❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️ (శ్లోకం 31నుండి 38 వరకు .)

 

👉👉ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః 👈👈

❤️అథ శ్రీ లలితా సహస్రనామావలీ .❤️

(శ్లోకం 31నుండి 38 వరకు .)

శ్లోకం  31.

♥️♦

ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయై నమః |

ఓం భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యై నమః |

🚩🚩

మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.

భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ - రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది

శ్లోకమ్ 32

♥️♦

ఓం కరాంగులినఖోత్పన్ననారాయణదశాకృత్యై నమః | 80

ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికాయై నమః |

🚩🚩

కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.

మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా - మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది .

శ్లోకం 33

♥️♦

ఓం కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభాండాసురశూన్యకాయై నమః |

ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవాయై నమః |

🚩🚩

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా - కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరం గలది.

బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవా - బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.

శ్లోకం 34

♥️♦

ఓం హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధ్యై నమః |

ఓం శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజాయై నమః |

🚩🚩

హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః - శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.

శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా - మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.

శ్లోకం  35

♥️♦

ఓం కంఠాధః కటిపర్యంతమధ్యకూటస్వరూపిణ్యై నమః |

ఓం శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణ్యై నమః |

ఓం ఓం మూలమంత్రాత్మికాయై నమః |

🚩🚩

కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ - కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.

శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ - శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.

శ్లోకం  36

♥️♦

ఓం మూలకూటత్రయకలేబరాయై నమః |

ఓం కులామృతైకరసికాయై నమః | 

ఓం కులసంకేతపాలిన్యై నమః |

🚩🚩

మూలమంత్రాత్మికా - మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.

మూలకూట త్రయకళేబరా - మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.

కులమృతైక రసికా - కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.

కులసంకేత పాలినీ - కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.

శ్లోకం 37

♥️♦

ఓం కులాంగనాయై నమః |

ఓం కులాంతఃస్థాయై నమః |

ఓం కౌలిన్యై నమః |

ఓం కులయోగిన్యై నమః |

ఓం అకులాయై నమః |

ఓం సమయాంతస్థాయై నమః |

ఓం సమయాచారతత్పరాయై నమః |

🚩🚩

కులాంగనా - కుల సంబంధమైన స్త్రీ.

కులాంతఃస్థా - కులము యొక్క మద్యములో ఉంది.

కౌలినీ - కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.

కులయోగినీ - కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.

అకులా - అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.

సమయాంతఃస్థా - సమయాచార అంతర్వర్తిని.

సమయాచార తత్పరా - సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.

శ్లోకం 38.

♥️♦

ఓం మూలాధారైకనిలయాయై నమః |

ఓం బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః | 100

ఓం మణిపూరాంతరుదితాయై నమః |

ఓం విష్ణుగ్రంథివిభేదిన్యై నమః |

🚩🚩

మూలాధారైక నిలయా - మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.

బ్రహ్మగ్రంథి విభేదినీ - బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.

మణిపూరాంతరుదిరా - మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.

విష్ణుగ్రంథి విభేదినీ - విష్ణుగ్రంథిని విడగొట్టునది.

     ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩