♥️శివ అనే మాటకు శుభం అని అర్ధం. శివున్ని సాధారణంగా లింగ రూపంలోనే కొలుస్తారు. అలాగని శివమూర్తులు లేవని కాదు. శివుడి లింగ రూప, విగ్రహా రూప విధానాలేమిటో చూద్దాం. ♥️శివలింగాలు.💐 1) దైవికాలు: దివ్య శక్తులున్నవి. కేదారినాథ్,. కాశీ, రామేశ్వర మొ" చోట్ల ఇవి ఉన్నాయి. 2) ఆర్షకాలు :బుుషుల చే పూజింపబడేవి. 3) బాణాలు: శివుడు బాణుడనే రాక్షసుడిని సంహరించగా అతని శరీర భాగాలు గంగ, నర్మదా మొ" నదులలో పడినవి. అవే శివలింగాలైనవి. 4) మానుషాలు : మానవులచే నిర్మించబడినది. ♥️ఇక శివ ప్రతిమలు / విగ్రహాలు.!💐 శివప్రతిమలు స్థానక(నిలుచున్న) భంగిమలోను, ఆసిన (కూర్చున్న), మరియు అనుగ్రహామూర్తి సంహారమూర్తి మొ॥భంగిమలలో కలవు. ♥️స్థానక శాంత మూర్తులు.💐 1 లింగోద్భవమూర్తి : లింగం నుండి శివుడు జన్మించాడు. నాలుగు హస్తాలు, పైచేతులలో గొడ్డలి, జింక ఉంటాయి. మోకాలు క్రింది భాగం లింగం లో కలిసినట్టు ఉంటుంది. 2 చంద్రశేఖర మూర్తి : శిరసుపై చంద్రుడు ఆభరణంగా ఉంటాడు. శివుడు ఒంటరిగా ఉంటే కేవల మూర్తి అని, పార్వతి తో ఉంటే ఉమామహేశ్వర మూర్తి అని అంటారు. ఒక చేతిలో జింక, మరో చేతిలో గొడ్డలి లేదా ఢమరకం ఉంటాయి. క్రింది చేతులు అభయ, వరద (కోరికలు
Comments
Post a Comment