Posts

Showing posts from June, 2021

🔴*పంచపాండవులకు .వారి భార్యలు .. 🔴

Image
 🔴*పంచపాండవులకు .వారి భార్యలు .. 🔴 #పంచపాండవులకూ ద్రౌపది భార్య..  కానీ పాండవులకు మొత్తం ఎందరు భార్యలు..? ఆసక్తికరం కదా..   ఆ అయిదుగురు పాండవులవీ వేర్వేరు వ్యక్తిత్వాలు.. పోలికలు... బలాలు, బలహీనతలు... అయిదుగురినీ సమానంగా మనోదేహాలకు స్వీకరించడం ఎంత క్లిష్టమో.. పాండవుల నడుమ ఉన్న దృడమైన సోదరబంధానికి వీసమెత్తు భంగం కలగకుండా చూడటం చాలా టఫ్‌ టాస్క్‌..   ♦ద్రౌపది ఒక సోదరుడితో ఉన్న ప్పుడు ఆ గదిలోకి వేరే ఏ సోదరుడుప్రవేశించకూడదని నియమం పెట్టుకుంటారు.  ఒక సోదరుడితో ఒక ఏడాది గడుపుతుంది. అది మరో నియమం...  ఆమె చూపించిన నేర్పరితనం గొప్పదే. అయితే... ఒక సోదరుడు ఒక ఏడాది అంటే... ఒకరికి ఒక టరమ్‌ రావాలంటే నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకూ బ్రహ్మచర్యమే..?  ♦పాండవులందరికీ ద్రౌపది గాకుండా వేరే భార్యలు ఉన్నారు,  వారితో సంతానం కూడా ఉన్నది... వాటికి సంబంధించిన కథలు, ఉపకథలు కూడా కనిపిస్తాయి. అయితే ద్రౌపది పాండవులందరికీ ముందే ఓ కండిషన్‌ పెడుతుంది. మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఇంకెవరూ తనతోపాటు సహ-భార్యగా (ఒకేచోట సవతిగా) ఉండటానికి వీల్లేదు. ఒక్క సుభద్ర విషయంలో మాత్రం కృష్ణుడి మాట వింటుంది. అంతే... మరి మిగతా పాండవ భార్

🔴-ఋణోదయం-🔴

Image
🔴-ఋణోదయం-🔴 “# అప్పు “ అనగానే చప్పున గుర్తొచ్చేది అప్పారావు.  అప్పారావంటే మరెవరో కాదండీ…  సాక్షాత్తు మన ముళ్ళపూడి వెంకటరమణ గారే. ♦మిత్రుడు ‘బాపు ‘ దగ్గర అప్పులు చేసీ,చేసీ అప్పారావు పాత్రను సృష్టించాడు. అన్నట్టు 💰 డబ్బులు మాత్రమే కాదండోయ్...జీవితానికి సరిపడ 'స్నేహాన్ని ‘  కూడా బాపు నుంచి అప్పుగా తీసుకున్నాడు.అందుకేనేమో?అప్పుల అప్పారావు పాత్రను అంత సజీవంగా చిత్రీకరించాడు ముళ్ళపూడి. ♦నవ్వడం భోగం,నవ్వక పోవడం రోగం ‘ ,అన్నారు జంథ్యాల.నవ్వడం,నవ్వించడం మరిచి నవ్వుల పాలవుతున్న తెలుగోడికి మళ్ళీ నవ్వడం ఎలాగో నేర్పించాడు మన ముళ్ళపూడి.పిల్లల కోసం ♦బుడుగు “ ను,పెద్దవాళ్ళ కోసం “అప్పారావును “ సృష్టించితెలుగువాళ్ళ రుణం తీర్చుకున్నాడు  .ఆకలేస్తే కేకలేశాడు “  శ్రీ శ్రీ , ఆకలేస్తే జోకులేశాడు ముళ్ళపూడి.వీళ్ళిద్దరిదీ 'ఫుడ్డు ‘  ప్రాబ్లమే.’ ఆకలి ‘  ఇద్దరిలోనూ కామన్.అయితే …స్వభావాల్ని బట్టి  ♦ ఒకరిది   ‘ కేక ‘ అయితే..ఇంకొకరిది ‘  జోక్ ‘ అయింది. ♦తెలుగు సాహిత్యంలో అప్పుల ప్రస్తావన వస్తే ‘  నక్షత్రకుడు ‘ గుర్తొస్తాడు.అయితే నక్షత్రకుడికి మన రవణ గారికి మౌలికమైన భేదం వుంది.  నక్షత్రకుడు అప్పుల వసూలుకు  హ

🔴-మగవారూ - ఆడవేషాలూ .!❤ .

Image
 🔴-మగవారూ - ఆడవేషాలూ .!❤ . ✍ఒకసారి 'ద్రౌపది వస్త్రాపహరణం' నాటకానికి  వెళ్లాను.  దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఒలిచే  దృశ్యం.  చీరలు ఎంత మట్టుకు లాగాలో  దుశ్శాసనుడికి తెలియదు.  ఎంతవరకూ లాగించుకోవాలో  ద్రౌపదికీ తెలియదు.  ఇద్దరూ కూడా చెడ తాగి ఉన్నారు. ద్రౌపది వేషం స్త్రీ వేసి ఉంటే జాగ్రత్త పడి వుండేది. కాని వేషం  కట్టినది పురుషుడు కదా!   'వద్దు వద్దు' అని తెరచాటు నుండి కేకలు వేసినా దుశ్శాసనుడు ఆగలేదు - ద్రౌపది ఆపలేదు.  *చివరికి ద్రౌపది వేషధారికి పైన 'రైక', క్రింద గావంచా మిగిలింది. నెత్తిపైన బోర్లించిన బుట్టలా సవరం ఒకటి! సృష్టికంతకు ఒక్కటే  దిష్టిపిడతలా ద్రౌపది  మిగిలింది. 🤣 🤣పుట్టు గుడ్డి వేషం వేస్తున్న  ధృతరాష్ట్రుడు కూడా ఆ దృశ్యం చూడలేక ఎవరి సహాయం లేకుండానే తెరచాటుకి పారిపోయాడు. తెర దించబోతే పడలేదు.  ద్రౌపదికి నాటకం  కాంట్రాక్టరుకి  భయం వేసింది కాబోలు  కిందకు ఉరికాడు.   ద్రౌపది వేషధారి తను ఆడో, మగో మర్చిపోయి పురుషుల వైపుకు పరిగెట్టాలో, స్త్రీల వైపుకు పరిగెట్టాలో అర్థం కాక  చివరికి స్త్రీల వైపు పరిగెట్టి వాళ్ల మధ్యన కూచున్నాడు.  ఆడవాళ్లంతా తటాలున లేచిపోయి పాక కా

✍ కోతికొమ్మచ్చి!.

Image
  ✍ కోతికొమ్మచ్చి!.  #లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం! ♦పెగ్-1 మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది. వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం. చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం. ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు. ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం. ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం. ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం. లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం. గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం. తాతగారు బోసినవ్వుతో చూస్తారు. వంటింట్లోకి తొంగి చూస్తాను. మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది. ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం. ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం. మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది. నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది? మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి!. ♦పెగ్-2 మనం మళ్లీ ఇవతలికి వస్తాం. చెక్కబీరువా తలుపు చప్పుడు చేస్తుంది. మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్ తీస్తాం. లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం. బాటిల్ కడిగేసి అటకమీద పెట్టేస్తాం.

🔴 -శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి బాల్యం...... 🔴

Image
🔴 -శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి బాల్యం...... 🔴        ఆయన మాటల్లోనే… ♦మా బాల్య మిత్రులు..  అంటే నా చిన్నప్పటి నుంచి పుస్తక మిత్రులు..మా వీరా అభిమాని.. రమణ గారి తీపి గుర్తులు వారి మాటలలో... ♦శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి బాల్యం...... ఆయన మాటల్లోనే…. “మా ఊరు ధవళేశ్వరం. రాజమండ్రి దగ్గర. గోదావరి ఒడ్డున. రామపాదాల రేవులో మొదటి మేడ మా ఇల్లు. పక్కనే కొండమీద జనార్ధనస్వామి కోవెల, కొండ కింద శివాలయమూ ఉన్నా వాటి కన్నా మా ఇల్లే కోలాహలంగా ఉండేది. గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలూ, అవి లేనప్పుడు సావిట్లో జై హరనాథ జై కుసుమ కుమారి జై – భజనలూ. నట్టింట్లో దె య్యాలను సీసాల్లో బిగించే ముగ్గుల పూజ లూ, బైరాగులూ – పెరటి వసారాలో చుట్టాలూ – వాళ్ళ చుట్టాలకి పెట్టుకునే (వాళ్లింట్లో వీల్లేక) తద్దినాలూ – పెరట్లో బావి అవతల పడవ వాళ్ళకి మా అమ్మమ్మ పెట్టే భోజనాలూ – బువ్వలు తిని దుంగళ్ళూ – కొట్టేవాళ్ళు. ♦మేడ వరండాలో హిందీ పాఠశాల – రాజమండ్రి నుంచి గుమ్మడిదల దుర్గాబాయమ్మ గారు జటకాలో వచ్చి మా అమ్మకీ, పక్కింటి వాళ్ళకీ" మైతోహూం తూతో హై "అంటూ చెప్పే హిందీ పాఠాలూ, పూనకాలూ, శాంతులూ, తర్పణాలూ – పూజగది పక్క

❤🙏-బ్రహ్మశ్రీ .చాగంటి కోటేశ్వరరావు.-🙏❤

Image
♦#చాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త.  అతను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు.  ఇతను తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ.  1959 జూలై 14వ తేదిన ఇతను జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు;  ♦అతను ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.               ♦మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. అతను ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నె

❤️" చతుర్వింశతి ఉప నిషత్సూక్తులు "❤️

Image
❤️" చతుర్వింశతి ఉప నిషత్సూక్తులు "❤️ 🚩🚩 1. ఈశా వాస్యోప నిషత్తు : " 1. వ శ్లోక తాత్పర్యము : (1) వేద భగవానుని యాదేశము :- ' అఖిలాండ బ్రహ్మాండములలో కనులకు కనిపించు , చెవులకు వినిపించు , మనస్సునకు స్ఫురించు చరాచర సృష్టి యంతయును పరమాత్మచే నావరింపబడియున్నది. కావున ప్రపంచ దృష్టిని పరిత్యజించి బ్రహ్మదృష్టితో సర్వదా వ్యవహరింపుము . కేవలము విద్యుక్త కర్తవ్యపాలనకొరకే విషయములను పరిమితముగ నిగ్రహముతో ననుభవింపుము . విశ్వరూపుడగు ఈశ్వరుని ప్రీతికొరకు చేయు సత్కర్మలన్నియు యజ్ఞములు . 🚩🚩 1. ' ఇది నా పని కాదు, పరమేశ్వరుని పనియని ' చేసిన అది కర్మవిషయ త్యాగము.(2) ' ఈ కర్మ ఫలము నాది కాదు . పరమేశ్వరునిదే ' యని భావించిన నది ఫలవిషయ త్యాగము. 3.' ఈ పని. చేయువాడు పరమేశ్వరుడే , నేను కానని అనగలిగిన ' అది కర్తృత్వత్యాగము . ఇట్లు త్రివిధ త్యాగములకు బద్ధుడవై పరమేశ్వర కైంకర్యము కావింపుము. ఈశ్వరేఛ్చచే లభించిన పదార్తములన్నియు నీశ్వరునివే ! కావున వాని నెల్లను ఈశ్వర సేవయందే వినియోగించుము. మానవుడు మోహవశ మున అవి తనవే అనుకుని బద్ధుడగును . ధనాదులందు చిక్కికొని పరమేశ్వరుని మరువకుము . భగ

🔻నాకు నచ్చిన పాట.-ఎందుకే నీకింత తొందర,❤️

Image
  🔻నాకు నచ్చిన పాట.-ఎందుకే నీకింత తొందర,❤️ #మల్లీశ్వరిలో   శ్రీమతి భానుమతిగారి ఈ పాట నాకెంతో ఇష్టం. సంగీతం, సాహిత్యం, నాయికా నాయకుల హావభావాలు వెరసి  ఒక మధురానుభూతిని కలిగిస్తాయి.  ఆపాత మధురాలు నిజంగా అద్భుతాలు ... #మల్లీశ్వరి ,నాగరాజు విడిపోతారు. మల్లీశ్వరి  రాజుగారి అంతః పురంలో చిక్కుకొంటుంది నాగరాజు శిల్పాలు చెక్కడానికి రాజుగారి  దగ్గరకి వస్తాడు.  అదృష్ట వశాత్తు ఇద్దరు కలుస్తారు,మరునాడు పారిపోవడానికి నిర్ణయించుకొంటారు. ఆరాత్రి మల్లిశ్వరికి నిద్రపట్టదు,  కాని రామ చిలుక తొందర పడుతున్నట్లు దానిని సముదాయిస్తూ పాడుతుంది. తనలోని తొందరను ఆ రామచిలుకకు ఆపాదించి పాడుకుంటుంది మల్లీశ్వరి. ఈ ఒక్క రాత్రి గడిస్తే ఈ పంజరం నుండి బయటపడి తమ ఊరిలోని తోటలో హాయిగా తిరగొచ్చు , విడిపోయి పడ్డ బాధలన్నీ పాత కథలైపోతాయి,  తెల్లారగానే చిరుగాలి తరగలా చిన్నారి పడవలా పారిపోదాము అని తనకు తానే చెప్పుకుంటుంది మల్లీశ్వరి. చిరుగాలి తరగలు , ఆ వంక గొరవంక, వంతలు పాలపుంతలు వంటిపదాలు కృష్ణ శాస్త్రి గారే  వ్రాయగలరు, చక్కని సాహిత్యం,సంగీతం,పాలపిట్టలాటి నాయిక, సుందర దృశ్యాలని మనసులో  హత్తుకొనేలా చిత్రించే దర్శక మహాశ్యులు, అందుక

🔴-గద్యానికి చిన్నయ-🔴

Image
🔴-గద్యానికి చిన్నయ-🔴 ( #సన్నని యంచు పంచయును చక్కని కోటును ఉన్న శాల్వయున్‌ తిన్నని ఊర్ధ్వపుండ్రములు నేత్రములందు సులోచనమ్ములున్‌ చెన్ను వహింప ఛత్రమును చేత ధరించి సశిష్యుడౌచు యా చిన్నయ సూరి నిత్యమును చెన్నపురిన్‌ జను పాఠశాలకున్‌!! ❤ 🔔 సన్నని అంచు పంచె, కోటు, పైన శాలువా,  నుదుట ఊర్ధ్వపుండ్రాలు, కళ్లద్దాలు అందంగా అలరారుతుండగా  చేతిలో గొడుగుతో శిష్యులు వెంటరాగా... రోజూ మద్రాసు నగరంలో బడికి వెళ్తాడని వర్ణించాడో కవి.  ఈ పద్యంలోని వర్ణన చూస్తే తెలుగు వచన రచనకు ఆదిగురువుగా నిలిచిన చిన్నయసూరికి అతికినట్టే సరిపోతుంది కదా!        🔔నన్నయకు ముందే తెలుగులో పద్యకవిత్వం ఉంది. అయితే అది గాసటబీసటగా ఉంది. అలాంటి దానికి నిర్దిష్టమైన రూపురేఖలు సంతరించి పెట్టింది నన్నయ. అందుకే ‘పద్యానికి నన్నయ’! అలాగే చిన్నయసూరికి ముందే తెలుగులో గద్యకావ్యాలు ఉండి ఉండొచ్చు. కానీ వచన రచనకు పెద్దపీట వేసింది మాత్రం చిన్నయే. అందుకే ‘గద్యానికి చిన్నయ’ అంటాం.          చిన్నయ పూర్వీకులు ఉత్తరాంధ్ర నుంచి బతుకు తెరువుకోసం తమిళనాడు వలస వెళ్లారు. పరవస్తు రంగరామానుజాచార్యులు వైష్ణవ మతానుయాయి. చెన్నై నగరంలో ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఉంటూ

🔴 - భోగినిమండపం-🔴

Image
🔴 - భోగినిమండపం-🔴 #బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ  మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న  బాగవతంను  ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని,  తెలుగు వారిని ధన్యులను చేసినాడు. .పోతన కొంతకాలం రాచకొండని పాలించిన పద్మనాయక రాజైన  సర్వజ్ఙ సింగమ నాయకుడి ఆస్ధానంలో ఉండి “భోగినిదండకం” రాశాడు.  ఇక్కడ మీరు చూస్తున్న  ఈ మండపం పేరు భోగినిమండపం… ఈ మండపంలో ప్రదర్శించబడిన భోగిని నృత్యాన్ని ఆదర్శంగా  తీసుకుని సహజకవి అయిన పోతన "భోగినిదండకం ” కావ్యాన్ని  రాసాడని ప్రతీతి.   నల్గోండ జిల్లాలోని రాచకొండ కోటలో ఉందీ మండపం.. . #బాలరసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్, కూళల కిచ్చియప్పుడు కూడు భుజించుటకన్న  సత్కవుల్ హాలికులైననేమి. గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి  నిజధారసుతొద్దర పోషణార్దమై….. తమ కావ్యాలను రాజులకు అంకితమిచ్చి వారిచ్చే కానుకలతో నీచపు  కూడు తినడం కంటే మంచి కవులు నాగలి చేత పట్టి అడవుల్లో కందమూలాలు తింటూ భార్యా పిల్లలను పోషించటం నయం అని చెప్పిన పోతన ఒక చేత్తో హలం ,మరొక చేత్తో కలం పట్టి ఒక చేతితో పంటలను, మరొక చేత్తో సాహిత్యాన్ని పండించిన గొప్ప కవి పోతన. ♦♦♦♦♦♦♦

🔴భోగినీ దండకము బమ్మెర పోతన!🔴

Image
 🔴భోగినీ దండకము బమ్మెర పోతన!🔴 🚩🚩యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన భోగినీ దండకం అనే రచనను చేశారు.  ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దంకమని భావించేవారు .  ఆ తరువాత దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ 'వీరభద్ర విజయం' అనే పద్య కావ్యాన్ని రాశారు. ❤ =భోగినీ దండకము=❤ ♦**సింగభూపాల వర్ణనము** శ్రీమన్మహామంగళాకారు నాకారలక్ష్మీకుమారున్‌ గుమారీమనోరాము రామాంబరీషాది రాజన్య రాజద్యశఃకాముఁ గామాహితక్షీరవారాశి తారేశ వాగీంద్ర నాగేంద్ర మందార కుందార విందాభ్ర కల్లోలినీకాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీ భూషితాశాంగనాలోక సీమంతు సీమంతినీ మానసారామవాటీ వసంతున్‌ వసంతావనీనాథ సంసేవితాంచత్పదాంభోజు నంభోజరాజీ సుహృత్తేజుఁ దేజోజయప్రాభవోద్దాము నుద్దామజన్యావనీ భీము భీమప్రతాపానలాభీలజిహ్వాలి కీలావినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వారగర్వాటవీవారు వారాధిపోరుప్రభా భాసుర స్ఫార కల్యాణ దుర్వారు వారాశి వేలాపరీతావనీ భార ధౌరేయు ధౌరేయతారాతిరాజన్మహాబాహు బాహాకఠోరాసి ధారావినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్‌ సమూహామహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్‌ వల్లభామానసేచ్ఛాక

🔻కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం*🔻

Image
  🔻కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం*🔻 🚩ఒకాయన ఉత్కళ దేశంలో ఉన్న జగన్నాథుని దర్శించాడట. అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడట. సామాన్యంగా అన్ని దేవాలయాలలో విగ్రహాలు రాతితో గాని, లోహాలతో గాని చేయబడతాయి. ఆ దారుమూర్తిని చూసిన ఆ కవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది. 💥శ్లో|| ఏకా భార్యా ప్రకృతిరచలా, చంచలా చ ద్వితీయా పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః శేషశ్శయ్యాప్యు దధి శయనం, వాహనం పన్నగారిః స్మారం స్మారం స్వగృహచరితం దారు భూతొ మురారి!💥 🚩అదేమంటే, శ్రీ మహా విష్ణువు తన కుటుంబంలోని వారి ప్రవర్తనలను చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట. విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు. ఒకావిడ కదలకుండా ఉండే ప్రకృతి (భూదేవి), ఇంకొకావిడేమో (లక్ష్మి) ఒకచోట నిలకడగా ఉండకుండా, మనుష్యులను మారుస్తూ తిరుగుతూ ఉంటుందిట. 🚩కొడుకు(మన్మధుడు)ని చూద్దామా అంటే, ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ ఉంటాడు. అందరినీ బాధిస్తూ ఉంటాడు. వాడు బలంగా ఉన్నాడా అంటే, అసలు శరీరమే లేదు. 🚩ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామనుకుంటే, తాను నడుము వాల్చేది ఒక పెద్ద పాము మీద, ఆదేమో మెత్తగా ఉంటుంది. ఎంత సేపూ బుసలు కొడుతూనే ఉంట

🔴🙏 -గురు అష్టకం-🙏🔴 🚩🚩ఆది శంకరాచార్య విరచిత గురు అష్టకమ్.

Image
  🔴🙏  -గురు అష్టకం-🙏🔴 🚩🚩ఆది శంకరాచార్య విరచిత గురు అష్టకమ్.  గురువు ప్రాముఖ్యతని చెబుతూ ఒక ఆధ్యాత్మిక సాధకుడు  గురువు పాదపద్మములకు ప్రణమిల్లడం ఎంత ముఖ్యమో ఇది వివరిస్తుంది.  ♦  #శరీరం సురూపం తథా వా కళత్రం యశఃశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్.❤ 🚩🚩  చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికి,  గొప్ప కీర్తి, మేరుపర్వతమంత డబ్బు ఉన్నప్పటికీ  గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?  ♦ #కళత్రం ధనం పుత్ర పౌత్రాధి సర్వం గృహం బాంధవా సర్వ మేతాధి జాతం, గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్❤ 🚩🚩 భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద  నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?   ♦ షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం, సుపదయం కరోతి గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్ 🚩🚩 నీవు ఆరు అంగములలోను, నాలుగు వేదములలోను, పారంగతుడవైనా కాని,గద్య, ప

🔴🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏🔴 ---తెలుగు లో వివరణ- 13.--- 🚩ఫలశ్రుతి.🙏

Image
🔴🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏🔴 ---తెలుగు లో వివరణ- 13.--- 🚩ఫలశ్రుతి.🙏 🏵️ ఈ స్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి. క్లుప్తంగా ఇదీ ఫలశ్రుతి: 👉🏿ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభములు కలుగవు. 👉🏿బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును. 👉🏿క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము, 👉🏿శూద్రులకు సుఖము లభించును. 👉🏿ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును. 👉🏿 భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును. వారికి బలము, తేజము వర్ధిల్లును. పురుషోత్తముని స్తుతి చేసేవారిలో వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు. 👉🏿బంధితులకు స్వేచ్ఛ లభించును. భయమునుండి విముక్తి కలుగును. ఆపదలు తొలగిపోవును. అట్టి భక్తుల కష్టములు కడతేరును. 👉🏿వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును. వారికి అశుభములు, జన్మ మృత్యు జరా వ్యాధి భయములు ఉండవు. సుఖము, శాంతి, సిరి, ధైర్యము, కీర్తి, సస్మృతి లభించును. పుణ్యాత్ములగుదురు. సకల చరాచర జీవములు, గ్రహ నక్షత్రాదులు, దేవతలు వాసుద

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

Image
🔴-అచ్చ తెలుగు  పదాలు.-🔴 #తాళ్లపాక అన్నమయ్య రాసిన 32 వేల కీర్తనలు చెక్కిన రాగిరేకులు తిరుమలవాసుడి చేరువన చీకటి కొట్లో పడి ఉన్న సంగతి ఏడు దశాబ్దాల క్రితం వరకు మనకెవరికీ తెలియదు.  తేటతెలుగు తీయందనాన్ని చవులూరించేలా అక్షరీకరించిన అలాంటి మరుగున పడిన మాణిక్యాలను వెలికితీత నిరంతర యజ్ఞంలా సాగాలి. అన్నమయ్య ఒక సంకీర్తనలో ‘‘… #ఇంతి చెలువపు రాశి’’ అని వర్ణిస్తాడు.  ఇది అచ్చ తెలుగు పదం. దీనికి అర్థం- ‘అందాల రాశి’’ అని. మనం నిత్యం ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. ఆ మాటల్లో ఎన్నో పదాలు పలుకుతుంటాం. వాటిలో చాలా పదాలు ‘తెలుగు’వే అనుకుంటాం. నిజానికి ఒకసారి అటువంటి పదాలను తెరచి చూస్తే.. మనం మాట్లాడే భాషలో తెలుగు పాలెంతో తెలిసి వస్తే ఆశ్చర్యం కలగక మానదు.        అసలు మనం మన తెలుగును గౌరవించుకుంటూ ‘మాతృభాష’ అని సంబోధిస్తుంటాం. కానీ, ‘భాష’ అనే పదం సంస్క•తం. అంతెందుకు? ‘దేవుడు’. ‘దేవత’ వంటి దైవ సంబంధ పదాలు, మాటలన్నీ సంస్క•తంలోనివే. మరి తెలుగులో ‘దేవుడు’ని ఏమంటారు?  దేవుడికి అన్ని భాషలు వచ్చు, అన్ని భాషలు అర్థమవుతాయి కాబట్టి సరిపోయింది కానీ, ఆయనకు తెలుగు మాత్రమే వచ్చి ఉంటే మన పరిస్థితి ఏమిటి? మన పూజలు, ప్రార్థనలు

🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏

Image
🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏 🔴 -తెలుగు లో వివరణ- (11) .🔴 👉🏿"వేయి నామములు ప్రధాన వ్యాసం: విష్ణువు వేయి నామములు- 901-.1000. 🙏🏾 901) స్వస్తిద: - సర్వశ్రేయములను చేకూర్చువాడు. 902) స్వస్తికృత్ - శుభమును కూర్చువాడు. 903) స్వస్తి - సర్వ మంగళ స్వరూపుడు. 904) స్వస్తిభుక్ - శుభమును అనుభవించువాడు. 905) స్వస్తిదక్షిణ: - స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు. 906) అరౌద్ర: - రౌద్రము లేనివాడు. 907) కుండలీ - మకర కుండలములు ధరించినవాడు. 908) చక్రీ - సుదర్శనమను చక్రమును ధరించినవాడు. 909) విక్రమీ - గొప్ప శూరుడైన భగవానుడు. 910) ఊర్జిత శాసన: - ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు. 911) శబ్దాతిగ: - వాక్కుకు అందనివాడు. 912) శబ్దసహ: - సమస్త వేదములు తెలియబడినవాడు. 913) శిశిర: - శిశిర ఋతువువలె చల్లబరుచువాడు. 914) శర్వరీకర: - రాత్రిని కలుగజేయువాడు. 915) అక్రూర: - క్రూరత్వము లేనివాడు. 916) పేశల: - మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును. 917) దక్ష: - సమర్థుడైనవాడు. 918) దక్షిణ: - భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు. 919) క్షమిణాం వర: - సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు.

🔴 -కుమారస్వామి పుట్టుక! - 🔴 .........(కుమార సంభవం.)

Image
🔴    -కుమారస్వామి పుట్టుక! - 🔴 .........(కుమార సంభవం.) #పార్వతి పరమేశ్వరులు జగత్తుకు ఆది దంపతులు.#శ్రీరమణవారు కైలాసాంలో నివాసం ఉంటారు. వారు ఒకసారి 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విని ఆశ్చర్యపోయిన దేవతలు పార్వతిదేవి, శంకరుడి తేజస్సులు అసమానమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే సంతానాన్ని మనం తట్టుకోలేము అని భావించారు.  దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు .          అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామి! మీరు పార్వతిదేవి తో 100 దివ్య సంవత్సరాల నుండి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక మరో ప్రాణి రూపంలో బయటకు వస్తే వాని యొక్క తేజస్సును మేము భరించలేము కనుక తమరి తేజస్సుని తమలోనే ఉంచుకుని, సంతాన ఆలోచన లేకుండా పార్వతిదేవి తో తపస్సు చేసుకోండి అన్నారు. ఏ  వికారములు లేని శంకరుడు వాళ్ళు చెప్పినదానికి అంగీకరించాడు, కానీ ఇప్పటికే తన నుండి కొంత తేజస్సు కదిలింది కనుక దానిని భరించే వారు ఉంటే దానిని వదలిపెడతాను అని చెప్పాడు.         అప్పుడు దేవతలు అన్నీ భరించగల భూమి దీనిని కూడా భరించగలదు అని చెప్పారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిప