🚩మన ఘంటసాల !
🚩మన ఘంటసాల ! తెలుగు వాడికి తెల్లవారితే 'దినకరా శుభకరా' ; మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే 'భగవద్గీత' ; సాయంత్రం వేడుకైతే 'పడమట సంధ్యా రాగం, కుడి ఎడమల కుసుమ పరాగం' ; రాత్రి 'కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది' , అలా కానప్పుడు 'నడిరేయి ఏ జాములో'' ... 'నిద్దురపోరా తమ్ముడా' ....'కల ఇదనీ నిజమిదనీ తెలియదులే' , అంతలోనే తెల్ల వారితే 'నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో' అన్న సందేహంలో సంతృప్తి - ఇవన్నీ ఆయన ప్రసాదించిన వరాలే. తెలుగు విద్యార్ధికి 'ప్రేమ తమాషా వింటేనే కులాసా' . కానీ 'పది మందిలో పాట పాడితే అది అంకితమెవరో ఒకరికే' అన్న సుతి మెత్తని బెత్తం దెబ్బా! తొందర పాటు నిర్ణయాలకు పోతుంటే 'కల కానిది విలువైనది బ్రతుకు- కన్నీటి ధారలలోనే బలి చేయకు' అన్న అక్షర లక్షల 'థెరపీ', ఆవేశం వస్తే 'ఆవేశం రావాలి' కానీ 'ఆవేదన కావాలి' అన్న మందలింపూ, ఆందోళనకు దిగితే 'తెలుగు వీర లేవరా' అన్న అదిలింపూ, ఎవరికి వారయి విడిపోతుంటే 'ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి' అన్న విదిలింపూ- ఇవన్నీ