🀄️🚩🚩-కంచికి పోతావా కృష్ణమ్మా” – పల్లవికి అర్థం ఏంటమ్మా?..🀄️🚩🚩

 


“#శుభోదయం” చిత్రంలోని మధుర గీతం
“కంచికి పోతావా కృష్ణమ్మా” ఎంత బావుంటుందో!
వేటూరి ముద్దుగా రాసిన సాహిత్యానికి మామ మహదేవన్
ఎంతో సొగసుగా బాణీ కట్టారు.
అయితే ఆ పాట పల్లవిలో “కంచి”, “కృష్ణమ్మా” ఎందుకొచ్చాయో ఎప్పుడూ పట్టించుకోలేదు.
ఈ మధ్య వేటూరి తనయులు శ్రీ రవి ప్రకాశ్ గారిని అడిగితే – “వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పిల్లల పాట ఒకటి ఉంది.
ఆ పాట ప్రేరణతో వేటూరి గారు ఈ పల్లవి రాశారు!” అన్నా రు
బాలభాష 🌹
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కంచికామాక్షమ్మ
కంచికామాక్షమ్మ
కంచికి పోతావా కృష్ణమ్మా!
ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా?
కంచిలో ఉన్నది అవ్వ;
ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ.
బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి యింటిది అప్పు;
ఆ - అప్పు నాకు పెట్టు పప్పు.
పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా,
నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా?
దొడ్లోను ఉన్నది బీర;
ఆ - బీర నాకు పెట్టు కూర.
కూర ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా?
కోమటి అక్కెమ్మ చెయ్యి;
ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి.
నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా;
నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా?
ఉన్నయింటి యిరుగుపొరుగు,
ఆ - పొరుగు నాకుపోయు పెరుగు.
బువ్వ తిందువుగాని కృష్ణమ్మా;
నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా?
అక్కడ ఉన్నది అమ్మ,
నేను - మొక్కివత్తును కామాక్షమ్మ.
ఇలా ప్రశ్నోత్తరాలతో సాగుతుంది పాట.
ఇక్కడ సమాధానంలో అవ్వ-బువ్వ బదులు బొమ్మా-ముద్దుగుమ్మా అనడం వేటూరి చమత్కారం.
సినిమాలో ఒకరినొకరు ఇష్టపడ్డా, ఇంకా బైటపడని
అబ్బాయి-అమ్మాయి ఉంటారు. అమ్మాయికి వినిపించేలా ఓ బొమ్మతో మాట్లాడుతున్నట్టు పాటందుకుంటాడు అబ్బాయి.
పల్లవిలోనే విషయం బైటపెట్టేస్తాడు – నా ధ్యాసంతా ఆ ముద్దుగుమ్మేనంటూ. ఏ ముద్దుగుమ్మో మనకీ తెలుసు,
ఆ అమ్మాయికీ తెలుసు!
అవునవును! ప్రేమలో పడ్డవాళ్ళకి అన్నీ మంచివార్తలే!
పడనివాళ్ళ కోసం ఇదిగో ఇలా మంచిపాటలు!
HTTPS://WWW.YOUTUBE.COM/WATCH?V=8FNTBOGBO5G

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩