🔴-ఋణోదయం-🔴


🔴-ఋణోదయం-🔴


“# అప్పు “ అనగానే చప్పున గుర్తొచ్చేది అప్పారావు.

 అప్పారావంటే మరెవరో కాదండీ…

 సాక్షాత్తు మన ముళ్ళపూడి వెంకటరమణ గారే.

♦మిత్రుడు ‘బాపు ‘ దగ్గర అప్పులు చేసీ,చేసీ అప్పారావు పాత్రను సృష్టించాడు.

అన్నట్టు 💰 డబ్బులు మాత్రమే కాదండోయ్...జీవితానికి సరిపడ 'స్నేహాన్ని ‘ 

కూడా బాపు నుంచి అప్పుగా తీసుకున్నాడు.అందుకేనేమో?అప్పుల అప్పారావు

పాత్రను అంత సజీవంగా చిత్రీకరించాడు ముళ్ళపూడి.

♦నవ్వడం భోగం,నవ్వక పోవడం రోగం ‘ ,అన్నారు జంథ్యాల.నవ్వడం,నవ్వించడం మరిచి నవ్వుల

పాలవుతున్న తెలుగోడికి మళ్ళీ నవ్వడం ఎలాగో నేర్పించాడు మన ముళ్ళపూడి.పిల్లల కోసం

♦బుడుగు “ ను,పెద్దవాళ్ళ కోసం “అప్పారావును “ సృష్టించితెలుగువాళ్ళ రుణం తీర్చుకున్నాడు 

.ఆకలేస్తే కేకలేశాడు “  శ్రీ శ్రీ ,

ఆకలేస్తే జోకులేశాడు

ముళ్ళపూడి.వీళ్ళిద్దరిదీ 'ఫుడ్డు ‘  ప్రాబ్లమే.’ ఆకలి ‘  ఇద్దరిలోనూ కామన్.అయితే …స్వభావాల్ని బట్టి

 ♦ ఒకరిది   ‘ కేక ‘ అయితే..ఇంకొకరిది ‘  జోక్ ‘ అయింది.

♦తెలుగు సాహిత్యంలో అప్పుల ప్రస్తావన వస్తే ‘  నక్షత్రకుడు ‘ గుర్తొస్తాడు.అయితే నక్షత్రకుడికి

మన రవణ గారికి మౌలికమైన భేదం వుంది. 

నక్షత్రకుడు అప్పుల వసూలుకు  హరిశ్చంద్రుడి

వెంట తిరిగితే..,..మన అప్పారావు మాత్రం  

అప్పులు చేయడానికి జనాన్ని వెంబడిస్తాడు.

♦అసలీ అప్పారావు పాత్ర సృష్టి హఠాత్తుగా 

జరిగింది కాదు!స్వానుభవాన్ని,సమాజాను

భవాన్నీ రోట్లో వేసి రుబ్బి మరీ సృష్టించాడు ముళ్ళపూడి.నవ్వనని భీష్మించుకున్న వాళ్ళను సైతం..

“కొంచెం నవ్వవయ్యా బాబూ,నవ్వితే నీ సొమ్మేం పోదంటూ “ చెప్పి 

మరీ మరీ నవ్వించాడు. అందుకే అప్పారావు మనలో

 ఒకడై పోయాడు.మనవాడయ్యాడు.

♦అప్పారావు బలహీనతల్లా అప్పుచేయడమే.

’డబ్బుచేసినోడ్నే’ కాదు,డబ్బులేనోడ్నికూడా 

అప్పుతోకొడతాడు.ఆమాటకొస్తే...ఈ సృష్టి లో అప్పుచేయని వాడెవడంటూ ఎదురు ప్రశ్నిస్తాడు.

♦సూర్యుడి నుండి చంద్రుడు వెలుగును అప్పుగా తీసుకోవడం లేదా? 

♦ కలువపూలు వెన్నెలను అప్పుగా తీసుకోవడం లేదా? 

♦సముద్రం నుంచి నీటిని అప్పుగా తీసుకొని ఆకాశం మేఘాల్ని కూడబెట్టుకోవడంలేదా?

♦ఆ మేఘాలనుంచి భూదేవి వర్షాన్ని అప్పుగా తీసుకోవడం లేదా?

♦ ఎండను అప్పుగా తీసుకొని చెట్లు పత్రహరితం తయారు

చేసుకోవడం లేదా? 

♦హిమాలయాలనుంచి నీటినిఅప్పుగా తీసుకొని గంగానది ప్రవహించడం లేదా? 

♦చెట్ల నుంచి మనుషులు ఆక్సిజన్ ను అప్పుగా

తీసుకొని బతకడం లేదా? 

♦ప్రపంచంలోనిదేశాలు అప్పుకోసం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లడం

లేదా? 

♦ఆమాటకొస్తే....అమ్మా నాన్నల అనురాగాన్ని అప్పుగా తీసుకొని

 బిడ్డ పుడుతుంది...ఇలా 

చెప్పుకుంటూ పోతే ఈ భూ ప్రపంచంలో అస్సలు అప్పు చేయని వారే లేరంటాడు మన అప్పారావు.

♦“అప్పు” అంటే చాలామందికి ‘ తప్పు ‘ గా కనిపి

స్తుంది కానీ,అప్పారావుకు మాత్రం అప్పు అన్న

మాట“డప్పు “ గా వినబడుతుంది. 

♦అసలు  'పొగతాగని వాడు గాడిదై పుట్టున్ 'అంటారు

గానీ..అది చాలాతప్పంటాడు అప్పారావు.

♦”అప్పు చేయని వాడు గాడిదై పుట్టున్ “ ,అంటూ అర్జంటుగా 

సవరణ తేవాలంటాడు.అన్నన్నా ! ‘

అప్పుకున్న వెయిట్ ఇంతింత కాదయా !’ అంటూ తత్వం అందుకుంటాడు.

అసలుఈ రుణ భ్రమణం వుంది చూశారూ...

♦అది దా…’రుణం ‘ గా సాగిపోతోందం

టాడు. “ రుణ దాశరథీ….కరుణా పయోనిథి “

అంటూ సొంత పద్య శతకాన్ని అందుకుంటాడు.

“#ఎవ్వనిచే జనించు రుణ /మెవ్వనిచే భ్రమియించు లోకమం

దెవ్వని బుద్ధి యే రుణ / మెవ్వడు నవ్వుచు నప్పులిచ్చు దా

నివ్వగా జాలనం చనక / నివ్వగ జాలక దిప్పనట్టి వా

డెవ్వడు..? ఆ రుణాత్ము రుణదేశ్వరు/  నేను రుణంబు వేడెదన్ “!!❤

అప్పులు చేసే “ట్రిక్కులు “ తెలుసుకోవాలంటే ‘#రుణానంద లహరిని ‘ చదవమంటాడు 

అప్పారావు.అయితే చదివారంతా అప్పారావు

కు  ఓ “ఫైవ్ “ అప్పుగా చదివించుకోవడం

మాత్రం మరవొద్దంటాడు.నిద్ర లేస్తూనే 

♦“అప్పు “ డే తెల్లారిందా? అంటూ ఆవులిస్తాడు.

మొఖం కడక్కుండానే పాసి నోటితో అప్పు 

కోసం జనం వెంటబడతాడు.అప్పు ఇచ్చారా!

సరే...లేకుంటే‌ మరో మాట మాట్లాడకుండా 

మౌనంగా వెళ్ళిపోయే సంస్కారి అప్పారావు.

అయితే ఇక్కడే అసలు ప్రమాదం పొంచివుందన్న సంగతి అప్పడిగించుకున్నోళ్ళకు తెలీదు.

మన అప్పారావు మౌనంగా వెళ్ళిపోయాడంటే పాపం ! 

వాళ్ళకా సంతోషం ఎంతో సేపునిలువదు

.అప్పారావు మౌనంలో  ప్రమాద 

ఘంటికలు మోగుతాయన్న సంగతి వాళ్ళకు

ఆతర్వాతగానీ తెలీదు.

అప్పారావు రూపురేఖలు….!!

♦మన అప్పారావు కొత్త రూపాయి నోటులా 

ఫెళ ఫెళ లాడుతూ వుంటాడు.కాలదోషం పట్టిన

పాత దస్తావేజు లాంటి మాసిన గుడ్డలు,బడి

పంతులు గారి చేబదుళ్ళులా చిందరవందరగా 

వుండే జుత్తు, అప్పు తెచ్చిన విచ్చు రూపాయిలా మెరిసే పత్తికాయ 

లాంటి కళ్ళూ,అప్పులివ్వగల వాళ్ళందరినీ చేపల్లా ఆకర్షించగల ఎ

ర లాంటి చురుకైన చూపులూ...అతను బాకీల

వాళ్ళకి కోపిష్టి వాడి జవాబులా పొట్టిగా టూకీగా వుంటాడు.

మొత్తం మీద అతని మొహం 

ముప్పావులా అర్థణాలా వుంటుంది.

♦(దా ) రుణ స్వభావాలు…!!

అప్పారావుకు అప్పులు చేయడం ఉగ్గుపాలతో అబ్బిన విద్య.అతని పుటకలోనే వాళ్ళ నాన్న 

♦ ఉగ్గు ‘ పొరిగింట నుంచి అప్పు తెచ్చి పట్టించాడట.

ఏడేళ్ళొచ్చేసరికి వాళ్ళ నాన్న బళ్ళో వేస్తూ..‘ పలకలు ,’ యెక్కాల బుక్కులూ 

సంచి పెట్టబోయేసరికి “ఎందుకయ్యా ఇంత ఖర్చు? “ అన్నాడట.

“నేను గబగబా బడి చదివేసి పెద్ద పోలీసు వాణ్ణయి పోయాకానేమో

 బోల్డు రూపాయలు అప్పుసంపాయించి అప్పు తీర్చేస్తానుగా “ అన్నాడట.

“పువ్వు పుట్టగానే పరిమళించింది”.అంటూ తెగ మురిసిపోయారు 

అప్పారావు జనకుడు,అతని 

మిత్రులు.ఏతావాతా చెప్పేదేమంటే..!

♦అప్పారావు మీకెదురుపడితే ముఖం తిప్పుకొని వెళ్ళొద్దు సుమా..మీకిష్టమున్నా,లేకున్నా…..

అప్పారావును “అప్పు” తోనేకొట్టండి.కష్టమైనా,

నష్టమైనా మీకదే మంచిది.

“రుణ రుగ్వేదికి వాదికి / రుణ కారణ జన్ముడైన రుణ భాదికి దా..

 రుణ బుద్ధికి రుణ సిద్ధికి / రుణ భ్రమా భ్రమరునకున్ రుణకిన్ ఘృణికిన్ “

అంటూ ..ఎంత ‘జేబుకు ‘ అంత ‘ అప్పు ‘ అని సరిపెట్టుకోండి.

♦తెలుగు వాళ్ళంతా పదికాలాల పాటు గుర్తుంచుకునేలా 

“అప్పారావు” ను సృష్టించి ,

మన మధ్యవదిలెళ్ళారు ముళ్ళపూడి సారు వారు. 

(నిజ జీవితంలో ముళ్ళపూడి వారికి,అప్పారావు పాత్రకు మధ్య 

ఎంతో సాన్నిహిత్యం వుంది.ఇది యాదృచ్ఛికం కావచ్చు గానీ నిజం. ముళ్ళపూడి వారు అప్పులు తీర్చడానికి చివరకువున్న ఇంటిని 

కూడా అమ్మేశారు.అప్పుడు ‘ బాపు ‘ గారు తన ఇంటిపైనే ఓ అంతస్తు వేయించి రవణ గారిని వుండమన్నారు.

ఆ రకంగా బాపు నుంచి స్నేహాన్నే కాక,ఇంటిని కూడా

 రుణంగా పొందారు ముళ్ళపూడి వారు.)

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐