🚩🚩-మోహిని అందం - భస్మాసుర అంతం!



-

♦️పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలతో ప్రతి యుద్దంలోను ఓటమి లేని వాడిగా, మరియు దేవతలను నాశనం చేయాలన్న దుర్బుద్ధితో శివుని కోసం కఠోర తపస్సు చేయసాగాడు.

 ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై “ఏమి వరం కావాలో కోరుకో” అంటే ప్రకృతికి విరుద్ధమైన కోరిక "అమరత్వం (మరణం లేకపోవటం)" ప్రసాదించమని కోరతాడు.

♦️దానికి శివుడు నిరాకరించగా భస్మాసురుడు - "నేను ఎవరి తలపై నా చేయి పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి" అని వరం కోరతాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. భస్మాసురుడు ఆ వరమును పరీక్షించేందనని శివుని తలపైన తన చేయి వేయ ప్రయత్నించగా, శివుడు పారిపోవలసి వచ్చింది. భస్మాసురుడు వెంబడించాడు. శివున్ని కాపాడుటకై విష్ణుమూర్తి "మోహిని" అవతారం దాలుస్తాడు.

♦️విష్ణుమూర్తి, మోహిని అవతారంలో, భస్మాసురుని ఎదుట నిలుస్తాడు. మోహిని యొక్క అందమును చూసి భస్మాసురుడు వ్యామొహంలో పడిపోతాడు. భస్మాసురుడు మోహినితో “నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అనగా అప్పుడు మోహిని "నాకు నాట్యం అంటే చాలా ఇష్టం కావున నాలాగ నాట్యం చేసిన వారినే పెళ్ళాడుతాను" అని అంటుంది. 

♦️భస్మాసురుడు ఆ పందెమును అంగీకరించి నృత్యం మొదలుపెడతాడు. అలా నృత్యం చేస్తూ మోహిని ఒక భంగిమలో తన చేయి తన తల పైన పెట్టుకుంటుంది. భస్మాసురుడు మోహిని యొక్క భంగిమను అనుకరించగా తన తలపైన తనే చేయి పెట్టుకుంటాడు. శివుని వరప్రభావము వలన భస్మాసురుడు భస్మమైపోతాడు. 

దేవతలు ఆనందిస్తారు!

.

♦️చెట్టు వెనకనక్కిన సాంబశివుడు.

(రవి వర్మ మోహిని భస్మాసుర చిత్రం

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐