిట్రాడు నరుకుదాం అన్నాడట
ఉద్యోగికి ఒక వూరనీ లేదు - ముష్టివానికి ఒక యిల్లనీ లేదు
ఉద్యోగానికి దూరభూమి లేదు
ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదు
ఉన్న వూరివాడికి కాటి భయం - పొరుగూరు వాడికి నీళ్ళ భయం
ఉన్న వూరూ - కన్న తల్లీ ఒక్కటే
ఉన్న వూరూ - మన్న ప్రజా
ఉన్నది ఉన్నట్లంటే వూరొచ్చి మీద పడింది
ఉన్నది ఒక కూతురు - వూరంతా అల్లుళ్ళు
ఉన్నది పోదు -లేనిది రాదు
ఉన్నదే మనిషికి పుష్టి - తిన్నదే గొడ్డుకి పుష్టి
ఉన్నదీ పోయె వుంచుకున్నదీ పోయె అన్నట్లు
ఉన్ననాడు ఉట్ల పండుగ - లేనినాడు లొట్లపండుగ
ఉన్న మాటంటే వున్నవూరు అచ్చిరాదుట
ఉన్నమాటంటే వులుకెక్కు వన్నట్లు
ఉన్నమాట అంటే వూరికే చేటు
ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టే
ఉన్నవాడు వూరికి పెద్ద - చచ్చినవాడు కాటికి పెద్ద
ఉపకారం అంటే వూళ్ళోంచి లేచిపోయినట్లు
ఉపకారానికి పోతే అపకారం జరిగినట్లు
ఉపదేశం లావు - ఆచరణ తక్కువ
ఉపాయం లేనివాడు ఉపవాసంతో చచ్చాడన్నట్లు
ఉపాయం లేనివాడ్ని ఊళ్ళోంచి వెళ్ళగొట్ట మన్నారు
ఉపాయవంతుడు ఊరికి నేస్తం
ఉపాయాలున్నవాడు ఊరిమీద బ్రతుకుతాడు
ఉప్పు ఊరగాయ కాదు
ఉప్పు తిన్నవాడు ఉపకారం చేస్తాడు
ఉప్పుతో తొమ్మిది, పప్పుతో పది అన్నట్లు
ఉప్పు మూటలు నీట ముంచినట్లు
ఉప్పు లేని కూర - పప్పు లేని పెండ్లి
ఉప్పు వేసి పొత్తు కలిపినట్లు
ఉభయ భ్రష్టత్వం - ఉప్పరి సన్యాసం అన్నట్లు
ఉమ్మడి పనికి బడుగు - సొంత పనికి పిడుగు
ఉమ్మడి బర్రె పుచ్చి చచ్చిందన్నట్లు
ఉమ్మడి బేరం, ఉమ్మడి సేద్యం యిద్దరికీ చేటు
ఉయ్యాలలో బిడ్డను పెట్టి వూరంతా వెదకినట్లు
ఉరిమిన మబ్బు కురవక మానదు
ఉరిమిన మబ్బు, తరిమిన పాము వూరికే పోవు
ఉలవకాని పొలం వూసరక్షేత్రం
ఉలవ చేను పెట్టే మగడు వూరకుండక ప్రత్తి చేను పెట్టి ప్రాణం మీదకు తెచ్చాడు
ఉలిపి కట్టె కేలరా వూళ్ళో పెత్తనాలు?
ఉల్లి వుంటే మల్లి కూడా వంటలక్కే
ఉల్లి ఉల్లే - మల్లి మల్లే
ఉల్లి ఊరినా మల్లి పూసినా మంచి నేలలోనే
ఉల్లి ఎంత ఉడికినా కంపు పోదు
ఉల్లి గడ్డంత కోడలు వస్తే స్మశానంలో వున్న అత్తగారు వులిక్కిపడిందట
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు
ఉల్లి తిన్న కోమటి నోరు మూసుకున్నట్లు
ఉల్లినీ తల్లినీ నమ్మి చెడినవారు లేరు
ఉల్లి పది తల్లుల పెట్టు
ఉల్లిపాయంత బలిజ వుంటే వూరంతా చెడుతుంది
ఉల్లిపాయపెట్టని కోమటి వూరంతా ధారపోసినట్లు
ఉల్లి మల్లెవుతుందా? వుంచుకున్నది పెళ్ళామవుతుందా?
ఉల్లి ముట్టనిదే వాసన రాదన్నట్లు
ఉసిరికాయలంత వుంటే వూరంతా ఏలవచ్చు
ఊకదంపుడు మాటలు
ఊకని దంపితే చియ్యం వస్తాయా?
ఊపిరి వుంటే ఉప్పుగల్లు అమ్ముకొని బ్రతకవచ్చు
ఊపిరి పట్టితే బొజ్జ నిండుతుందా?
ఊరంతా ఉత్తరం వైపు చూస్తే అక్కుపక్షి దక్షిణం వైపు చూస్తుందిట
ఊరంతా ఒక త్రోవ - వులిపికట్టెది ఇంకొక త్రోవ
ఊరంతా చుట్టాలే వుట్టి కట్టుకోను చోటు లేదు
ఊరంతా తిరిగి యింటి ముందుకు వచ్చి పెళ్ళాంబిడ్డలను తలచుకుని కాళ్ళు విరగబడ్డాడుట
ఊరంతా నాన్నకు లోకువ - నాన్న అమ్మకు లోకువ
ఊరంతా వడ్లెండ బెట్టుకుంటుంటే, నక్క తోక ఎండ బెట్టుకున్నదట
ఊరకరారు మహాత్ములు
ఊరపిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు
ఊరించి వూరించి బెల్లం పెట్టినట్లు
ఊరికళ వూరి గోడలే చెపుతాయి
ఊరికి వచ్చినమ్మ నీళ్ళకు రాదా?
ఊరికే పెట్టే అమ్మను నీ మొగుడితో పాటు పెట్టమన్నట్లు
ఊరికే కూర్చునేవాడికి వురిమినా వుత్తేజం రాదు
ఊరికి వస్తే మావాడింకొక డున్నాడన్నట్లు
ఊరి గబ్బు చాకలికి తెలుసు
ఊరి దగ్గరి చేనుకు అందరూ దొంగలే
ఊరినిండా అప్పులు - తలనిండా బొప్పెలు
ఊరి మీద వూరు పడ్డా కరణం మీద కాసు పడదు
ఊరి ముందర చేను - ఊళ్ళో వియ్యము అందిరావు
ఊరి ముందరి చేను వూరపిచ్చుకల పాలన్నట్లు
ఊరిలో కుంటి - అడవిలో లేడి
ఊరి వారి పసుపు - ఊరి వారికుంకుమ అన్నట్లు
ఊరి వారి వత్తి, వూరి వారి చమురు, వూగు దేముడా వూగు అన్నట్లు
ఊరుంటే మాదిగవాడ, మాలవాడ వుండవా?
ఊరు ఉసిరికాయంత - తగవు తాటికాయంత
ఊరుకు చేసిన వుపకారం - పీనుగుకు చేసిన శృంగారం ఒకటే
ఊరు పొమ్మంటోంది - కాడు రమ్మంటోంది
ఊరు మారినా పేరు మారదన్నట్లు
ఊళ్ళేలని వాడు రాజ్య మేలుతాడా?
ఊళ్ళో లేని మొగుడుకన్న - ఉపాదానమెత్తే మొగుడు మేలు
ఊళ్ళో యిల్లు లేదు - పొలంలో చేను లేదు
ఊళ్ళో పెళ్ళయితే కుక్కలకు హడావిడన్నట్లు
ఊళ్ళో ముద్ద - గుళ్ళో నిద్ర
ఊళ్ళో వియ్యం - ఇంట్లో కయ్యం
ఊళ్ళో వియ్యం కలతల నిలయం
ఊసరవెల్లిలాగా రంగులు మార్చినట్లు
ఊహ వూళ్ళేలుతుంటే - రాత రాళ్ళు మోస్తున్నదిట
ఋణము - వ్రణము ఒక్కటే
ఋణ శేషము, వ్రణశేషము, శత్రుశేషమూ వుండరాదు
ఋషీ మూలం, నదీ మూలం, స్త్రీమూలం విచారించరాదు
Comments
Post a Comment