🔴 -షష్ఠీవిభక్తి. !-🔴
🔴 -షష్ఠీవిభక్తి. !-🔴 . #విభక్తులలో చాల తికమకలు పెట్టించునది షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి ప్రత్యయములు యొక్క, కి(న్), కు(న్), లో(న్), లోపల(న్). . షష్ఠీవిభక్తి ప్రత్యయములలో ఎక్కువగా వాడబదునది కి, కు లు సంప్రదానార్థములో మాత్రమే. తెలుగు కావ్యముల ప్రత్యేకతలలో షష్ఠ్యంతములు ప్రసిద్ధమైనది. ప్రార్థన, సుకవి ప్రశస్తి, కుకవి నింద, కృతిభర్త, కృతికర్త వంశములు, కావ్యకారణము, ఇవి చెప్పిన పిదప కథకు ముందు షష్ఠీ విభక్తితో అంతమగు కంద పద్యములు నన్నయ తప్ప మిగిలిన కవు లందఱు వ్రాసినారు. శాస్త్రీయసంగీతకార్యక్రమములలో సామాన్యముగా చివరి పాట- నీ నామ రూపములకు నిత్య జయమంగళం పవమానసుతుడు బట్టు పాదారవిందములకు నవముక్తాహారములు నటియించు యురమునకు నళినారి గేరు చిఱునవ్వుగల మోమునకు పంకజాక్షి నెలకొన్న యంగ యురమునకు ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండు రాజీవనయన త్యాగరాజ వినుతమైన నీ నామ రూపములకు నిత్య జయమంగళం ( త్యాగరాజ కృతి0 కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో దుండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో పాపవిధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్