❤️పెండ్యాల రాగాలు-భాగ్యరేఖ❤️

 


🚩🚩‘భాగ్యరేఖ’ సినిమాకు దేవులపల్లి కృష్ణశాస్త్రి,

కొసరాజు రాఘవయ్య చౌదరి, ఎరమాకుల ఆదిశేషారెడ్డి పాటలు రాయగా పెండ్యాల నాగేశ్వరరావు మొదటిసారి బి.ఎన్‌ చిత్రానికి సంగీతదర్శకునిగా పనిచేశారు.

ఎ.ఎం.రాజా, మాధవపెద్ది, మల్లిక్, మోహనరాజ్, సుశీల, జిక్కి, వైదేహి, సత్యవతి పాటలు ఆలపించారు.

🚩🚩 ఈ సినిమాలో పెండ్యాల హిందీ సినిమా బాణీని అనుకరించి సంగీతం సమకూర్చడం వింతగా చెప్పుకోవాలి. కారణమేమైనా అనుకరణ పాటకు బి.ఎన్‌. సినిమాలో బీజం పడటం విశేషమే!

అది కృష్ణశాస్త్రి రచించిన ‘మనసూగే సఖ, తనువూగే ప్రియ, మదిలో సుఖాల డోలలూగే... ఏ మధువా నేనోయి ప్రియా’ పాట.

దానిని ఎ.ఎం.రాజా, సుశీల అలపించారు. ‘నాగిన్‌’ సినిమాలో లతామంగేష్కర్‌ ఆలపించగా హేమంతకూమార్‌ స్వరపరచిన

‘మన్‌ డోలే మేరె తన్‌ డోలే మేరె దిల్‌కా గయా ఖరారే ఏ కౌన్‌ బాజాయే బాసురియా’ పాటకు మక్కికి మక్కి అనుసరణ.

🚩🚩 ఈనాటికీ చెక్కుచెదరని ఆదరణతో వినిపించే పాట

సుశీల ఆలపించిన కృష్ణశాస్త్రి గీతం ‘నీవుండేదా కొండపై నాస్వామి నేనుండేదీ నేలపై’. అయితే ఇందులోనే కృష్ణశాస్త్రి రాయగా

రాజా పాడిన ‘నీ సిగ్గే సింగారమే ఓ చెలియ నీ సొగసు బంగారమే’ పాట కూడా ఇదే ట్యూనులో స్వరపరచడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

🚩🚩

రాజా, సుశీల ద్విగళ గీతం ‘కన్నీటి కడలిలోన చుక్కానిలేని నావ’ పాట ఎన్టీఆర్, జమున మీద చిత్రీకరించారు. ఎరమాకుల ఆదిశేషారెడ్డి రచించిన ‘లోకం గమ్మత్తురా ఈలోకం గమ్మత్తురా... చెయ్యాలి ఏదో మరమ్మత్తురా’ అనే గమ్మత్తు పాటను మాధవపెది,్ద సత్యవతి ఆలపించారు.

🚩🚩 కొసరాజు గీతం ‘ఆన్‌ మేరే ఆన్‌ మేరే దేఖోజి మందు మజా’ మాధవపెద్ది ఆలపించారు. మరో దేవులపల్లి గీతం ‘తిరుమల మందిర సుందరా’ను మల్లిక్‌ ఆలపించారు. అంతర్నాటకంలో వచ్చే తిలోత్తమ, సుందోపసుందుల కొసరాజు పాట ‘అందాల రాజెవడురా నా వన్నెకాడు ఎందుదాగి యున్నాడురా’ను జిక్కి, మోహనరాజ్‌ పాడారు.

🚩 జిక్కి ‘కన్నె ఎంతో సుందరి సన్నజాజి పందిరి’ అనే కృష్ణశాస్త్రి పాటను కూడా పాడింది.

🚩🚩

* ఈ సినిమాలో ఎన్టీఆర్‌ది హీరోగా చాలా చిన్న పాత్ర. అయినా బి.ఎన్‌.మీద వున్న గౌరవంతోనే ఇందులో ఎన్టీఆర్‌ నటించారు. అలాగే ‘రోజులు మారాయి’ సినిమాలో అక్కినేని ప్రక్కన హీరోయిన్‌గా నటించిన షావుకారు జానకి కూడా బి.ఎన్‌.రెడ్డి మీద భక్తిప్రపత్తులతోనే ‘భాగ్యరేఖ’ సినిమాలో రేలంగికి జోడీగా నటించింది.

🚩🚩

* విజయా సంస్థ అధిపతి, బి.ఎన్‌.తమ్ముడు బి.నాగిరెడ్డి ఈ సినిమా నిర్మించిన రోజుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో సభ్యునిగా వుండేవారు. అలా టిటిడి యాజమాన్యం బి.ఎన్‌ రెడ్డికి తిరుమలలో షూటింగు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఇందులో తిరుమల మాడవీధులు, స్వామివారి పుష్కరిణి, డోలీలు కట్టించుకొని వచ్చే యాత్రికుల ప్రయాణం వంటి ఎన్నో అరుదైన దృశ్యాలను చిత్రీకరించారు. ఈ చిత్రం పుణ్యమా అంటూ వాటిని చూడవచ్చు.

🚩🚩

* ‘భాగ్యరేఖ’ సినిమాకు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐