🚩🚩-గుర్రం జాషువా -పాపాయి పద్యాలు.❗️
❤మహాకవి గుర్రం# జాషువా రచించిన నాలుగు పాపాయి పద్యాలను సంగీత దర్శకుడు, ఆంధ్రుల అమర గాయకుడు శ్రీ #ఘంటసాల వెంకటేశ్వరరావు నాలుగు విభిన్న రాగాల్లో స్వరపరచి గానం చెయ్యటం తెలుగువారి అరుదైన అదృష్టమే. అప్పుడే పుట్టిన పాపాయిపై ఇంత రసాత్మకంగా కట్టిన పద్యాలు బహుశా తెలుగులో మరింక లేవేమో! ఈ పాపాయి పద్యాలలో ఇంత మంచి సాహిత్య సృష్టి జరిగింది. కానీ, ఆ సాహిత్యాన్ని అనుభవించి, పలవరించకపోతే అద్భుతమైన సంగీత సృష్టి అసాధ్యం. ఆ పని చేసి ఘంటసాల ఈ పద్యాలకు చిరాయువు కల్పించాడు. ❤మొదటి పద్యం: #నవమాసములు .! (నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!) ♥️రాగం: హిందూస్తానీ సంగీతంలో దుర్గా (కర్నాటక సంగీతంలో శుద్ధ సావేరి) ♦️#నవమాసములు భోజనము నీరమెరుగక, పయనించు పురిటింటి బాటసారి చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో, నిద్రించి లేచిన నిర్గుణుండు నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన, ముద్దులు చిత్రించు మోహనుండు అక్షయంబైన మాతృక్షీర మధుధార లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ ♦️#బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు, ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ) వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత కరపి యున్నది వీని కాకలియు నిద్ర! ---- ❤రెండవ పద్