❤️🔻🙏🏿-ఉషశ్రీ గారు.-🙏🏿🔻❤️
❤️🔻🙏🏿-ఉషశ్రీ గారు.-🙏🏿🔻❤️
#ఉషశ్రీ (మార్చి 16, 1928 - సెప్టెంబరు 7, 1990) అసలు
పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు.
ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు.
తండ్రి పురాణపండ రామూర్తి. తల్లి కాశీ అన్నపూర్ణ.
#అయినా మన వెర్రి గానీ ఉషశ్రీ గారి పేరు తెలియని
తెలుగువాడు ఉంటాడా ... ?
ఆవకాయ గురించి తెలీని తెలుగువాడు ఉంటాడా ... ?
గోంగూర పచ్చడి గురించి తెలీని తెలుగువాడు ఉంటాడా ... ?
#ఉషశ్రీ ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన "ధర్మ సందేహాలు" కార్యక్రమము
చాలా పేరు పొందినది. ఆ తరువాత వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు.
1973 లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించాడు.
అప్పట్లో, దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాథలలో మునిగి తేలేవారట.
ఈ విధంగా ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. ఉషశ్రీ గారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటే అది అతిశయోక్తి కాబోదు.
#పురాణం గారు ... ఉషశ్రీ గారు చాలా స్నేహంగా వుండేవారు ...
ఆ రోజుల్లో పురాణం గారు దమ్మిడీ కట్నం పుచ్చుకోకుండా కొడుకులిద్దరికీ ఆదర్శ వివాహం చేశారు ... ఆ వివాహ వేడుకకు శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు అధ్యక్షత వహించారు ... ఉషశ్రీ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ...
విజయవాడ ... సత్యనారాయణపురం ... శివాజీ కేఫ్ ( ఇప్పుడు లేదు ) పక్కన కళ్యాణమంటపం వివాహ వేదిక ...
మైకులో ఉషశ్రీ గారి గొంతు వినగానే ఆ చుట్టు పక్కల ఉన్న కుటుంబాల వారు పొలో మంటూ కళ్యాణ మంటపాన్ని చుట్టుముట్టారు ...
#ఆ క్రౌడ్ కంట్రోల్ చేసే డ్యూటీ అప్పుడు మాలాంటి బచ్చాగాళ్ళకి ఇచ్చేవారు ...
ఈ నెల 7 వ తేదీ ఉషశ్రీ గారి వర్ధంతి ...
🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹🙏🏿🌹
Comments
Post a Comment