🚩🚩బుద్ధావతారము.🚩🚩
శుభోదయం 🌷 🙏🏾 శ్రీ కృష్ణ శతకం 🙏🏾 - (శ్రీ నరసింహ కవి.) ♦#త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణా!❤ ♦భావం: ఓ కృష్ణా! నువ్వు బౌద్ధావతారం ఎత్తావు. త్రిపురాసురులనే రాక్షసుల భార్యలను చాకచక్యంగా వ్రతము చేత కీర్తితో నిలిపావు. కపటపు ప్రభువు వలె ఉన్నావు. నువ్వు దయాగుణం కలిగిన బుద్ధదేవుడివి. 🔔🔔🔔🔔🔔🔔🔔🔔 🚩🚩బుద్ధావతారము.🚩🚩 ♦#బుద్ధావతారము విష్ణువు దశావతారాలలో ఒకటి. ♦బుద్దావతారము క్షణ కాలము మాత్రమే ఉంది. విష్ణుమూర్తి రాక్షసుని చంపడానికి దిగంబర అవతారము ఎత్తుతాడు. అందుకని ఈ అవతారమును పూజించరు. అంతకు ముందరి అవతారమైన కృష్ణావతారమును పుజిస్తారు. కృష్ణార్పణం అంటారు. బుద్దార్పణం అనరు. ❤పురాణ గాథ ♦త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేక పోతారు.అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింప చేయడానికి, లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపు