🚩 వ్యాసుని జన్మ వుత్తాంతము : -

 



(ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది)
.
🚩మత్స్యగంధిఁ గోరి, మౌని పరాశర్యుఁ
డామె కన్నెతనము హతము కాని
వరము నొసఁగి, కలియ, వ్యాసుండు జన్మించె!
భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె
(ుండు మధుసూదన్ గారి పద్యం ...వారికి కృతజ్ఞలతో )
.
.
♦️పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు .
ప్రతిరోజు వార , తిది , నక్షత్రాలను తం అరచేతిలోనే చూడగల
మహిమాన్వితుడు .
ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా
" మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ
సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల
నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా ... ఆ ననిమాలు
ఇలా ఉనాయిట :-
♦️దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి ,
బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి ,
వదువు కన్య అయి ఉండాలి ,
♦️వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి ,
లంక లో పెండ్లి జరగాలి ,
♦️పిండోత్పత్తి ' ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి ,
ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్ఞానము కలిగి ,
బ్రహ్మసమానుడై ఉంటాడని- అలోచిస్తూ
నదీతీరాన నడుస్తూ ఉన్న ఆ పరశరునికి ...
తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదని అలోచన కలిగి
చుట్టు చూడగా ......అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి
మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, ఆ రతి వెనక ఉన్న
జన్మరహస్యాన్ని వివరిస్తాడు . అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా
చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి
ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. .
♦️చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం
వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు.
♦️అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది.
అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో
పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు.
పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే ,
అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు.
నదిలో లంక ఉండనే ఉన్నది ,
బ్రాహ్మణునికై బ్రహ్మదేవుని రమ్మని కోరగా ... తన శక్తి స్వరూపాలతో పుట్టె
బిడ్డకు (తన డిటో) తాను సహకరించే ప్రశ్నేలేదని ఖరాకండిగా
చెప్పడం తో , నారదముని సహయము తో వివాహం జరిపించి
ఆ మహత్తర కార్యానికి నాందిపలికేరు .
ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు.
♦️ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి
తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే
ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
(వడ్డాది వారి చిత్రం
🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤🙏🌹❤

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐