🚩🚩-నారాయణరావు (నవల) (అడవి బాపిరాజు.)


 🚩🚩-నారాయణరావు (నవల)
           (అడవి బాపిరాజు.)
                                                       (వింజమూరి .14)  
♦️నారాయణరావు తెలుగు నవలను ప్రముఖ సంగీతవేత్త, సాహిత్యకారుడు, చిత్రకారుడు అడవి బాపిరాజు రచించారు. 1934 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించిన తెలుగు నవలల పోటీల్లో ఈ నవల విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు నవలతో సమంగా ఉత్తమ నవలగా ఎంపికైంది.1934లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు (ఆంధ్రా యూనివర్శిటీయే లెండి) వారు తెలుగువారి సాంఘిక జీవనాన్ని ప్రతిబింబించే నవలలకు పోటీ పెట్టారు. గెలుపొందిన నవలకు వెయ్యి రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు. ఆ నవలా పోటీ కోసం విశ్వనాథ సత్యనారాయణ గారు 29 రోజుల్లో ఆశువుగా చెప్తూ 999 పేజీల నవలగా ఈ వేయిపడగలు రాశారు. అడవి బాపిరాజు గారూ ఈ పోటీ కోసమే నారాయణరావు నవల రాశారు.
♦️స్వాతంత్ర్య సమరయోధుడు ముష్టి లక్ష్మీ నారాయణ రావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాపిరాజు ఈ నవల రచించారన్నది ఆనాటి సాహిత్యవేత్తల అంచనా.[ కానీ బాపిరాజు మాత్రం నవల ముందు ఈ కథా, కథలోని పాత్రలూ కేవలం కల్పితములు. అనే వాక్యం ఉంచారు. ఈ నవలను మొదట ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు.
అడివి బాపిరాజుగారి "నారాయణరావు" నవలానాయకుడు"ఆజానుబాహుడు, అయిదడుగుల పదనొకండంగుళముల పొడవువాడు.బలసంపదకు నెలవైనవాడు.
♦️నవల రచయిత అడివి బాపిరాజు:కవి, చితర్కారుడు, నాటక కరత్, సావ్ంతంతర్య్ సమరయోధుడు, మానవతావాది, లాయరు, పిర్నిస్పాల, పాతిర్కేయుడు,
గాయకుడు, కళా దరశ్కుడు, అయిన అడివి బాపిరాజు బహుముఖ పర్జాఞ్శాలి. తెలుగువారింట జనిమ్ంచిన మణిపూస. నవల అయినా, కధైనా,
నాటకమైనా, పాటైనా, పదయ్మైనా అవలీలగా రాయగల సామరధ్య్వంతుడైన
రచయిత ఆయన.
♦️ఇక నారాయణరావు వైపుకు వస్తే- ఇదొక నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జరిగే కథ.
ఉన్నత తరగతికి చెందిన బ్రాహ్మణ రైతు కుటుంబం యువకుడు నారాయణరావు కథ ఇది. మద్రాసులో న్యాయవిద్యార్థిగా ఉన్న నారాయణరావు స్నేహితులతో కలిసి తన స్వగ్రామం కొత్తపేటకు రైల్లో వెళ్తుండగా నవల ప్రారంభమవుతుంది. విశ్వలాపురం జమీందారు, జస్టిస్ పార్టీ సభ్యుడు లక్ష్మీ సుందర ప్రసాదరావు తన మొదటి కుమార్తెకు జమీందారీ వివాహం చేసి దెబ్బతిని ఉండడంతో సామాన్యుడైన, యోగ్యుడైన వరుణ్ణి అన్వేషణ చేస్తూండగా నారాయణరావు కనిపిస్తాడు. నారాయణరావు, ఆయన వ్యక్తిత్వం నచ్చి ఆయనకు తన చిన్న కూతురు శారదను ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంటాడు. శారదకు ఇంట్లోనే సంగీతంతోపాటుగా చదువు కూడా చెప్పిస్తూంటారు.
♦️ఆమెను జమీందారీ కుటుంబం నుంచి అందునా తన మేనల్లుడు జగన్మోహనరావు ఇచ్చి పెళ్ళి చేయాలని తల్లి కామేశ్వరీ దేవి భావించడంతో ఈ సంబంధం ఆమెకు నచ్చదు. తండ్రికి మాత్రం జగన్మోహనుని ప్రవర్తన నచ్చక అతనికి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయడం ఇష్టం ఉండదు. ఐనా తల్లి చెప్పినదే సరైనదని అనిపించినా శారద తండ్రి మాట ఎదురాడలేక ఈ పెళ్ళికి అంగీకరిస్తుంది. నారాయణరావు తండ్రి సుబ్బారాయుడిని ఒప్పించి జమీందారు పెళ్ళి చేస్తారు. ఐనా తల్లి వల్ల ముందుగా తనలో ఏర్పడ్డ వ్యతిరేకత వల్ల నారాయణరావుతో సంసారం సజావుగా సాగించలేక పోతుంది శారద. ఆత్మగౌరవంతో ఈ విషయాన్ని ఎక్కడా పొక్కనివ్వడు నారాయణరావు.
♦️జమీందారు కుటుంబంలోని అమ్మాయిని, సాధారణమైన రైతు కుటుంబమైనా బాగా ఆస్తి, సంపాదన ఉన్న కుటుంబానికి చెందిన నారాయణరావనే కుర్రాడికి ఇచ్చి పెళ్ళి చేస్తే, వారి హోదాల మధ్య వ్యత్యాసంతో సంసారంలో కలతలు రావడం, చివరకు నారాయణరావు తన భార్య మనస్సును గెలుచుకోవడం ఇతివృత్తం.
 తెలుగు నాట జమీందారీ కుటుంబాలు, సామాన్య జీవితాలు, వైరుధ్యాలు, సాంసారిక సమస్యలు, ప్రేమలు- ఈ నవలలో కనిపిస్తాయి. ఇది విడిగా చూస్తే మంచి నవల అనే చెప్పాలి. కానీ, పైన చెప్పిన  నవలలతో కలిపి చూస్తే మాత్రం తేలిపోవడం ఖాయం.
విశ్వనాథ వారి వేయిపడగలకు బాపిరాజు గారి నారాయణరావు ఏ రకంగానూ సరితూగదని పాఠకుడిగా నా అభిప్రాయం. ఆ మాటకి వస్తే చలం మైదానం, విశ్వనాథ వేయిపడగలు వేరే వేరే అంశాలతో, వేరే వేరే స్తరాల్లో రాసినవే అయినా ఒకదానికొకటి పోటీ పడగల నవలలు.  (వింజమూరి .14)   
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐