❤️" చతుర్వింశతి ఉప నిషత్సూక్తులు "❤️


❤️" చతుర్వింశతి ఉప నిషత్సూక్తులు "❤️

🚩🚩

1. ఈశా వాస్యోప నిషత్తు :

" 1. వ శ్లోక తాత్పర్యము : (1) వేద భగవానుని యాదేశము :-

' అఖిలాండ బ్రహ్మాండములలో కనులకు కనిపించు , చెవులకు వినిపించు , మనస్సునకు స్ఫురించు

చరాచర సృష్టి యంతయును పరమాత్మచే నావరింపబడియున్నది. కావున ప్రపంచ దృష్టిని పరిత్యజించి బ్రహ్మదృష్టితో సర్వదా వ్యవహరింపుము . కేవలము విద్యుక్త కర్తవ్యపాలనకొరకే

విషయములను పరిమితముగ నిగ్రహముతో ననుభవింపుము . విశ్వరూపుడగు ఈశ్వరుని ప్రీతికొరకు

చేయు సత్కర్మలన్నియు యజ్ఞములు .

🚩🚩

1. ' ఇది నా పని కాదు, పరమేశ్వరుని పనియని ' చేసిన అది కర్మవిషయ త్యాగము.(2) ' ఈ కర్మ

ఫలము నాది కాదు . పరమేశ్వరునిదే ' యని భావించిన నది ఫలవిషయ త్యాగము.

3.' ఈ పని. చేయువాడు పరమేశ్వరుడే , నేను కానని అనగలిగిన ' అది కర్తృత్వత్యాగము . ఇట్లు

త్రివిధ త్యాగములకు బద్ధుడవై పరమేశ్వర కైంకర్యము కావింపుము. ఈశ్వరేఛ్చచే లభించిన

పదార్తములన్నియు నీశ్వరునివే ! కావున వాని నెల్లను ఈశ్వర సేవయందే వినియోగించుము. మానవుడు మోహవశ మున అవి తనవే అనుకుని బద్ధుడగును . ధనాదులందు చిక్కికొని పరమేశ్వరుని మరువకుము . భగవత్సేవ కొఱకే బ్రతుకుము. భగవత్కైంకర్యము చేయుచునే మరణింపుము . పరమేశ్వరునియందే యపేక్ష , తదన్యములయందు ఉపేక్ష కలిగి యుండవలెను .

(2) నిష్కాముడవై నిష్కళంకముగ కపటము విడిచి మేలగేదవేని ఇచటనే ఈ జన్మలోనే నిజముగా

కర్మ యోగి వయ్యెదవు .

(3) ప్రపంచగతమగు నామ రూప గుణ క్రియా దృష్టిని వదిలిపెట్టి బ్రహ్మదృష్టిని సమకూర్చుకొనుము.

🚩🚩

(2) వ శ్లోక తాత్పర్యము:-

1. జగములను సృజించి పోషించి హరించు సర్వశక్తి సంపన్నుడు పర మేశ్వరుడు . అతనినే స్మరించుచు , సర్వమతని లీలగానే భావించుచు , ఆయన సేవయందే సర్వకర్మలను వినియోగించుచు సంపూర్ణముగా నూరు సంవత్సరములు జీవింపుము . జీవితమును సంపూర్ణ ముగ

భగవంతునికే అంకితము గావింపుము . అదియే జీవిత పరమార్థము.

2. పరోపకారము కొఱకు పరమేశ్వర సేవకొఱకు మాత్రమే జీవింపుము . స్వార్థము కొఱకు విషయయో

పభోగముల కొఱకు జీవింపకుము . ఈశ్వరుని ప్రీతి కొఱకే కర్మలు చేయువాడు కర్మబద్ధుడు కాదు . ముక్తిని సంపాదించుటకు ఇదియోక్కటియే రాజమార్గము 

🚩🚩

3. వ శ్లోక తాత్పర్యము :-

అతి దుర్లభమైన మానవ శరీరము భగవంతుని కృపా విశేషముచేతనే

లభించును . సంసార సాగరము దాటుటకు మానవ జన్మము ఏకైక ముఖ్యసాధనము . అట్టి యుత్తమ సాధనమును ఈశ్వరానుగ్రహ సంపాదనమునకుపయోగింపక , కామోపభోగముల కొఱకై

దుర్వినియోగము గావించువారు , ఆత్మహత్యగావించుకొను వారే యగుదురు. ఆత్మఘాతకులు జన్మమృత్యువులను చక్రములలో జిక్కికొని క్రిమికీటకాది క్షుద్రయోనులయందు జన్మించుచు

ఘోరదుఃఖము లనుభవింతురు .

🚩🚩

4.వ శ్లోక తాత్పర్యము :-

చలించునది పరమాత్మ ; చలింప కూడా పరమాత్మయే ! పరమాత్మ ఆత్మజ్ఞానము లేనివారికి

అందుబాటులో నుండదు . ఆత్మజ్ఞాన సంపన్నులకు ఆ పరమాత్మ అంతటను కనులకు గట్టినట్లు

కన్పట్టును . సకల ప్రపంచము లోపలను వెలుపలను నిండియున్నది పరమాత్మయే !

🚩🚩

5. వ శ్లోక తాత్పర్యము :-

ఆత్మజ్ఞాని సర్వప్రాణులయందు పరమాత్మను జూచును. సాక్షాత్కరించికొన్న పరమాత్మలో సకల

జీవులను darsinchunu

🚩🚩

6 వ శ్లోక తాత్పర్యము :--

-------------------/-----------

" ఆత్మజ్ఞాని సర్వ ప్రాణులయందు పరమాత్మను జూచును. సాక్షాత్కరించుకొన్న పరమాత్మలో

సకల జీవులను దర్శించును. ఆ బ్రహ్మజ్ఞాని ఎవరిని ద్వేషించును ? ఎవరికపకారము చేయును ?

సర్వదా అందరిలో తన ప్రభువునే దర్శించి మనసా వారి కందరికీ నమస్కరించి సర్వ విధముల

సేవ చేసి సుఖమునే సమకూర్ప నెంచువాడు ఆత్మజ్ఞాని .

🚩🚩

7 వ శ్లోక తాత్పర్యము :-

-------------------------

" సమస్త భూతములను తనవలెనను , పరమాత్మ వలెనను భావించు ఆత్మజ్ఞానికి శోక మోహా సక్తులు కలుగవు.

🚩🚩

8వ శ్లోక తాత్పర్యము :-.

--------------//--------------

" సర్వము నెరిగిన అగ్నిదేవా ! మా పుణ్య , పాప కర్మఫల స్వరూపమెరుగుదువు . ప్రతి బంధమూలను తొలగించి మమ్ము సంమార్గమున అత్యుత్తమ గమ్య స్థానమునకు నడిపించుకొని

పొమ్ము. జీవితాంతము మాచే భగవత్కైంకర్యము చేయింపుము . అసన్మార్గమునుండి మమ్ము మర

లింపుము . అంధ కారమునుండి తప్పింపుము. అజ్ఞాన బంధములను తొలగింపుము. మృత్యువాత

బడకుండ కాపాడుము. మాకు , ' జ్ఞానము - తద్వారా అమృతత్వము' ను ప్రసాదింపుము . నీవలన

ఇంత మహోపకార మపేక్షించు మేము నీకు మాటి మాటికి అనంత ప్రమాణమములు భక్తి ప్రవత్తులతో సమర్పించు కొనుచున్నాము . అంతకన్నా మేమేమి చేయగలము తండ్రీ! తనయులెంతటి

దుష్టులైనాను , తండ్రులు వారి దోష ములను విస్మరించి రక్షించుట సహజము, జగద్వితము కదా!

ఈ ఉపనిషత్తునుగూర్చి స్వామి శివా నందుని యభిప్రాయము :

1. సర్వ ప్రాణుల యందున్న ఆత్మతత్వమొక్కటే . ఆత్మజ్ఞానము కల వ్యక్తికి విచారముకాని ,

భ్రమ కాని కలుగదు.

2. అంతర్యామియగు ఆత్మసహాయమున మనః ప్రాణేన్ద్రియములు పనిచేయును .

3. ఇంద్రియ సంబంధమగు జీవితమునందాసక్తి వదిలిపెట్టి , ఆత్మానుభూతి యందే రక్తి కలవానికి

అమరత్వము , శాస్వతానందము కలుగును .

4 కర్మవలన గాని కర్మతోగూడిన జ్ఞానమువలన గాని. మోక్షము కలుగదు. కేవలమాత్మ జ్ఞానాను

భవములచేతనే ముక్తి లభించును. స్వశక్తి చేత నే ముక్తి లభించును . స్వశక్తి చేతనే సాధింపదగిన

మోక్షమున కితర సహాయము అవసరములేదు. తన్ను తాను గుర్తించుటకు పరుల సాయముతో

పనియుండదు.

🚩🚩

శ్రీమత్ శంకర భగవత్పాదుల వివరణము.

1 జగత్తుకన్న జీవుడు , జీవునికన్న ఈశ్వరుడు భిన్నులై వున్నారు . జీవ జగత్తులయందు ఈశ్వరుడు అంతర్యామియై వ్యాపించి యుండుటచే నవి ఈశావాస్యము లగుచున్నవి .

2. విశ్వమననేమి ? దానిరూపమేది ? అది ఎట్లు కలిగినది ? దానికి కారణ మేమి ? అని బుద్ది

మంతులేనాడును చింతింప దగదు. అది మాయయని మాత్రమే గ్రహింప దగును . కర్రచే చేయబడిన

ఏనుగునందు బాలునకు కర్ర కనపడదు . అది కర్ర యని తెలిసి విమర్శకునకు ఏనుగు కనపడదు .

అటులే జగత్తునందు పరమాత్మను. జూడలేడు . విజ్ఞునకు పరమాత్మయందు జగము కనపడదు .

కావున సర్వమును బ్రహ్మ మాత్రముగా జూచుచు , జగద్డ్రు ష్టిని త్యజించి, ఆత్మస్వరూపమును

గాంచుము. ఆత్మను రక్షించు కొనుము. దేనిని కోరిక అకించనుడవు కమ్ము .

🚩🚩

ఓం శాంతి శాంతి : శాంతి : ॥

॥ హరి ఓం తత్సత్ ॥

-------------------------------------

" సుభాషిత ద్వయము "

--------- ----------------

1. ఆలోచించి మాటనిమ్ము . తెలిసికొని జ్ఞానమిమ్ము. హృదయపూర్వక ప్రేమను యిమ్ము .

2. శరీరమునకు సత్కర్మప్రేరణ , మనస్సునకు సద్భావనప్రేరణ , బుద్ధికి సద్విచారణ ప్రేరణకై

భగవంతుని ప్రార్థించు !

" పర బ్రాహ్మణే నమః "

🚩🚩

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐