🚩🚩నాలో నేను ! (భానుమతి గారి ఆత్మ కధ నుండి . .)
♦నాకు మధ్య తరగతి జీవనమే ఇష్టం.
పెళ్ళైన కొత్తలో మాంబళం (మద్రాసు) మహాలక్ష్మి స్ట్రీట్
ఇంటి నెంబరు 12లో ఉండేవాళ్ళం. పదిహేను రూపాయలు అద్దె.
♦ఆ రోజుల్లో మేమిద్దరం చూసిన ఇంగ్లీష్, హిందీ సినిమాలు,
తిన్న ఐసుక్రీములు , తిరిగి ఇంటికి రావడానికి మౌంట్ రోడ్డులో పదకొండో నెంబరు బస్సుకోసం వెయిట్ చేయడం, అది రాకపోతే మళ్ళి సినిమాకెళ్ళడం ఇప్పటికి నా స్మృతి పధంలో మెదులుతాయి.
♦ఈ రోజుల్లో కార్లు, బంగళాలు ఇవ్వలేని సుఖశాంతులు ఆ రోజులు నాకందించాయని ఇప్పటికీ నమ్ముతుంటాను.
.
♦రామారావుగారంటే నాకు చాలా గౌరవం.
చాలాసార్లు నా దగ్గర సలహాలు తీసుకొనేవారు.నాకు రఘుపతి వెంకయ్య
అవార్డు ఇచ్చినప్పుడు నా చేతికి బంగారు కంకణాన్ని తోడిగారు.
♦ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాదులో
నన్ను ఘనంగా సన్మానించారు.
ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అత్తయ్య వచ్చిందంటూ పిల్లలందరినీ
పిలిచి కాళ్ళకు నమస్కారం చేయించేవారు.
.
♦నాకు మొదటినుంచి కర్ణాటక సంగీతం అంటే చాలా ఇష్టం.
మా సొంత సినిమాల్లో కచ్చితంగా క్షేత్రయ్య పదమో, త్యాగరాజ కీర్తనో, జయదేవాష్టపదో పెట్టేదాన్ని.
అది నేను మా నాన్నగారికి చేసిన వాగ్దానం. అదొక శాసనంగా తీసుకున్నాను. ♦త్యాగరాజ కీర్తనలు సినిమాల్లో పెడితే ఎవరు చూస్తారు.
సిగరెట్లకి బయటకు వెళతారు అని మా వారు విసుక్కునేవారు.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Comments
Post a Comment