🔴*పంచపాండవులకు .వారి భార్యలు .. 🔴

 🔴*పంచపాండవులకు .వారి భార్యలు .. 🔴

#పంచపాండవులకూ ద్రౌపది భార్య.. 

కానీ పాండవులకు మొత్తం ఎందరు భార్యలు..? ఆసక్తికరం కదా..

 

ఆ అయిదుగురు పాండవులవీ వేర్వేరు వ్యక్తిత్వాలు.. పోలికలు... బలాలు, బలహీనతలు... అయిదుగురినీ సమానంగా మనోదేహాలకు స్వీకరించడం ఎంత క్లిష్టమో.. పాండవుల నడుమ ఉన్న దృడమైన సోదరబంధానికి వీసమెత్తు భంగం కలగకుండా చూడటం చాలా టఫ్‌ టాస్క్‌..  

♦ద్రౌపది ఒక సోదరుడితో ఉన్న ప్పుడు ఆ గదిలోకి వేరే ఏ సోదరుడుప్రవేశించకూడదని నియమం పెట్టుకుంటారు. 

ఒక సోదరుడితో ఒక ఏడాది గడుపుతుంది. అది మరో నియమం...  ఆమె చూపించిన నేర్పరితనం గొప్పదే. అయితే... ఒక సోదరుడు ఒక ఏడాది అంటే... ఒకరికి ఒక టరమ్‌ రావాలంటే నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకూ బ్రహ్మచర్యమే..? 

♦పాండవులందరికీ ద్రౌపది గాకుండా వేరే భార్యలు ఉన్నారు,

 వారితో సంతానం కూడా ఉన్నది... వాటికి సంబంధించిన కథలు, ఉపకథలు కూడా కనిపిస్తాయి. అయితే ద్రౌపది పాండవులందరికీ ముందే ఓ కండిషన్‌ పెడుతుంది. మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఇంకెవరూ తనతోపాటు సహ-భార్యగా (ఒకేచోట సవతిగా) ఉండటానికి వీల్లేదు. ఒక్క సుభద్ర విషయంలో మాత్రం కృష్ణుడి మాట వింటుంది. అంతే... మరి మిగతా పాండవ భార్యల మాటేమిటి..? 

ఒక్కొక్కటీ ఒక్కో కథ...

♦ద్రౌపదితో పరిణయానికి ముందే.. లక్క ఇంటి నుంచి తప్పించుకుపోయే సందర్బంలో.. భీముడు ఓ అడవిలో హిడింబుడిని వధిస్తాడు. భీముడి పోరాటాన్ని, ఆకారాన్ని చూసి హిడింబుడి సోదరి హిడింబి మోహిస్తుంది. పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు పుట్టినవాడే ఘటోత్కచుడు.. అయితే ఆమె తన రాజ్యానికే పరిమితం అవుతుంది. తన జాతి పద్దతుల మేరకే కొడుకును పెంచుతుంది... రాజస్థాన్‌, ఒడిశా జానపద కథల్ని చదివితే.. చిన్నప్పుడు భీముడితో విషం తాగించి, ఓ నదిలో పారేసి చంపాలని కౌరవ సోదరులు ప్రయత్నిస్తారు. కానీ అహుక అనే సర్పం ఆ విషాన్ని విరిచేసి,భీముడిని కాపాడి, నాగలోకానికి తీసుకుపోతుంది. అక్కడ ఓ నాగకన్యతో పెళ్లిచేస్తారు. వాళ్లకు బిలాల్సేన్‌ అనే కొడుకు పుట్టాడు. తను కురుక్షేత్ర యుద్ధంలోనూ పోరాడాడు అని ఆ కథలు చెబుతాయి..పేరుకు పెళ్లిళ్లే అయినా ఈ రెండూ తాత్కాలిక సంబంధాలే

♦శైవ జాతికి చెందిన గోవసనుడి కూతురు దేవికను ధర్మరాజు పెళ్లి చేసుకుంటాడు. వారికి పుట్టిన కొడుకు పేరు యౌధేయుడు. 

♦భీముడు కాశి రాజు కూతురు వలంధరను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ల కొడుకు పేరు సర్వాగుడు... 

♦నకులుడు చేది యువరాణి కరేణువతిని పెళ్లి చేసుకుని, నిరామిత్రుడిని కంటాడు. 

♦సహదేవుడు మాద్ర దేశరాజు ద్యుతిమతుడి కూతురు విజయను పెళ్లిచేసుకుంటాడు. వాళ్లకు సుూత్రుడనే కొడుకు పుడతాడు. మరి అర్జునుడు..?

♦ఓసారి ఏదో ఓ ధర్మసంస్థాపన పని కోసం... తప్పనిసరై ధర్మరాజు, ద్రౌపది కలిసి ఉన్న ప్పుడు ఆ గదిలోకి వెళ్తాడు అర్జునుడు.. ముందే పెట్టుకున్న నియమం ప్రకారం అలా ఆంతరంగిక సమాగమం సమయంలో వేరే సోదరుడు గనుక ఆ గదిలోకి ప్రవేశిస్తే ఏడాదిపాటు అరణ్యవాసానికి వెళ్లిపోవాలి... తప్పదు. వెళ్లవయ్యా, వెళ్లు, పనిలోపనిగా ఆ శివుడి తపస్సు చేసి, కొన్ని దివ్యాస్త్రాలు సంపాదించుకో అంటాడు కృష్ణుడు... అర్జునుడు ఆ పనితోపాటు వేరే పెళ్లిళ్లు సహా చాలాపనులు చేస్తాడు...మహాభారతానికి కొన్ని తమిళ అనువాదాల కథల ప్రకారం అర్జునుడు ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకుంటాడు. 

♦కానీ ప్రధాన కథల్లో మనకు కనిపించేవి మూడు పెళ్లిళ్లు.. 1) ఉలూపి.. ఈమె నాగలోకపు యువరాణి... అర్జునుడిని చూసి మోహించి, తన ద్వారా పిల్లలు కావాలంటుంది. అర్జునుడు కొంతకాలమే తనతో ఉన్నా చాలు అంటుంది. దాంతో పెళ్లి జరుగుతుంది... వాళ్లకు పుట్టిన కొడుకు ఇరావణుడు

 2) మణిపుర యువరాణి చిత్రాంగదను పెళ్లిచేసుకుంటాడు. పెళ్లయినా సరే తన బిడ్డ దగ్గరే ఉండాలని, వాళ్లకు పుట్టిన కొడుకును దత్తత తీసుకుంటాననీ, తన తదనంతరం తనదే రాజ్యాధికారం అనీ చెబుతాడు రాజు. తను బభ్రువాహనుడు. 

3) సుభద్ర...తనతో అర్జునుడి పరిణయగాథ అందరికీ తెలిసిందే...

ఇలా మహాభారతకథలో... పాండవుల జీవితంలో.... బహుభర్త, బహుభార్య... రెండూ కనిపిస్తాయి... అంటే ఒక స్త్రీకి ఒకరికిమించిన భర్తలు... అలాగే ఒక పురుషుడికి ఒకరికి మించిన భార్యలు...

♦ఇవన్నీ సరే... అరణ్యవాసంలో ద్రౌపది మాత్రమే పాండవులతో ఉంటుంది...

 ♦మరి యుద్ధం తరువాత ఎవరెక్కడ ఉన్నారు..? ఈ నాగరిక పోకడల్ని ఇష్టపడని హిడింబి తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోతుంది. దేవిక కూడా తన పుట్టింట్లోనే . ఉండిపోతుంది. 

♦సుభద్ర, ద్రౌపదితోపాటు చిత్రాంగద, ఉలూపి, వలంధర, కరేణుమతి, విజయ. వీళ్లంతా పాండవులతోపాటే చాలాఏళ్లపాటు హస్తినలోనే ఉంటారు. 

♦చివరకు మహాప్రస్థాన సమయానికి పాండవుల వెంట మరణం అంచుల దాకా నడిచింది కేవలం ద్రౌపది మాత్రమే..

  చిత్రం వడ్డాది వారి ..ఘటోత్కచు డి  జననం .

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐