🚩🚩- దాల్భ్యుమహర్షి .-🌹🌹

♦పౌరాణిక మహా భక్తశిఖామణులలో ముఖ్యులను నిత్యం స్మరించి


 తరించమని మనవారు ఒక శ్లోకం చెప్పారు .

శ్లో. ప్రహ్లాద నారద పరాశర పుండరీక 

వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్  

రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్

“పుణ్యా”నిమాం “పరమభాగావతాన్” స్మరామి❤

  ♦ఈశ్లోకం బట్టీ పడతాం చదువుతాం చేతులెత్తి వారికి నమస్కరిస్తాం .నిన్న ఎందుకో పై శ్లోకం నాకు స్పురణకు వచ్చింది .చటుక్కున ఇందులో అందరు మహానుభావులూ, తెలిసినవారే  

♦మరి దాల్భ్యుడు గురించిన చరిత్ర తెలియ లేదే అనే ప్రశ్న బయల్దేరింది .

  ♦చాలాకాలం క్రితం నైమిశారణ్య మహర్షులు ఒక హోమం నిర్వ హించటానికి పూనుకొని ధృతరాష్ట్ర మహా రాజు దగ్గరకు వెళ్లి కొంత ధనం కోరారు .ఈ మహర్షులకు నాయకుడు దాల్భ్యుడుఅనే మహా తపస్సంపన్నుడైన మహర్షి .ఈయననే ‘’బక ‘’అంటారు .ఈయనే రాజును డబ్బు అడిగింది .రాజు డబ్బు ఇవ్వకపోవటమే కాదు ,ఆయన్ను అవమానించాడు కూడా .

♦ఈ పరాభవాన్ని సహించలేక దాల్భ్యమహర్షి ప్రతీకారం చేయాలని భావించి హోమం తలపెట్టి చేసి అందులో హవిస్సుగా ధృత రాష్ట్ర సామ్రాజ్యాన్ని అగ్నికి సమర్పించాడు 

.ఈ యాగాన్ని ‘’పృధూదక’’లో ‘’అవికీర్ణ మహా తీర్ధం ‘’లో చేశాడు .దీనితో  ధృత రాష్ట్ర  సామ్రాజ్యం పతనం చెందటం ప్రారంభించింది .మంత్రి ,పురోహిత,కార్తాంతిక  ముఖ్యులను సంప్రదించి ఇలా జరగటానికి కారణం విచారించాడు .వారందరూ దీనికి కారణం దాల్భ్యుని హోమం అని ముక్తకంఠంగా చెప్పారు  .కంగారు పడ్డ మహారాజు అంతులేని ధనరాసులతో పరివార సమేతంగా దాల్భ్యుడు హోమం చేసిన ‘’అవకీర్ణ మహా తీర్థానికి ‘’వెళ్ళాడు.తాను  తెచ్చిన సంపద అంతా దాల్భ్యమహర్షి పాదాల చెంత ఉంచి, తప్పు మన్నించమని వేడుకొన్నాడు .ఉదార హృదయం తో రాజు తప్పు మన్నించి, దాల్భ్యుడు మళ్ళీ హోమం నిర్వహించి అందులో హవిస్సుగా పాలు ,తేనె, సమర్పించగా ,సామ్రాజ్యంలో చనిపోయినవారంతా పునరుజ్జీవితులయ్యారు అని వామన పురాణ0లోని  39 వ అధ్యాయం లో ఉంది .

అంతటి శక్తి సంపన్నుడు దాల్భ్యమహర్షి .


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩