🔴 -షష్ఠీవిభక్తి. !-🔴


🔴 -షష్ఠీవిభక్తి. !-🔴

.

#విభక్తులలో చాల తికమకలు పెట్టించునది షష్ఠీ

విభక్తి. షష్ఠీ విభక్తి ప్రత్యయములు యొక్క,

కి(న్), కు(న్), లో(న్), లోపల(న్).

.

షష్ఠీవిభక్తి ప్రత్యయములలో ఎక్కువగా వాడబదునది

కి, కు లు సంప్రదానార్థములో మాత్రమే. తెలుగు

కావ్యముల ప్రత్యేకతలలో షష్ఠ్యంతములు

ప్రసిద్ధమైనది. ప్రార్థన, సుకవి ప్రశస్తి,

కుకవి నింద, కృతిభర్త, కృతికర్త వంశములు,

కావ్యకారణము, ఇవి చెప్పిన పిదప కథకు ముందు

షష్ఠీ విభక్తితో అంతమగు కంద పద్యములు నన్నయ

తప్ప మిగిలిన కవు లందఱు వ్రాసినారు.

శాస్త్రీయసంగీతకార్యక్రమములలో సామాన్యముగా చివరి


పాట-

నీ నామ రూపములకు నిత్య జయమంగళం

పవమానసుతుడు బట్టు పాదారవిందములకు

నవముక్తాహారములు నటియించు యురమునకు

నళినారి గేరు చిఱునవ్వుగల మోమునకు

పంకజాక్షి నెలకొన్న యంగ యురమునకు

ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండు

రాజీవనయన త్యాగరాజ వినుతమైన

నీ నామ రూపములకు నిత్య జయమంగళం


( త్యాగరాజ కృతి0

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన

కొండొక శిశువుకు గొబ్బిళ్ళో

దుండగంపు దైత్యుల కెల్లను తల

గుండు గండనికి గొబ్బిళ్ళో

పాపవిధుల శిశుపాలుని తిట్టుల

కోపగానికిని గొబ్బిళ్ళో

యేపున కంసుని యిడుముల బెట్టిన

గోపబాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తరిమిన దనుజుల

గుండె దిగులునకు గొబ్బిళ్ళో

వెండి పైడి యగు వేంకటగిరిపై

కొండలయ్యకును గొబ్బిళ్ళో

(అన్నమాచార్య కృతి)


వటపత్రశాయికి వరహాల లాలి

రాజీవ నేత్రునికి రతనాల లాలి

మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి

జగమేలు స్వామికి పగడాల లాలి

కళ్యాణ రామునికి కౌసల్య లాలి

యదువంశ విభునికి యశోద లాలి

కరి రాజ ముఖునికి గిరి తనయ లాలి

పరమాక్ష భవనుకి పరమాత్మ లాలి

అలమేలుపతికి అన్నమయ్య లాలి

కోదండ రామునికి గోపయ్య లాలి

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి

ఆగమరుతునికి త్యాగయ్య లాలి

(స్వాతిముత్యము - నారాయణ రెడ్డి)

ఉదాహరణ కావ్యములలో కి, కు లను మాత్రమే

కవులుఉపయోగించి రి .


🔴🔴🔴🔴🔴🔴🔴🔴

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐