❤️చిత్ర కవిత్వం.❤️ 🚩



తిక్కన భారతంలో ఒక పద్యాన్ని తలుచుకు తీరాలి .!

.ఉత్తరగోగ్రహణ సందర్భంలో అంతఃపుర కాంతల ముందు ప్రగల్భాలు పలికి

కురుసైన్యం మీదికి యుద్ధానికి వెళ్ళిన ఉత్తరుడు సముద్రంలా ఎదట ఉన్న

ఆ సైన్యాన్ని చూసి అనే మాటలివి.

💥"#భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు; దుర్యోధన

గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు; శస్త్రాస్త్ర జా

లోష్మ స్ఫార చతుర్విధోజ్వ్జల బలాత్యుగ్రం; బుదగ్ర ధ్వజా

ర్చిష్మత్వాకలితంబు; సైన్య మిది; ఏ జేరంగ శక్తుండనే!."💥

🚩🚩

♦దీన్లో కురు సైన్యాన్ని నాలుగు భీకరమైన సమాసాల్తో 

మన కళ్ళ ఎదుట చూపించిన ఉత్తరుడు చివరికి తన గురించి చెప్పుకునే సరికి వాడిన పదం “ఏన్‌” అనేది అంటే,

 “నేను” అని అనుకోటానిక్కూడా అతనికి ధైర్యం చాల్లేదన్న మాట.

🔻🔻

♦కౌరవ సేనలను చూసి ఉత్తరకుమారుడు భీతిల్లుట

అల్లంత దూరంలో రేగిన మట్టిని చూసి కౌరవ సైన్యాన్ని చేరుకున్నాడు. కౌరవ సేనను తేరిపార చూసిన ఉత్తర కుమారుడు భయపడ్డాడు.

 " బృహన్నలా! భీస్ముడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు మొదలగు వీరులు అసఖ్యాకమైన శస్త్రాస్త్రాలతో కౌరవ సేన భయంకరంగా ఉంది. నేను వీరితో యుద్ధం చేయగలనా. నాకు విలు విద్యలో అంత ప్రావీణ్యత లేదు. బాలుడను విలువిద్యలో నిష్ణాతులైన శకుని, జయద్రధ, దుర్ముఖ, వికర్ణ, కర్ణ మొదలైన వీరులతో నేనేమి యుద్ధం చేయగలను. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుందని వచ్చాను. 

నీవేమో నీపాటికి రథం నడుపుతున్నావు. నేను కౌరవసేనతో యుద్ధం చేయలేను. రథమును వెనుకకు పోనిమ్ము. ఎవరి ప్రాణములు వారికితీపి కదా. నా శరీరం వణుకుతుంది " అన్నాడు. అర్జునుడు " ఉత్తరకుమారా ! అసంఖ్యాకంగా ఉన్న కౌరవసేనల వైపు రథం ఎందుకు నడిపిస్తాను. కొద్ది పాటి సైన్యాల రక్షణలో ఉన్న గోసమూహాల వైపు రథాన్ని నడిపిస్తాను. వారిని ఎదిరించి మన గోవులను మళ్ళిస్తాము. అంతఃపురంలోని కాంతలతో గోవులను మళ్ళించి తీసుకువస్తాను అని చెప్పావు కదా ఇప్పుడు ఇలా బెదిరి పోవడం తగునా " అన్నాడు. ఉత్తరుడు " అమ్మో! గోవుల మాటలు దేవుడెరుగు. అంతఃపుర కాంతల సంతోషంతో నాకేమి పని " అన్నాడు.

                             🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐