🚩🚩🔴 - "ఓనామహ సీవాయహ సీధం నమహ”- 🔴🚩🚩



.
♦నా చిన్నతనంలో వీధిబడులలో “#ఓనామహ సీవాయహ సీధం నమహ” అని పిల్లలు వల్లెవేస్తూ ఉండేవారు.
#ఓం నమః శివాయ, సిద్ధం నమః అని అర్థం అవడానికి చాలా కాలం పట్తింది.
అక్షరాభ్యాసం లో సరస్వతీ ప్రార్థన – “తల్లీ నిన్ను దలంచి వంటివి”-
తప్పక ఉండేది. వీటి అర్థం ఏమిటి? అ ఆ లతో ఎందుకు మొదలు పెట్టకూడదు? అనుకునే వాణ్ణి.
మన పుస్తకాలలో అది ఉండడం మన మతరహిత సమాజానికి విరుద్ధం అనే ప్రబుద్ధులు ఎక్కువయ్యారు. ఆ విషయాన్ని అక్కడతో వదలి - ఎందుకు ఉండాలి? అనేది తెలుగు పుస్తకాల్లలో దొరకదు.……………
💥సరే ఇంక అసలు విషయం లోకి వద్దాము.
అక్షరాభ్యాసం చేసే సమయంలో మొట్టమొదటగా ఓనామహ సీవాయహ అని మొదలెడుతారు.
అ ఆ ఇ ఈ అని రాయించ కుండా శివుడి పేరుతో ప్రారంభించటం ఏమిటి అని అడిగే వాళ్ళూ ఉన్నారు.
దానికి కారణాలు తెలుసుకోవాలంటే ముందర భారతీయ భాష పుట్టుక గురించి తెలుసుకోవాలి.
ఏ భాషైనా అక్షరమాల అన్న సూత్రంతో బంధించిన మాట వాస్తవమే కదా!
అక్షరమాలలో మనకు కనిపించేవి ప్రధానంగా అచ్చులు హల్లులు.
ఇవి అసలు ఎక్కడి నుండి పుట్టాయి? అన్ని భాషలలోనూ ఒకే రకంగా ఆఅ‌ఇఈ అనే మొదలెట్టటం కనిపిస్తూనే ఉంది.
అక్షరాలు ఎట్లా పుట్టాయో తెలుసుకుందాము.
విలయకారకుడుగా పేరు పొందిన శివుడు తన తాండవ కేళితో సమస్త జగత్తును ఆడిస్తూ ఉంటాడు.
నృత్తావసానె నటరాజ రాజః
ననాదఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్దాన్
ఏతద్విమర్శేత్ శివసూత్రజాలం
పై శ్లోకానికి క్లుప్తంగా అర్ధం చెప్పుకుంటే,.......
నాట్యం చేసే సమయంలో నటరాజు నవపంచవారం, అంటే తొమ్మిది ఐదు కలిపి పద్నాలుగు తడవలు ఢమరుకం వాయిస్తాడు.
ఆ నాదం నుండి వెలువడ్డ ధ్వనుల ఆధారంగా పుట్టినవి శివసూత్రాలు, అని మహేశ్వర సూత్రాలు అని అంటారు. ఆ ధ్వనులే ఈ నాటి అక్షరాలు.
అక్షరము అంటే క్షరము లేనివి
ఆ పద్నాలుగు ధ్వనులు.
1. అ ఇ ఉ ణ్
2. ఋ లుక్( ఈ లుకారము ఇప్పుడు వాడుకలో లేదు)
3. ఏ ఓ ఙ్
4. ఐ ఔ ఛ్..........
అ తో మొదలయి ఛ్ తో అంతమైన ఈ శబ్దాలను అచ్చులు అన్నారు.
5. హ య వ ర ట్.......
6. ల ణ్.........
.7. ఞ మ ఙ్ ణ న మ్........
8. ఝ భ ఞ్
9. ఘ ఢ ధ శ్ ...........
10. జ బ గ డ ద శ్...........
11. ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్.......
12. క ప య్........
13. శ ష స ర్...........
14. హ ల్..........
హ మొదలుకొని ల్ వరకు సాగిన ఈ ధ్వనులను హల్లులు అంటున్నాము.
అట్లా ఏర్పడ్డ శబ్దాలకు ఋషి సమూహంలో ఉన్న పాణిని వాటికి రూపం ఏర్పరచి, తరువాత వ్యాకరణ శాస్త్రం రూపొందించాడు.
ఆ విధంగా శివుని ఢమరుకం నుండి పుట్టినందువల్ల అక్షరాభ్యాస సమయంలో ఓమ్ నమః శివాయః సిద్ధం నమః  అని రాయించటంతో ప్రారంభిస్తారు.
దానినే ఓనామహ సీవాయహ సీధం నమహ అని వాడుకగా అనటం కూడా కద్దు.

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩