🌹🌹🌹-మంత్రపుష్పం-🌹🌹🌹

 

                                         🌹🌹🌹-మంత్రపుష్పం-🌹🌹🌹

❤దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు.
పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పం చెబుతుంది.
మానవుల లోపల, బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని,
ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో మంత్రపుష్పం చెబుతుంది.
♦‘‘మానవ శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడు: అని మంత్ర పుష్పంలో వర్ణించబడింది. ’
♦చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తుల విశ్వాసం.
♦మనిషిలో వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి భక్తుడు, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని విన్నప్పుడు కళ్ళు మూసుకుని పరమాత్మని దర్శనం చేసుకోవాలి.
♦అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం
అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది.
 నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది.
చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే "దైవం పరంజ్యోతి" అంటారు. అతనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప
 సారాంశం.
♦ *రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే*
*నమోవై యం వై శ్రవణాయ కుర్మహే*
*సమే కామాన్ కామకామాయ*
 *మహ్యం కామేశ్వరో వై శ్రావణౌ*
 *దధాతు
కుబేరాయవై శ్రవణాయ*
*మహారాజాయ నమః*
🚩🚩 రాజులకు రాజైన దేవుడోయి
 పరులకు లాభాలీయునోయి
వైశ్రవణునకు వందనమోయి
సకల కోరికల యజమానోయి
మా కోరికలన్ని తీర్చునోయి
అతడే కుబేరుడు వైశ్రవణుడోయి
ఆ మహారాజుకు వందనమోయి.)
♦*ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు,*
 *ఓం తదాత్మా
ఓం తత్సత్యమ్*
*ఓం తత్సర్వం , ఓం తత్పురోమ్ నమః*
🚩🚩అతడే బ్రహ్మ మతడే వాయువు
అతడే సత్య  మతడే ఆత్మ
అతడే సర్వ  మతడే ఆదిదైవం)
 ♦*అన్తశ్చరతి భూతేషు*
 *గుహాయామ్ విశ్వమూర్తిషు*
🚩🚩జీవులందున్నవాడు
బయటా వున్నవాడు
తెలియని వాడు
 విశ్వమంతా వున్నవాడు.)
♦*త్వం యజ్ఞ్యస్త్వం* *వషట్కారస్త్వం
మిన్ద్రస్తగ్o* *రుద్రస్త్వం విష్ణుస్త్వం*
 *బ్రహ్మత్వం ప్రజాపతిః*
*త్వం తదాప ఆపొజ్యోతీ*
 *రసో ౭ మృతం*
*బ్రహ్మ
భూర్భువస్సువరోమ్*
🚩🚩నీవే యాగము  యాగమంత్రము
నీవే  విష్ణువు బ్రహ్మ ఇంద్రుడవు
నీవే  జలము తేజము రసము
 నీవే శాశ్వతము  విశ్వరూపము
నీవే  ఓం కారబ్రహ్మవు.)
♦ *ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర*
 *స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్*
*బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మశివోమే*
*అస్తు సదా శివోమ్*
🚩🚩సకల విద్యలకు ఈసుడవు
సకల జీవులకు ఈసుడవు
నీవే బ్రహ్మ యజమాని
నీవే బ్రాహ్మల యజమాని
నీవే బ్రహ్మ సదాశివుడవు.)
♦*తద్విష్ణో పరమం పదగ్o*
*సదా పశ్యన్తి సూరయః*
*దివీవ చక్షు రాతతమ్*
🚩🚩ఆ విష్ణు లోకము నోయి
ఆ పరమ పధమునోయి
జ్ఞానులు సదా చూచేరోయి
ఆకాశమంతా చూచేరోయి)
♦*తద్విప్రాసో విపన్వవో*
 *జాగృవాం స్సమిన్దతే*
*విష్ణోర్య త్పరమం పదమ్*
🚩🚩కోరికలు దోషాలు లేని వారు
జాగృతి చలనాలు కలవారు
విష్ణులోక కాంతులు పెంచేరు
పరలోక ప్రకాశము )
♦*ఋతగ్o సత్యం పరమ్బ్రహ్మ*
*పురుషం కృష్ణ పింగళమ్*
*ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం*
*విశ్వరూపాయ వై నమో నమః*
🚩🚩ముక్తినాధుడు సత్యరూపుడు
బ్రహ్మ రూపుడు నల్లనివాడు
పైకి వెలుగు  తేజోవంతుడు
విరూపనేత్రుడు విశ్వరూపుడు
దేవదేవునకు మరల వందనము.)
 ♦*నారాయణాయ విద్మహే*
 *వాసుదేవాయ ధీమహి*
*తన్నో విష్ణు ప్రచోదయాత్*
🚩🚩నారాయణుని ఉహించెదను
వాసుదేవుని ధ్యానించెదను
విష్ణు చైతన్యము  కలుగు గాక
♦*ఆకాశ త్పతితం తోయమ్*
 *యథా గచ్ఛతి సాగరం*
*సర్వదేవ నమస్కారః*
*కేశవమ్ ప్రతి గచ్ఛతి*
🚩🚩ఆకాశ ధారాల నీరులు
ఎలా సాగరమే చేరునో
సకలదేవ వందనాలు
ఆ పరందామునే చేరును
♦మంత్రపుష్పం సంపూర్ణం
సర్వం భగవదర్పణం స్వాహా.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐