❤️❤️-మోహన రాగం .-❤️❤️


                                       ❤️❤️-మోహన రాగం .-❤️❤️


✍🏿 సంగీతం నేర్చుకునే విద్యార్థులకి మాయామాళవ గౌళ, మలహరి రాగాల తర్వాత “వరవీణా మృదు పాణీ”అనే గీతంతో

మోహన రాగాన్ని పరిచయం చేస్తారు.

#నృత్య తారలందరూ అభినయం చేసే నారాయణ తీర్థ తరంగం “బాల గోపాల మా ముగ్థరా కృష్ణ “కూడా వున్నది మోహనలోనే!

నాకు తెలిసిన వొకటి రెండు క్షేత్రయ్య పదాలూ ఈ రాగం లోనే వుండటం విశేషం

వొకటి “ముందటి వలె నాపై నెనరున్నదా సామి ” ఇది “ఆత్మగౌరవం “సినిమాలో వాడుకున్నారు దీనికి కాంచన నృత్యం రక్తిగా వుంటుంది. రెండవది “మక్కువ దీర్చరా మువ్వ గోపాలా” ఇది కూడా “లేతమనసులు” సినిమాలో వస్తుంది అభినయించినది గీతాంజలి.

ఇక కీర్తనల విషయానికొస్తే త్యాగరాజ స్వామి చాలా కీర్తనలు రాశారు వాటిలో ప్రముఖమయినవి


#“నను పాలింపగ నడచి వచ్చితివా

దయరానీ దయరానీ దాశరథీ

మోహనరామా ముఖజిత సోమా

ఎవరురా నిను వినా గతి మాకూ ”


రాగాలు తెలియకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు.

నా మిత్రులలో సంగీతం గురించి ఏమీ తెలియకపోయినా చక్కగా విని

ఆనందించే వాళ్ళు ఉన్నారు.

ఇంకాకొంతమంది రాగాలు

తెలియకుండానే బాగా పాడే వాళ్ళు కూడా ఉన్నారు.

ఇక్కడ వ్రాయబోయే విషయాలు, రాగాల గురించి తెలుసుకుందా

మనకునే వారికోసం నేను సరదాగా చేస్తున్న ప్రయత్నం మాత్రమే!

ఎస్.రాజేశ్వరరావు గారు మంచి పేరున్న దర్శకులు ఆయన మోహనలో వర్జిత స్వరాలయిన “మధ్యమ,నిషాదాలను” వుపయోగించి పాటకు కొత్త అందం తెస్తారని పేరు.


ఆయన పాటలు


.మధుర మధుర మీ చల్లనిరేయి(విప్రనారాయణ -భానుమతి,రాజా)

.ఎచటినుండి వీచెనో యీ చల్లని గాలి(అప్పుచేసి పప్పుకూడు).

పాడవేల రాధికా(ఇద్దరు మిత్రులు).

.మదిలో వీణలు మ్రోగె(ఆత్మీయులు)

.నీవు రావు నిదుర రాదు(పూలరంగడు).

.ఇది చల్లని రేయైనా (పూజాఫలం)


#పెండ్యాలవారి బాణీలను పరిశీలిస్తే

#మోహన రాగ మహా మూర్తిమంత మాయే(మహామంత్రి తిమ్మరుసు)

మహా సుఖమైన పాట ఈ పాట ఇష్ట పడని వారుండరేమో. మీరజాలగలడా నాయానతి వ్రతవిధాన మహిమన్ ఈ పాట రచన ట్యూనింగ్ స్థానం నరసింహా రావు గారిదయినా దానికి చిలవలు పలవలు కల్పించి రాగప్రస్తారం కల్పించిన ఘనత పెండ్యాలదే.

సంగమం సంగమం అనురాగ సంగమం(కోడెనాగు )

ఘంటసాల వారి మోహన యెలా వుందో చూస్తే

తెల్లవారవచ్చె తెలియక నాసామి(చిరంజీవులు )మల్లాది వారి రచనకు వన్నె తెచ్చినది ఘంటసాలతో బాటు లీల


తిరుమలగిరి వాసా(రహస్యం)

మౌనముగా నీ మనసు పాడినా వేణు గానమును వింటినే(గుండమ్మకథ)

తిరుమల మందిర సుందరా (మేనకోడలు)


యం.యస్ .విశ్వనాథన్ గారి మోహన యెలా వుంటుంటే

చందన చర్చిత నీలకళేబర-జయదేవ అష్టపది(తెనాలి రామకృష్ణ)

మక్కువ దీర్చర మువ్వ గోపాల(లేతమనసులు)క్షేత్రయ్య పదం

టి.వి.రాజు యస్ .రాజేశ్వరరావు తర్వాత ఈయనే మోహనలో ఎక్కువ హిట్ పాటలిచ్చినట్టు కనపడుతుంది

వొక్క “జయసింహ “లోనే రెండు పాటలున్నాయి.

#ఈనాటి యీ హాయీ కలకాదోయీ నిజమోయీ

#మదిలోని మధురభావం పలికేను మోహనరాగం -ఈ పాటలో ఘంటసాలతో గొంతు కలిపినది మధుర గాయని బాలసరస్వతి.

#జయకృష్ణా ముకుందా మురారి(పాండురంగ మహాత్మ్యం)

పి.ఆదినారాయణ రావు

#ఘనా ఘన సుందరా (భక్త తుకారాం)

సత్యం సంగీత దర్శకత్వంలో కూడా మంచి హిట్సున్నాయి.

శివ శివ శంకర-(భక్తకన్నప్ప)

పిలిచినదీ పలికినదీ పరవశమై నవ మోహన రాగం-సుశీల,బాలూ పాడిన యీ పాట “సీతారాములు” లోనిది మోహన రాగానికి నమూనా గా ఈ పాటను చెప్పుకోవచ్చు.పాట మొదలయ్యే ముందు “వరవీణా” వినిపించారు చరణాల మధ్యలో “నిన్నుకోరి” వర్ణం వినిపించారు

ఇలాగే అచ్చంగా మోహన రాగం వినిపించే పాట “నీసరి మనోహరీ జగాన లేనే లేరుగా” పాడినదిసుస్వరలక్ష్మితో ఘంటసాల సంగీతం పామర్తి -చిత్రం(బభ్రువాహన)

ఇంకో అద్భుతమైన పాట “మల్లెపూవులు విరిసెరా”

కె.వి. మహదేవన్ సారధ్యం (ఇల్లాలు)

ఈ మధ్య వచ్చిన సినిమాలలో కీరవాణి చేసిన “ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వ మవుతున్నదో “కూడా చాలా మంచి పాట

మచ్చుకి హిందీ సినిమాలలో పాటలు కూడా రెండు మూడు చూద్దాం

జ్యోతి కలశ్ ఛల్ కే- లతా గొంతులో ఈ పాట వినడం వొక అనుభవం -సంగీతం సుధీర్ ఫడకే(భాభీకి ఛిడియా )

సయోనారా సయోనారా-లతా -శంకర్ జైకిషన్ (లవ్ ఇన్ టోక్యో)

దిల్ హుమ్ హుమ్ కరీ-లతా -భూపేన్ హజారికా -రుడాలీ

ఈపాట నన్ను చాలా కాలం వెంటాడింది

ఎన్ని పాటలు విన్నా మోహన రాగంలో వొక పాట మాత్రం నా మనసుని వేరే లోకాల్లోకి అలాగ్గా చేయి పట్టుకుని లాక్కెళుతుంది మనసంతా వొక మార్మికమయిన మాయ కమ్ముకుంటుంది.


తీరాచూస్తే అది తెలుగు సినిమా పాట కాదు హిందీ సినిమా పాట కాదు “అమర్ భూపాలీ “అనే మరాఠీ సినిమాలోని “ఘనశ్యామ సుందరా శ్రీధరా “అనే పాట.


ఈ సినిమా 1951లోప్రఖ్యాత నిర్మాతా,దర్శకుడూ అయిన వి. శాంతారాం”రాజ్ కమల్ కళా మందిర్ “పేరిట తీసిన సినిమా “హోనాజీ బాలా” అనే వొక గోవులను కాచుకునే సామాన్యునిలో వున్న అసామాన్య మయిన ప్రతిభను గురించి చెప్పే నిజ జీవిత గాథ.మరాఠీ దేశంలో వున్న “లావణీ “అనే సంగీత నృత్య విశేషాన్ని వెలుగులోకి రావడానికి తోడ్పడింది యితనేనట.


ఇందులో కథానాయకుడుగా నటించి పాడింది పండిట్ రావ్ నగరేకర్ అతనితో గొంతు కలిపి అమృతాన్ని వొలికించింది లతామంగేష్కర్ అనే కోయిల అజరామరమైన సంగీతాన్ని అందించింది వసంత్ దేశాయ్ .ఈ సినిమాలో సంగీతం అత్యున్నత స్థాయికి చెందినదని మహాకవి శ్రీశ్రీ కూడా మెచ్చుకున్నారొకచోట.


1952లో కాన్స్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో “గ్రాండ్ ప్రయిజ్ అఫ్ ది ఫెస్టివల్ “కి నామినేట్ చేశారు యీ చిత్రాన్ని.


“#ఘనశ్యామ సుందరా” పాటకి “ఇమ్మోర్టల్ సాంగ్ ” అనే అవార్డ్ వచ్చింది.


#మోహన రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు


1. లాహిరి లాహిరి లాహిరిలో… (మాయాబజార్‌)

2. చెంగు చెంగునా గంతులు వేయండి… (నమ్మిన బంటు)

3. ఎచటనుండి వీచెనో… (అప్పుచేసి పప్పుకూడు)

4. మనసు పరిమళించెను… (శ్రీ కృష్ణార్జున యుద్ధం)

5. అయినదేమో అయినది ప్రియ… (జగదేకవీరుని కధ)

6. మోహన రాగమహా మూర్తిమంత మాయే… (మహా మంత్రి తిమ్మరసు)

7. వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే… (సాగర సంగమం)

8. పాడవేల రాధికా… (ఇద్దరు మిత్రులు)

9. వినిపించని రాగాలే కనిపించని… (ఆరాధన)

10. నను పాలింపగ నడచి వచ్చితివా… (బుద్ధిమంతుడు)

11. ఘనా ఘన సుందరా… (చక్రధారి)

12. సిరిమల్లే నీవె విరిజల్లు కావే… (పంతులమ్మ)

13. మదిలో వీణలు మ్రోగె… (ఆత్మీయులు)

14. నిన్ను కోరి వర్ణం… (ఘర్షణ)

15. మధుర మధురమీ చల్లని రేయీ… (విప్రనారాయణ)

16. మదిలోని మధుర భావం… (జయసింహ)

17. ఈనాటి ఈహాయి కలకాదోయి… (జయసింహ)

18. నల్లవాడే వ్రేపల్లె వాడే… (చిరంజీవులు)

19. తెల్ల వార వచ్చె తెలియక నా స్వామి… (చిరంజీవులు)

20. మౌనముగా నీ మనసు పాడినా… (గుండమ్మ కధ)

21. తెలుసుకొనవె యువతీ అలా నడచుకొనవె… (మిస్సమ్మ)

22. చందన చర్చిత నీల కళేబర… (తెనాలి రామకృష్ణ)

23. ఆ మొగల్‌ రణధీరులు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం)

24. భారతీయుల కళా ప్రాభవమ్ము లిఖించి… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం)

25. కనులకు వెలుగువు నీవే కాదా… (భక్త ప్రహ్లాద)

26. శివ శివ శంకరా… (భక్త కన్నప్ప)

27. జ్యోతి కలశ… (భాభీ కీ చుడియా)

28. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో… (అమరశిల్పి జక్కన్న)

29. పులకించని మది పులకించు… ( పెళ్ళికానుక)

30. తిరుమల గిరి వాసా… (రహస్యం)


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩