🚩🚩“నల దమయంతి” 🚩🚩

 ....
                





✍🏿విదర్భగా పిలవబడే కుండిన దేశపురాజు భీష్మకుడు. అతని కూతురే దమయంతి. రూపలావణ్యాలకే కాదు, గుణసౌశీల్యాలకు దమయంతి పెట్టింది పేరని స్వర్గలోకం వరకూ పేరు పాకింది. అందుకని ఆమెను పెళ్ళాడడం కోసం దేవేంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు ఉవ్విళ్ళూరారు.
అప్పటికే నలుని దగ్గరనుండి వచ్చిన సుచిముఖి అనే హంస ద్వారా దమయంతి అన్నీవిని మనసు పెంచుకుంది. నలునికీ దమయంతి అంటే ఇష్టమే. ఇంతలో దమయంతి స్వయవరం ప్రకటించాడు తండ్రి భీష్మకుడు. నల చక్రవర్తిని స్వయంవరానికి రమ్మని కోరి హంసతో రాయభారం పంపింది దమయంతి.
దమయంతి స్వయవరం. ఆమె కళ్ళు నలుని కోసం వెతుకుతున్నాయి. నలుని చూడగానే ఆమె మనసు ఉప్పొంగింది. ఆనందం యెంతోసేపు నిలవలేదు. ఒక నలుడు కాదు, పక్కన మరో నలుగురు నలులున్నారు. అప్పడు దమయంతికి అంతకు ముందు జరిగింది గుర్తుకు వచ్చింది. తన అంతఃపుర మందిరంలోకి అదృశ్యుడై వచ్చిన నలుడు దేవేంద్ర అగ్ని వాయువరుణ దేవుళ్ళు నిన్ను కోరుకుంటున్నారని చెప్పాడు. అప్పుడే తను వలచిన వానినే వరిస్తానని చెప్పింది. మరిప్పుడు తన ముందున్న అయిదుగురు నలుని రూపధారుల్లో తన నలుడెవరో? సాయం కోరుతూ సరస్వతీ దేవిని ప్రార్థించింది. అలా తను ప్రేమించిన నలున్నే మాలవేసి పెళ్ళాడింది దమయంతి.

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐