🔴🙏 -గురు అష్టకం-🙏🔴 🚩🚩ఆది శంకరాచార్య విరచిత గురు అష్టకమ్.

 

🔴🙏  -గురు అష్టకం-🙏🔴

🚩🚩ఆది శంకరాచార్య విరచిత గురు అష్టకమ్.

 గురువు ప్రాముఖ్యతని చెబుతూ ఒక ఆధ్యాత్మిక సాధకుడు 

గురువు పాదపద్మములకు ప్రణమిల్లడం ఎంత ముఖ్యమో ఇది వివరిస్తుంది.

 ♦

 #శరీరం సురూపం తథా వా కళత్రం

యశఃశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్.❤

🚩🚩

 చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికి, 

గొప్ప కీర్తి, మేరుపర్వతమంత డబ్బు ఉన్నప్పటికీ

 గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

 ♦

#కళత్రం ధనం పుత్ర పౌత్రాధి సర్వం

గృహం బాంధవా సర్వ మేతాధి జాతం,

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్❤

🚩🚩

భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి

గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద

 నిలపలేని మనస్సు ఉండి

ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

  ♦

షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య

కవిత్వాది గద్యం, సుపదయం కరోతి

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్

🚩🚩

నీవు ఆరు అంగములలోను, నాలుగు వేదములలోను, పారంగతుడవైనా కాని,గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన 

గాని, గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? 

ఏమి లాభం?

  ♦

#విదేశేషు మాన్యః, స్వదేశేషు ధన్యః

సదాచార వృత్తేషు మత్తో న చాన్యః

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్❤

🚩🚩

నిన్ను విదేశములో గొప్పగా, స్వదేశములో ధనవంతునిగా, 

సదాచార వృత్తి

గలిగి జీవించువాడవని పొగడబడినా, గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

  ♦

#క్షమా మండలే భూప భూపాల వృందై

సదా సేవితం యస్య పాదారవిందం

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్❤

 🚩🚩

నీవు ఒక దేశానికి రాజువైనా, ఎందరో రాజులు, రారాజులు

నీ పాదాలు సేవించినను, గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

  ♦

#యశో మే గతమ్ దీక్షు దాన ప్రతాప

జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్❤

దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినా,

ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ,

గురువు పాదాల వద్ద నిలపలేనిమనస్సు ఉండి ఏమి లాభం?

 ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?

  ♦

#న భోగే, న యోగే, న వా వాజి రాజౌ

న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్❤

భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము 

నందు నీవు శ్రద్ధచూపనప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? 

ఏమి లాభం?

 ♦

#అరణ్యే న వాసస్య గేహే న కార్యే

న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె

గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం

తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్❤

 🚩🚩

అడవిలో, ఇంటిలో ఉండాలని కోర్కెలేని వారైనా,

ఏదైనా సాధించాలని గాని, తన వంటి మీద శ్రద్ధగాని లేని 

వారైన గాని,గురువు పాదాల వద్ద నిలపలేని

మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? 

ఏమి లాభం? 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐