🔴 -పులిహోర ఆవకాయ.-🔴



#పులిహోర ఆవకాయ.

రేడియో రోజుల్లో శ్రోతలు కోరిన పాటలు అనీ, సిలోన్ లో మన్ చాహేగీతనీ, 

ఇక బుధవారం రాత్రి ఎనిమిదికి అమీన్ సయానీ చేసేహడావుడి 

గుర్తుందా, బినాకా గీత్ మాలా అనీ ఆ తరవాత రోజుల్లో సిబాకా గీత్ 

మాలనీ, అదో ప్రపంచం.

ఆ పాటలకి గ్రేడింగూ ఒకటో నంబర్ మీద వచ్చే పాటకి పెద్ద బిల్డప్పూ, ఇలోగా మిత్ర బృందం ఏ పాటొస్తుందో పందాలూ,

ఆధా హై చంద్రమా రాత్ ఆధీ రహన జాయే తేరీ మేరీ బాత్ ఆధీ, 

ములాకాత్ ఆధీ

(आधा है चंद्रमा रात आधी रहनजायॆ तॆरी मॆरी बात आधी मुलाकात आधी…)

ఏంటి అర్ధమయిందా వయసులో 🙂 ఏదో మంచిపాటేలే నవర్ంగ్ లోది అని సరిపెట్టుకోడాలూ, 

ఇలా నేటి కాలానికి పాఠకులు

కోరిన టపాలూ రాసేవాణ్ణి కాని మానేశాను, ఇదిగో మళ్ళీ వద్దనుకుంటూనే మొదలయింది.

గోజిలలో అంటే (గోదావరి జిల్లాలో )ఆవకాయ పెట్టడంలో

వైవిధ్యం ఎక్కువ. చెప్పుకోవాలంటే

#పులిహోర ఆవకాయ,#పెసరావకాయ,#శనగల ఆవకాయ, #నూపిండి ఆవకాయ ఇలా ఎన్నో, ఎన్నో రకాలు.

ఈ రకాల ఆవకాయలకి అన్నిటికి ఒక ప్రత్యేకత, ముక్కలు చిన్న చిన్నవిగా ఉండాలి. డొక్క ఉంటే సరి,లేకున్నా ఫరవాలేదు..

ఎంత చిన్నవైతే ముక్కలు, అంత మంచిది.

ఈ ఆవకాయలు నిలవ ఉండేది తక్కువ. ఊరగాయల కాలంకి మూడు నాలుగు నెలల్లో అవకొట్టేయాలి, లేకపోతే బూజెక్కిపోతాయి

.వీట్లో కొన్నిటిని ఎరుగుదును,కొన్నిటిని ఎరగను.

పెసరావకాయ,శనగల ఆవకాయ, నువు పిండి ఆవకాయ:-

పెసరపిండి కారం,ఉప్పు సమానంగా తీసుకోవాలి నూనెతో గుచ్చెత్తాలి,చిన్నగా చేసుకున్నముక్కలు కలిపెయ్యాలి. పైన నూనెపోసుకోవాలి. కొందరైతే పెసలు కూడా పైన వేస్తారు. అవి నూనెలో,ఊటలో ఊరి బాగుంటాయి.ఆవ ఉండదు.

శనగావకాయ కూడా ఇంతే, కాబూలీ శనగలని పెద్ద శనగలు వేస్తారు. నువు పిండి ఆవకాయ కూడా ఈ కోవలోదే.నువుపిండి,మెంతి,ఉప్పు ,కారం కలుపుతారు. ఇదో రుచీ.

పులిహోర ఆవకాయకి ముక్కలు చిన్నవిగా ఉంటాయి,మెంతి,కారం,ఉప్పు పోస్తారు, నూనెతో గుచ్చెత్తుతారు. ఆపై ఎండు మిర్చి ముక్కలు చేసుకుని, శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, మెంతులు తో పోపు పెడతారు. కొందరైతే ఇంగువ కూడా వేస్తారు.ఇవన్నీ నూనెలో పుల్లటి ఊటలో నాని తింటుంతే ఆదో రుచి.

కొన్ని మరచిపోయానేమో కూడా సుమా.

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩