Posts

Showing posts from December, 2022

🚩‘’ట్రావెంకూర్ సిస్టర్స్ ‘’-లలితా ,పద్మిని ,రాగిణి

Image
  ♦️ట్రావెన్‌కోర్ సిస్టర్స్ అంటే మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ చిత్రాలలో నటీమణులు, నృత్యకారులు మరియు ప్రదర్శకులు అయిన లలిత, పద్మిని మరియు రాగిణి ముగ్గురిని సూచిస్తుంది. ట్రావెన్‌కోర్ సోదరీమణులు గురు గోపీనాథ్ మరియు గురు T. K. మహాలింగం పిళ్లై వద్ద నృత్యం నేర్చుకున్నారురాగిణి క్యాన్సర్‌తో 1976లో మరియు లలిత 1982లో మరణించారు. పద్మిని 2006లో మరణించారు. భారతీయ వార్తాపత్రికలలో డజన్ల కొద్దీ సినిమాలు మరియు కథనాలు మినహా వారికి సంబంధించిన కొన్ని పత్రాలు మిగిలి ఉన్నాయి. ట్రావెన్‌కోర్ సోదరీమణులు తిరువనంతపురంలోని పూజప్పురాలోని ‘మలయ కాటేజ్’ అనే ఉమ్మడి కుటుంబంలో పెరిగారు. ట్రావెన్‌కోర్ సోదరీమణులు ప్రముఖ అందాల సుందరి నారాయణి పిళ్లై కుంజమ్మకు మేనకోడళ్లు, ఆమె కందమఠానికి చెందిన కులీన భూస్వామి కేశవ పిళ్లైని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ట్రావెన్‌కోర్ రాజును తిరస్కరించింది మరియు ఆమె ద్వారా నటి సుకుమారి తల్లి సత్యభామ అమ్మ మరియు ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి సంబంధించినది. వీరికి ట్రావెన్‌కోర్ సోదరీమణులు అనే పేరు వచ్చింది. ఉదయ్ శంకర్ తాను చేయాలనుకుంటున్న డ్యాన్స్ ఆధారిత చిత్రంలో నటించడానికి సోదరీమణుల

 అరాళ కుంతలా .🌹

Image
 అరాళ కుంతలా .🌹 🌺 ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ........... పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు. పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "

 🌹-ప్రవరాఖ్యుని కథ*-🌹 (అల్లసాని పెద్దన -మనుచరిత్ర .)

Image
🌺 వరణా ద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయ రుఙ్మండలీ హరిణంబై యరుణాస్పదం బనఁగ నార్యావర్త దేశంబునన్ బురమొప్పున్ మహికంఠహార తరళస్ఫూర్తిన్ విడంబింపుచున్! ‘వరణా’నదీ తీరంలో, ఆర్యావర్తము అని పిలువబడే ప్రాంతములో, ఆకాశాన్ని అంటుకునేట్లున్న భవన గోపురములను కలిగినది (వప్రస్థలీ చుంబితాంబరమై) తన పాలరాతి భవనముల తెల్లని కాంతులతో చంద్రుడి లోని జింకను కూడా తెల్లగా మెరిపించేది (సౌధసుధాప్రభాధవళిత ప్రాలేయ రుఙ్మండలీహరిణంబై) భూదేవి కంఠములో తళ తళలాడే హారములాంటి పట్టణము, అరుణాస్పదము అనే పట్టణము ఒకటి ఉండేది. వరణ – అసి అనే రెండు నదుల మధ్యన ఉన్న పవిత్ర ప్రాచీన నగరము వారణాసి (కాశి). అరుణాస్పదము అనే పట్టణం వరణ నదీ తీరములో ఉంది, అంటే దాదాపు కాశీలో సగము అనేంత పవిత్రత ఉన్న పట్టణము అన్నమాట! అక్కడ విశాలాక్షీ వరుడు, ఇక్కడ విప్రవరుడు ఉన్నారు, అది మరొక తేడా! యిద్దరూ మన్మధుని జయించినవారే, అదీ రహస్యము. నాలుగు వర్ణాలవారూ ఉన్నారు ఆ అరుణాస్పదం అనే పట్టణములో. 🌺 ఆ పురిఁ బాయ కుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనార

 🚩🚩-నారాయణరావు (నవల) (అడవి బాపిరాజు.)

Image
 🚩🚩-నారాయణరావు (నవల)            (అడవి బాపిరాజు.)                                                        (వింజమూరి .14)   ♦️నారాయణరావు తెలుగు నవలను ప్రముఖ సంగీతవేత్త, సాహిత్యకారుడు, చిత్రకారుడు అడవి బాపిరాజు రచించారు. 1934 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించిన తెలుగు నవలల పోటీల్లో ఈ నవల విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవలతో సమంగా ఉత్తమ నవలగా ఎంపికైంది.1934లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు (ఆంధ్రా యూనివర్శిటీయే లెండి) వారు తెలుగువారి సాంఘిక జీవనాన్ని ప్రతిబింబించే నవలలకు పోటీ పెట్టారు. గెలుపొందిన నవలకు వెయ్యి రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు. ఆ నవలా పోటీ కోసం విశ్వనాథ సత్యనారాయణ గారు 29 రోజుల్లో ఆశువుగా చెప్తూ 999 పేజీల నవలగా ఈ వేయిపడగలు రాశారు. అడవి బాపిరాజు గారూ ఈ పోటీ కోసమే నారాయణరావు నవల రాశారు. ♦️స్వాతంత్ర్య సమరయోధుడు ముష్టి లక్ష్మీ నారాయణ రావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాపిరాజు ఈ నవల రచించారన్నది ఆనాటి సాహిత్యవేత్తల అంచనా.[ కానీ బాపిరాజు మాత్రం నవల ముందు ఈ కథా, కథలోని పాత్రలూ కేవలం కల్పితములు. అనే వాక్యం ఉంచారు. ఈ నవలను మొదట ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. అడివి బాపిరాజ

🚩🚩మున్షి ప్రేమ్ చంద్ . 🚩🚩

Image
  ♦️ప్రేమ్‌చంద్ 1880, జూలై 31 న వారణాసి దగ్గర కాశికి నాలుగు మైళ్ళ దూరములో ఉన్న లమ్హీ గ్రామంలో ఒక తపాలా గుమాస్తా మున్షీ అజైబ్ లాల్, ఆయన భార్య ఆనందికి జన్మించాడు. ఆయన తల్లితండ్రులు ఈయనకు ధన్‌పత్ రాయ్ అని పేరుపెట్టారు. ఈయన మామ మహాబీర్, ఇతనిని 'నవాబ్' అని పిలిచేవాడు. ఈ పేరుతోనే ప్రేమ్‌చంద్ కొన్ని తొలి రచనలు చేశాడు. ప్రేమ్‌చంద్ తల్లిదండ్రులు ఆయన బాల్యంలోనే మరణించడంతో సవతి తల్లి, ఆమె పిల్లల బాధ్యత ప్రేమ్ చంద్ పై పడింది. వారి కుటుంబములో ఆరోగ్యము అంతంతమాత్రమే . అనారోగ్యము వారసత్వమూగా అందుకున్నాడు ప్రేమంచంద్ . ఆరోగ్యము సహకరించక, ఉద్యోగములో వస్తున్న తరచూ బదిలీలు భరించలేక ఉద్యోగము మానేసి పూర్తికాలం రచయితగా స్థిరపడ్డాడు . ♦️ ప్రేంచంద్ కి బాల్యములోనే వివాహమైంది. కాని అది బలవంతపు వివాహము, అయిష్ట వివాహము అనేవారు. పెద్దలు చేసిన పెళ్ళిని ఆయన అంగీకరించలేదు. ఆమెతో సంసారము చెయ్యలేదు. ఈ లోగా పేపర్లో ఒక ప్రకటన చూశారు . బాల్యములోనే వివాహవైధవ్యము సంభవించిన 11 యేళ్ళ బాలికను వివాహమాడేందుకు అభ్యుదయభావావు కలిగిన యువకుడు కావాలి అనేది ఆ ప్రకటన . అది చూసి ప్రేమ్‌చంద్ స్పందించాడు . తాను చేసుకుంటానని ముందుకు వ

🌹🌹🌹-మంత్రపుష్పం-🌹🌹🌹

Image
                                           🌹🌹🌹-మంత్రపుష్పం-🌹🌹🌹 ❤దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు. పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పం చెబుతుంది. మానవుల లోపల, బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని, ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో మంత్రపుష్పం చెబుతుంది. ♦‘‘మానవ శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడు: అని మంత్ర పుష్పంలో వర్ణించబడింది. ’ ♦చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తుల విశ్వాసం. ♦మనిషిలో వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి భక్తుడు, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని విన్నప్పుడు కళ్ళు మూసుకుని పరమాత్మని దర్శనం చేసుకోవాలి. ♦అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది.  నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో

🚩🚩-రాజశేఖర చరిత్రము. (నవల ) (కందుకూరి వీరేశలింగం.)

Image
  🚩🚩-రాజశేఖర చరిత్రము. (నవల )              (కందుకూరి వీరేశలింగం.)                            (వింజమూరి 13) #కందుకూరి వీరేశలింగం పంతులుగారు “రాజశేఖర చరిత్రము” ఆయన సమకాలీన కాలాన్ని ప్రతిఫలించేటట్లు రాశారు. ఆయన రాసిన నవలకు "వివేకచంద్రిక" అనే పేరు కూడా ఉంది. అంధ విశ్వాసాలవల్ల, ఆవివేకఫుటాచారాలను ఉపయోగించుకొని సంఘంలోని కపటులు కల్లరులు, కుక్షింబరులు, స్తుతి పాఠకులు, దాంభికులు బాగుపడుతున్నది తెలియచేస్తుంది. ప్రతి సంఘటనా - ఒక సాంఘిక దురా చారాన్నీ, ఒక మూఢ విశ్వాసాన్నీ హేళన చేసి, వికృత పరచి, విమర్శించే ఉద్దేశంతో కల్పించబడింది. రుక్మిణి కాసులపేరు రథోత్సవంలో దొంగిలించ బడటం - ప్రశ్న చెప్పేవారి దాంభిక వర్తనను బట్టబయలు చేయటానికీ, నృసింహస్వామి మరణవార్త ఎఱుక చెప్పువాళ్ళ కాపట్యాన్ని, ఎరుక నమ్మేవాళ్ళ మూర్ఖత్వాన్నీ హేళన చేయటానికీ, నృసింహ స్వామి రుక్మిణి కలలో కల్పించటం- భూత, ప్రేత , పిశాచాదులను వేళాకోళం చేయటానికీ పంతులు గారు కల్పించారు. హరిశాస్త్రుల భూతవైద్యం, పిఠాపురంలో ఆంజనంవేసి దొంగను పట్టటం, స్వర్ణయోగం తెలుసు నన్న బైరాగి- ఇచ్చిన స్వర్ణాన్ని దొంగిలించి పలాయనం చిత్తగించటం, సిద్ధాంతి కూతురు గ్ర

🚩-శేషప్రశ్న.(నవల ) (శరత్ చంద్ర ఛటోపాధ్యాయ!) _

Image
       🚩🚩-శేషప్రశ్న.(నవల )     (శరత్ చంద్ర ఛటోపాధ్యాయ!) _ #శరత్ చంద్ర ఛటోపాధ్యాయ.. భారతీయ సాహిత్య చరిత్రలో ఈ పేరును ఎరుగని వారెవరూ ఉండరు. బెంగాలీ రచయిత అయినా తెలుగువారికి ఆయన శరత్‌బాబుగా సుపరిచితులు. ♦️ దేవదాసు, లాంటి రచనలు శరత్‌ను తెలుగువాడే అన్నంత దగ్గరగా పాఠకులు నమ్మేలా చేశాయంటే ఆశ్చర్యమే. ♦️చక్రపాణి లాంటి తెలుగు రచయితలు శరత్ సాహిత్యాన్ని అనువాద రూపంలో పాఠకులకు అందించారు. శరత్ నవలలు ఎన్నో చలనచిత్రాలుగా కూడా రూపొందాయి. ♦️శరత్ జీవితకథ చాలా విచిత్రమైంది. 15 సెప్టెంబరు, 1876న ఆయన పశ్చిమ బెంగాల్‌లోని దేబానందపూర్‌లో జన్మించారు. చదువుకొనే వయసులోనే ఇల్లు విడిచిపెట్టి దేశాటనం చేశాడు. ఆ సమయంలో ఎందరో వ్యక్తులను కలిశాడు. అలా తన ప్రయాణంలోని అనుభవాలనే శరత్ అక్షరబద్దం చేశాడని అంటారు. ♦️దేవదాసులోని పార్వతి, శ్రీకాంత్ నవలలోని రాజ్యలక్ష్మి పాత్రలు నిజమేనని... శరత్ తనకు తారసపడ్డ వ్యక్తుల జీవితాల్లోని సంఘటనల ఆధారంగానే ఈ పాత్రలకు రూపకల్పన చేశాడని కూడా అంటారు. శరత్ తండ్రి మోతీలాల్‌కు సాహిత్యమంటే ఎంతో ఇష్టం ఉండేది. కొన్ని రచనలు కూడా చేయడానికి ప్రయత్నించారాయన. అయితే ఏవీ పూర్తయ్యేవి కావు... సగంలోనే ఉండిపో

🚩🚩మాలపల్లి (నవల)! (ఉన్నవ లక్ష్మినారాయణ.(1922 .))

Image
మాలపల్లి (నవల)! (                                                                           ఉన్నవ లక్ష్మినారాయణ.(1922 .)) శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణ రాయవెల్లూరు జైలులో వుండగా ఈ నవలను దేశభక్తి పూరితంగా సంఘసంస్కరణాభిలాషతో రచించారు. ఉన్నవ లక్ష్మి నారాయణ (1877-1958) గుంటూరులో జన్మించారు. డబ్లిన్ యూనివర్సిటీ (ఐర్లాండ్) లో బారిస్టర్ చదివేరు వేరు . మద్రాసు హైకోర్ట్ లో చేపట్టిన న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి తొలుత అతివాదిగా జాతీయోద్యమంలో ప్రవేశించినప్పటికి క్రమేణా గాంధేయవాదిగా మారారు. అకుంఠీత దీక్షతో సంఘ సంస్కరణాభిలాషతో ఉన్నవ విధవలకు, అనాధలకు, అణగారిన వర్గాల ఉన్నతికై పాటుపడ్డారు. తన సామాజిక వర్గం నుండి ఎదురైన నిరసనలను లెక్కచేయకుండా గుంటూరులో 32 వితంతు వివాహాలు జరిపి “గుంటూరు వీరేశలింగం’గా పేరుపొందారు. గుంటూరులో వితంతు శరణాలయం (1902), కార్వే మహాశయుని స్ఫూర్తిగా స్త్రీలకు వృత్తి విద్య కోసం ‘శారదా నికేతన్’ (1922) ల వంటి అనేక సంస్థలను స్దాపించారు. దళితుల అభ్యున్నతిని దళితుల ఆలయ ప్రవేశాలు, సహపంక్తి భోజనాల వంటి కార్యకలాపాలకే పరిమితం చేయకుండా నిర్మాణాత్మక రీతిలో పాటుపడ్డారు. కుల భేదాలు లేని సమ సమాజాన్న

 🚩🚩-కోనంగి.! (నవల .) రచయత ;అడవి బాపిరాజు..

Image
 🚩🚩-కోనంగి.! (నవల .)        రచయత ;అడవి బాపిరాజు.. # “అడవి బాపిరాజు గారు” వ్రాసిన “కోనంగి “. కోనగేశ్వరరావు బి.యే మొదటి తరగతి లో పాసైనాడు.  బందరు నివాసి. ముఖ్యంగా హాస్యభరితంగా మాట్లాడడం, కార్యసాధన చేయడం  కొనంగి విద్యలు. తల్లి వంటకత్తె. ఉద్యోగ ప్రయత్నం నిమిత్తము మదరాసు వచ్చాడు. ముందుగా హిందూ పేపర్ లో వచ్చిన అడ్వర్టైజు ప్రకారము ఓ లావుపాటి , విధవ, ధనవంతురాలైన వధువు ను చూసేందుకు వస్తాడు. కాని ఆ సంబంధము కుదరదు. ఉద్యోగ దరకాస్తు పట్టుకొని తిరుగుతూ బస్ స్టాప్ కు వస్తాడు. అక్కడ నిలబడలేక పక్కనే వున్న ఇంటి సిమ్హద్వారము వద్ద నిలబడుతాడు. అంతలో ఆ ఇంటిలోని కి వచ్చిన కార్ యజమానురాలి కంట్లో బడతాడు. వారి అమ్మాయి అనంత లక్ష్మి కి తెలుగు నేర్పేందుకు గురువు గా చేరుతాడు.  ఓ హోటల్ లో నెలకు రెండురూపాయల జీతం తో వడ్డన దారు గా , వైట్ వే లెయిడ్ లా కంపినీలో అమ్మకం మనిషిగా చేరుతాడు. ఇలా రక రకాల ఉద్యోగాలు చేస్తూ సినిమా లో నాయకుడిగా కూడా వేస్తాడు. అనంత లక్ష్మిని ప్రేమించి పెళ్ళాడుతాడు. ఆమె సహకారం తో ‘ నవజ్యోతి ‘ దినపత్రిక ప్రారంభిస్తాడు. క్లుప్తం గా కోనంగి కథ ఇది.  ఇంకా వివరంగా అందులో వచ్చే పాత్రలు, జమిందారు చెట్టియార