🚩🚩-కాంతం కబుర్లు .-🚩🚩
***♦1962సంవత్సరంలో అనుకుంటాను… *** రాజమండ్రిలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో తెలుగు రచయితల మహాసభలు జరిగాయి… అప్పుడు మునిమాణిక్యం, మొక్కపాటి, నోరి నరసింహశాస్త్రి, భమిడిపాటి రాధాకృష్ణ మొ||న అనేకమంది రచయితలను చూసే భాగ్యం నాకు కలిగింది… మునిమాణిక్యం వారు ప్రసంగించారు… ప్రతి అక్షరం వివరించలేను కాని ఆయన మాట్లాడిన దాని సారాంశంగా— “… . ♦ఈ నెల జీతం మా కాంతానికిచ్చాను…లెక్కెట్టుకుంది… ‘ఏమిటండీ జీతం తక్కువ ఉందేమిటే’ అంది. ‘వాళ్ళు తీసుకున్నారే’ అన్నాను. ‘వాళ్ళెవరు ?’ – ‘గవర్నమెంటోళ్ళు’ – ♦‘గవర్నమెంటోళ్ళా ? ఎందుకు ?’ – ‘వాళ్ళేదో యుద్ధం చేస్తున్నారట. అందుకని….’ అన్నాను. ‘యుద్ధమా ? ఎవరితోనూ ?’ అడిగింది కాంతం. ♦‘చైనా వాళ్ళతోటి మన గవర్నమెంటు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అందుకని మా ఉద్యోగస్థులందరి దగ్గర ఓ రోజు జీతం విరాళంగా వసూలు చేసారు.. ఇలా ఇంకా కొన్నాళు చేస్తారట….’ అని వివరించా. ‘♦ఆ చీనీ వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేస్తారా ? దానికి మీ అందరి దగ్గర డబ్బులు లాక్కుంటారా ? బాగుందండి…. నాకు తెలియక అడుగుతాను… మీ డబ్బులూ, మీ డబ్బులూ పోగు చేసి ఇంతోటి వెర్రిముండా గవర్నమెంటూ ఇప్పుడు యుద్ధం చేయకపోతే వచ్చే నష్టమేమ