🚩🚩-కోనంగి.! (నవల .) రచయత ;అడవి బాపిరాజు..


 🚩🚩-కోనంగి.! (నవల .)
       రచయత ;అడవి బాపిరాజు..
# “అడవి బాపిరాజు గారు” వ్రాసిన “కోనంగి “.
కోనగేశ్వరరావు బి.యే మొదటి తరగతి లో పాసైనాడు.
 బందరు నివాసి.
ముఖ్యంగా హాస్యభరితంగా మాట్లాడడం, కార్యసాధన చేయడం
 కొనంగి విద్యలు. తల్లి వంటకత్తె. ఉద్యోగ ప్రయత్నం నిమిత్తము మదరాసు వచ్చాడు.
ముందుగా హిందూ పేపర్ లో వచ్చిన అడ్వర్టైజు ప్రకారము ఓ లావుపాటి , విధవ, ధనవంతురాలైన వధువు ను చూసేందుకు వస్తాడు. కాని ఆ సంబంధము కుదరదు.
ఉద్యోగ దరకాస్తు పట్టుకొని తిరుగుతూ బస్ స్టాప్ కు వస్తాడు. అక్కడ నిలబడలేక పక్కనే వున్న ఇంటి సిమ్హద్వారము వద్ద నిలబడుతాడు. అంతలో ఆ ఇంటిలోని కి వచ్చిన కార్ యజమానురాలి కంట్లో బడతాడు. వారి అమ్మాయి అనంత లక్ష్మి కి తెలుగు నేర్పేందుకు గురువు గా చేరుతాడు.
 ఓ హోటల్ లో నెలకు రెండురూపాయల జీతం తో వడ్డన దారు గా , వైట్ వే లెయిడ్ లా కంపినీలో అమ్మకం మనిషిగా చేరుతాడు. ఇలా రక రకాల ఉద్యోగాలు చేస్తూ సినిమా లో నాయకుడిగా కూడా వేస్తాడు. అనంత లక్ష్మిని ప్రేమించి పెళ్ళాడుతాడు. ఆమె సహకారం తో ‘ నవజ్యోతి ‘ దినపత్రిక ప్రారంభిస్తాడు. క్లుప్తం గా కోనంగి కథ ఇది.
 ఇంకా వివరంగా అందులో వచ్చే పాత్రలు, జమిందారు చెట్టియారు, డాక్టర్ , రెడ్డీ, చౌదురాణి మొదలగు వారి గురించి చెప్పవచ్చను కోండి . మీరూ కోనంగి పుస్తకం చదవాలి కదా అందుకని క్లుప్తముగా చెప్పానన్నమాట.
           నవలలో భాష చాలమటుకు మనకు అర్ధమైయేటట్లుగానే వుంది. అంత గ్రాంధీకమేమీ కాదు. సులువుగానే చదవ వచ్చు. కొన్ని కొన్ని పదాలు మటుకు వేరుగా వున్నాయి. కాస్త తమాషాగా కూడా అనిపించాయి.
బాహ్య ప్రదేశ చిత్రగ్రహణము ( ఔట్ దోర్ షూటింగ్ ),అలంకారికుడు,
మధ్య దూరం (మిడ్ లాంగ్ షాట్),కొమరిత,బే డ్రస్ ,
క్రోధమూర్చిత వ్యాఘ్రిపోలిక ఇలా ఇంకా వున్నాయి.
ఈ నవలలో మధ్య మధ్య పాటలు కూడా వున్నాయి
.ఉదాహరణకు , కోనంగి ,అనంతలక్ష్మి మీద వ్రాసిన పాట ,
” ఏ తపస్సు చేసినానో
ఏ అదృష్టము పొందినానో
నీవు దర్శనమిచ్చినావూ
నిత్య శోభాంగీ!
మధురకంఠీ! మసృణాంగీ!
మామకీన విలృప్తజన్మము
నిండు చేసిన నిర్మలాత్మా
నీవటే దేవి!
చూపవేమే సకలలోకము
చూపవేమే ప్రజాహృదయము
సుప్తి ఎరుగని మానవార్తిని
చూపవే దేవి!
ఆనాటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, ది ‘కోనంగి’నవల.
రెండవ ప్రపంచ యుద్దము, గాందీజీ సత్యాగ్రహము మొదలైన వాటి గురించి చర్చించారు
 ఈ నవలలో.
అడవి బాపిరాజు గారి గురించి దాశరధి కృష్ణమాచార్యులు గారు ఏమన్నారంటే ;
“ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి.ఏ నవలైనా తీసుకొని చదువుతే ఆయనకు ఎన్నెన్ని
 విషయాలు తెలుసో అర్ధమవుతుంది.తలస్పర్శిగా తెలిసిన వ్యక్తి ఆయన .”
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు బాపిరాజు గారి గురించి చెప్పిన
 కొన్ని పంక్తులు :
“అతడు గీసిన గీత బొమ్మై
అతడు చూసిన చూపు మెరుపై
అతడు పలికిన పలుకు పాటై
అతడు తలచిన తలపు వెలుగై
అతని హృదయములోన మెత్తన
అతని జీవికలోని తియ్యన
అర్ధవత్కృతియై అమృతరసధునియై”
ఈ పంక్తులు బాపిరాజు గారి హృదయ స్వరూపాన్ని మన కన్నుల ముందు నిలబెడుతాయి
(వింజమూరి  10.)
.             ♥️♦️.♥️♦️.♥️♦️.♥️♦️.♥️♦️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐