❤️🔻 తపోభంగము!🔻❤️ (#కరుణశ్రీ మందారమకరందం.)
❤️🔻 తపోభంగము!🔻❤️
(#కరుణశ్రీ మందారమకరందం.)
ఉ.
*అందము చిందిపోవ చెవియందలి చెందొవ జారుచుండ "పూ
లందుకొనుం " డటంచు సుమనోంజలి ముందుకు చాచి శైలరా
ణ్ణందన వంగె - చెంగున ననంగుని చాపము వంగె - వంగె బా
లేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై.!*
✍🏿పరమేశుడి సేవార్థం తపోదీక్ష వాటికకు చేరుకుంది హిమరాజ
తనయ పార్వతి. అతిథి సత్కారాలు సాగించే స్థితిలో
‘అందము చిందిపోవ చెవియందలి చెందొవ జారుచుండ
పూ/లందుకొనుండ’టంచు ఆ సుమనోంజలి చేతులు చాచి కాస్తంత ముందుకు వంగింది.
#తపోభంగం కలిగించాలని రతీసమేతంగా వచ్చి చెట్టు మాటున దాగిన మన్మథుడి విల్లూ ఆ క్షణంలోనే వంగిందట.
పార్వతి అందించే కానుకలు గ్రహించేందుకు అంతటి మహేశుడూ
ఒకింత ముందుకు వంగడమన్నది దేవభాషో దేహభాషో
అప్పటికప్పుడు తెలియకున్నా- అదీ తలపుల పులకల పర్యవసానమే!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Comments
Post a Comment