🚩నశ్యం పండిత లక్షణం.!!(శ్రీ #విశ్వనాథ సత్యనారాయణ .)

 


ఆ. #విశ్వ నాధుఁడైన పృథ్వీశు రాముని,
కల్పవృక్షమందు గాంచ చేసి,
కవి వతంసు లెన్న కమనీయ కావ్యాన
వెలుగు చుంటివయ్య విశ్వనాధ.❤️
.
చ. #భరమగు నారికేళ పరిపాక కవిత్వ సుధా పయోధిగా
గురుతరమైన రామ కథ కోరి రచించిన భాగ్యశాలివే.
స్తిరముగ కీర్తి చంద్రికలు చిందులు వేయుచు భూ నభంబులన్.
సురుచిరమై వెలుంగును. విశుద్ధ కవిత్వ ఝరీస్వరూపుఁడా!❤️
.
ఉ. #పాకము నారికేళమది బ్రహ్మయు మెచ్చు విధాన గొల్పుటన్
నీకిక సాటి లేరనుట నిక్కము. కాంచగ చిత్రముల్. స్వయం
పాకము లోన కూడ సరి వారలు గల్గిరె? యన్న యట్లు యీ
లోకులు మెచ్చుతీరున సులోచన మైనను లేక చేయుదే?❤️
( సులోచనము=కళ్ళజోడు)
.
ఆ. #మనుమరాలు నేర్వ మహనీయ మగు వంట
చేయుచుంటి వీవు చేవ చూపి.
కవులు నేర్చునట్లు కల్పవృక్షము వ్రాసి
అంద జేసి తీవు విందు చేయ..❤️

శ్రీ #విశ్వనాథ సత్యనారాయణ గారి అసాధారణ జ్ఞాపక శక్తి మనకు ఆశ్చర్యం కల్గించక మానదు
"రామాయణ కల్పవృక్షం", "వేయిపడగలు" వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఉండరు. వారి అత్యద్భుత అసాధారణ జ్ఞాపకశక్తి ని తెల్పే క్రింది సంఘటన చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజులు. విశ్వనాథ గారు చెప్తుంటే వారి కొడుకులు వ్రాసేవారు. ఒక రోజు చూసుకొంటే 32 వ కాగితం నుండి 72 వ కాగితం వరకు కనిపించలేదు. ఇల్లంతా వెదికారు. కానీ కనబడలేదు. వారికి తమ తండ్రి గారైన విశ్వనాథ గారంటే చాలా భయభక్తులు ఉండేవి. అందువలన ఈ విషయం చెప్పడానికి సాహసించలేదు. గ్రంథం వ్రాయడం పూర్తయింది. ఇక ముద్రణకు వెళ్ళాలి. ఇక తప్పదనుకొని విశ్వనాథ గారికి చెప్పారు.
అందుకు విశ్వనాథ గారు " అందులో బాధపడాల్సింది ఏం లేదు" అంటూ మళ్ళీ పూర్తిగా కనబడకుండా పోయిన 40 కాగితాలలో ఉన్నదంతా చెప్పేసారు.
తర్వాత ఇంట్లో ఇంతకుముందు కనబడకపోయిన 32 నుండి 72 వరకు 40 కాగితాలు దొరికాయి.
అత్యంత ఆశ్చర్యకరం గా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా కనబడకుండా పోయిన కాగితాలలోని విషయం క్రొత్తగా మళ్ళీ చెప్పబడిన కాగితాలలో ఉంది. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,తప్పు లేదు.
ఇంత అసాధారణ జ్ఞాపకశక్తి మనకు ఆశ్చర్యం కల్గించకమానదు.🙏
సేకరణ:-Vinjamuri Venkata Apparao

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩