🔴 - భోగినిమండపం-🔴

🔴 - భోగినిమండపం-🔴

#బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ

 మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న

 బాగవతంను  ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, 

తెలుగు వారిని ధన్యులను చేసినాడు.

.పోతన కొంతకాలం రాచకొండని పాలించిన పద్మనాయక రాజైన

 సర్వజ్ఙ సింగమ నాయకుడి ఆస్ధానంలో ఉండి “భోగినిదండకం” రాశాడు. 

ఇక్కడ మీరు చూస్తున్న  ఈ మండపం పేరు భోగినిమండపం…

ఈ మండపంలో ప్రదర్శించబడిన భోగిని నృత్యాన్ని ఆదర్శంగా

 తీసుకుని సహజకవి అయిన పోతన "భోగినిదండకం ” కావ్యాన్ని 

రాసాడని ప్రతీతి. 

 నల్గోండ జిల్లాలోని రాచకొండ కోటలో ఉందీ మండపం..

.

#బాలరసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్,

కూళల కిచ్చియప్పుడు కూడు భుజించుటకన్న 

సత్కవుల్ హాలికులైననేమి.

గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి

 నిజధారసుతొద్దర పోషణార్దమై…..

తమ కావ్యాలను రాజులకు అంకితమిచ్చి వారిచ్చే కానుకలతో నీచపు 

కూడు తినడం కంటే మంచి కవులు నాగలి చేత పట్టి అడవుల్లో కందమూలాలు తింటూ భార్యా పిల్లలను

పోషించటం నయం అని చెప్పిన పోతన ఒక చేత్తో హలం ,మరొక చేత్తో కలం పట్టి ఒక చేతితో పంటలను, మరొక చేత్తో సాహిత్యాన్ని పండించిన గొప్ప కవి పోతన.

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩