అహోబల క్షేత్రము!

 

                                                   అహోబల క్షేత్రము!


అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు.

1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.

2. అహోబలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.

3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.

4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.

5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.

6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.

7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.

8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము

9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి

*ఇది దశావతార నృసింహ మంత్రము,

ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కోక్కటిగా నేరవేరుతాయి.*

*"ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |*

*ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |*

*ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |*

*ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |*

*ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |*

*ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |*

*ఓం క్ష్రౌం పరశురామాయ నమః |*

*ఓం క్ష్రౌం రామాయ నమః |*

*ఓం క్ష్రౌం బలరామాయ నమః |*

*ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |*

*ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |*

*దివ్యసింహాయ నమః |*

*స్వయంభువే పురుషాయ నమః |*

*ఓం క్ష్రౌం ||"*

*ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు, మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది,🙏🙏🙏

అందరికి నరసింహ స్వామి జయంతి శుభాకాంక్షలు

( courtesy-Janaki Tippabhatla .)

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩