🔻🙏🏿అహల్యా శాప విమోచనం !🙏🏿🔻

 



#అహల్య గౌతమ మహర్షి భార్య.

**ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది.


*ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు.

#ఇంద్రుడి మోసం తెలియని అహల్య అందుకు అంగీకరిస్తుంది. అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని రాయిలా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత ఆమె మోసపోయిందని గ్రహించి , త్రేతా యుగంలో మహా విష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాదదూళిచే ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు.

అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు.


#గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన విశ్వామిత్రుడు, లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. వెంటనే రాముడు తన పాదాన్ని ఆ రాయికి తగిలించి అహల్యకు శాపవిముక్తి కలుగ జేస్తాడు.

గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు.


🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻🙏🏿🔻

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩