🔻కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం*🔻

 

🔻కొయ్యబారిన విష్ణువు - చమత్కార శ్లోకం*🔻

🚩ఒకాయన ఉత్కళ దేశంలో ఉన్న జగన్నాథుని దర్శించాడట. అక్కడి విగ్రహం చెక్కతో చేయబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడట.

సామాన్యంగా అన్ని దేవాలయాలలో విగ్రహాలు రాతితో గాని, లోహాలతో గాని చేయబడతాయి.

ఆ దారుమూర్తిని చూసిన ఆ కవి మదిలో ఒక చమత్కార శ్లోకం మెరిసింది.

💥శ్లో||

ఏకా భార్యా ప్రకృతిరచలా, చంచలా చ ద్వితీయా

పుత్రోనంగో, త్రిభువన జయీ,మన్మథో దుర్నివారః

శేషశ్శయ్యాప్యు దధి శయనం, వాహనం పన్నగారిః

స్మారం స్మారం స్వగృహచరితం దారు భూతొ మురారి!💥

🚩అదేమంటే, శ్రీ మహా విష్ణువు తన కుటుంబంలోని వారి ప్రవర్తనలను చూసి తట్టుకోలేక కొయ్యబారి పోయాడట.

విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు. ఒకావిడ కదలకుండా ఉండే ప్రకృతి (భూదేవి),

ఇంకొకావిడేమో (లక్ష్మి) ఒకచోట నిలకడగా ఉండకుండా, మనుష్యులను మారుస్తూ తిరుగుతూ ఉంటుందిట.

🚩కొడుకు(మన్మధుడు)ని చూద్దామా అంటే, ఎంతో దుర్మార్గుడని అందరితో తిట్లు తింటూ ఉంటాడు. అందరినీ బాధిస్తూ ఉంటాడు. వాడు బలంగా ఉన్నాడా అంటే, అసలు శరీరమే లేదు.

🚩ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుందామనుకుంటే, తాను నడుము వాల్చేది ఒక పెద్ద పాము మీద, ఆదేమో మెత్తగా ఉంటుంది. ఎంత సేపూ బుసలు కొడుతూనే ఉంటుంది. ఒక తలా ఏమన్నానా, వెయ్యి తలలాయె. ఒక దాని తర్వాత ఇంకొక తల బుసలు కొడుతూనే ఉంటాయి.

🚩ఆ పాముు ఉండేది పాలసముద్రం మధ్యలో. అన్నీ అలలే, హోరున శబ్దం. ఒక అల అటు వైపు నుండి కొడితే, ఇంకొకటి యిటు వైపు నుండి కొడుతుంది.

🚩పోనీ వాహనమెక్కి బయటికి పోదామా అంటే, అది ఒక పెద్ద గ్రద్ద, పైన ఎగురుతూ పోతూ ఉంటే, క్రింద పాము కనబడితే చాలు, తన యజమాని పని మర్చిపోయి, గబుక్కున క్రిందికి దిగి, ఆ పామును కాళ్లతో పట్టుకొని తినే వరకు కదలదు.

🚩ఇవన్నీ తలుచుకొని తలుచుకొని శ్రీ మహా విష్ణువు కొయ్యబారి పోయాడట!💥

✍🏿కవుల మనసులో ఏది మెరిస్తే దానిని చెప్పేస్తారు, చమత్కారంగా.😀


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)