🚩🚩 🔴 -షట్పదీ స్తోత్రం భావార్ధం- 🔴 🚩🚩
🚩🚩 🔴 -షట్పదీ స్తోత్రం భావార్ధం- 🔴 🚩🚩
❤ఆరు కాళ్ళు ఉండే తుమ్మేదను షట్పదీ అంటారు.
ఆరు శ్లోకాలున్న ఈ స్తోత్రాన్ని షట్పదీ స్తోత్రం అని అంటారు.
శ్లో 1:
అవినయం అపనయ, విష్ణో దమయ మన:శమయ విషయ మృగ తృష్ణామ్,
భూత దయం విస్తారయ తారయ సంసార సాగరత: ||
‘విష్ణుమూర్తి! అహంకారాన్ని తొలగించు. నా మనసును నియంత్రించు. విషయసుఖాల మృగతృష్ణలు శమింపజేయి.నాలోభూతదయ ను విస్తరింపజేయి. సంసారసాగరం నుంచి దాటించు’. మోక్షసాధనకు మొదటి శత్రువు అవినయం, అహంకారం. మరో శత్రువు మనోనిగ్రహం లేకపోవటం. ఈ రెండు శత్రువులనూ భగవత్కృపవల్ల జయింపవచ్చు అని ఆచార్యుల మతం.
శ్లో 2 :
రెండో శ్లోకంతో, సాధకుడు శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తాడు
దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే ||
భవ భయం వల్ల కలిగిన భేదాన్ని ఛేదించేందుకు, నేను శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తున్నాను. అవి ఆకాశగంగా మకరందానికి జన్మస్థానం. దివ్యధుని మకరందాలు. ఆ పాదారవిందాల పరిమళాన్ని అనుభవించటమే సత్-చిత్-ఆనందం. ఆ తర్వాత సాధకుడు భగవంతుడితో ఇలాఅంటాడు; ‘జగన్నాథా, జ్ఞానప్రాప్తి తరవాత మన మధ్య భేదం తొలగి పోతుంది, కానీ అప్పటివరకూ నేను నీ వాడినే గాని నువ్వు నా వాడివి కావు. తరంగం సముద్రంలో భాగం, కానీ సముద్రం తరంగంలో భాగం ఎప్పటికీ కాదు’.
శ్లో 3: సత్యపిభేదాపగమేనాథతవాహం నమామకీనస్త్వం
సాముద్రోహి తరంగ: క్వచన సముద్రోనతారంగ:
ఓ నాథా, ” నీవు”, “నేను” అనే బేధం పోయి పరమార్థ సత్యం దర్శనం వరకూ నేను నీయందే ఉన్నాను (తవ అహం) కానీ ఎప్పుడూ నీవు నావాడవు (మాత్రమే) కావు. అది ఎలాగంటే, ఎల్లప్పుడూ తరంగాలన్నీ సముద్రానివే కానీ సముద్రమెప్పుడూ ఏ ఒక్క తరంగానిదీ కాదు కదా!
ఎలాగైతే సముద్రము అలలు ఒకటే అని అనిపించినా, సముద్రపు అల సముద్రములోని భాగమే కానీ సముద్రం అలలోని భాగం కాదో, అలాగే సత్యము గ్రహించు నపుడు కూడా, భేదము గ్రహించలేనప్పుడు, నేను నీలోని భాగమే కానీ నీవు నాలో భాగము కావు.
వేదాంత శ్లోకాలలో కూడా కావ్యశ్లోకాలను మించే శబ్దాలంకారాలు,అర్థాలంకారాలు ప్రయోగించటం ఆచార్యుల వారికి అలవాటే. ఈ శ్లోకంలో యమకాలూ, ముక్తపద గ్రస్తాలూ చూడండి:
శ్లో 4:
ఉదృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టేభవతిప్రభవతి నభవతికీం భవతిరస్కార:
గోవర్ధన నగాన్ని ఉద్ధరణ చేసినవాడా! నగభిత్తు ఇంద్రుడి సోదరుడా! రాక్షసుల అమిత్రా! సూర్యచంద్రులు కన్నులుగలవాడా! నిన్ను దర్శించగా, సమర్థత కలుగుతుంది. భవ దు:ఖ నాశనం జరగకుండా ఉంటుందా?
శ్లో 5:
అయిదో శ్లోకం మత్స్యావతారాన్ని స్మరించి
మత్స్యదిభిరవతారై రావతారవతావతా సదా వసుధాం
పరమేశ్వరా! పరిపాల్యో భవతా భవథాపభీతోహమ్
ఆ అవతారంలో భూమిని రక్షించినట్టే, ఇప్పుడు భవ భయంలో వణుకుతున్న నన్నూ రక్షించమని వేడుకొంటాడు.
శ్లో 6:
ఆరో శ్లోకంలో కూర్మావతారాన్ని ప్రస్తావించి
దామోదర! గుణమంధిర! సుందరవదనారవింద! గోవింద భవజలధి మధనమందర! పరమందరం మపనయత్వం మే!
భవజలధి మథనానికి నువ్వే కవ్వంగా నిలిచే మందర పర్వతానివి. అపరిమితమైన నా భయాన్ని ‘పరమం దరం’ – నువ్వే పోగొట్టాలి అని ప్రార్థిస్తాడు.
శ్లో 7 :
నారాయణ! కరుణామయ!, శరణం కరవాణితావకౌచరణౌ
ఇతి షట్పదీ మదీయే వాదన సరోజే సదా వసతు!
నారాయణా! కరుణానిధీ! నీ చరనద్వయమే శరణు కోరుతాను! ఈ షట్పది, నా ముఖకమలంలో సదా వసించుగాక! అంటూ షట్పదీ (స్తోత్రం), ముఖ కమలం పదాల వల్ల సిద్ధించిన మనోహరమైన శ్లేషలో ఈ స్తోత్రం ముగుస్తుంది. అంటే కేవలం జ్ఞానమార్గం అవలబించగోరే వేదాంతికి కూడా, ఆమార్గంలో సాధన చేసేందుకు కావాల్సిన శమదమాలకు స్వామికృప తప్పదని ఆచార్యులబోధ.
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
శ్రీమహావిష్ణువు లోనే ఈ విశ్వం అంతా ఇమిడివుంది. ఆయనే విశ్వం (Universe). విశ్వమే ఆయన. అందువల్లనే ఆయనను "విశ్వవ్యాపి" అన్నారు. విష్ణువు అసలు స్వరూపాన్ని "విశ్వరూపం" అన్నారందుకే! పరమాత్ముని స్వరూపాన్ని స్పష్టంగా 'ఇదీ' అని కూడా చెప్పలేమంటారు. ఎందుకంటే విశ్వరూపం మొత్తాన్ని వర్ణించి చెప్పడం ఎవరి తరమూ కాదు. కురుక్షేత్రములో గీతాబోధ సమయములో శ్రీకృష్ణుడు చూపిన విశ్వరూపాన్ని చూసి అర్జునుడు భయం తో వణికిపోయాడు. లెక్కలేనన్ని గ్రహ తారకాదులతో కూడి ఆది, మధ్య, అంతము లేకుండా ఉన్న ఆ ఆకారాన్ని చూసి అర్జునుడు భయపడిపోయాడు. అతనికి దిక్కులు తెలియలేదు. అర్జునుడు చేసిన విశ్వరూప వర్ణన, నేటి శాస్త్రజ్ఞులు ఇచ్చిన విశ్వరూప వర్ణనకు అతి దగ్గరగా ఉంది. సైన్సు దృష్ట్యా చూసినా కూడా మొత్తం విశ్వం అంతా మహావిష్ణువేనని తెలుస్తోంది. మరో రెండు నిదర్శనాలు కూడా ఇప్పుడు చూద్దాం. విష్ణువును "నీలమేఘశ్యాముడు" అంటారు. పగటిపూట అనంతవిశ్వం వైపు చూడండి. నీలిరంగు ఆకాశం కనిపిస్తుంది. వాతావరణం ద్వారా మన భూమి నుండి ఆకాశాన్ని చూస్తే నీలిరంగులోనే కనిపిస్తుంది. ఈ కారణంగానే విష్ణువును నీలమేఘశ్యాముడంటారు. మన భూవాతావరణాన్ని దాటివెళ్ళి అనంతవిశ్వాన్ని (ఆకాశాన్ని) చూస్తే అంతా చీకటిగా ఉంటుంది. అంటే నలుపురంగులో కనిపిస్తుంది. అందువల్లనే మహావిష్ణువు అసలురంగు"నలుపు" అని మహాభారతములో స్పష్టంగా చెప్పబడింది. ఎంత ఖచ్చితంగా నిరూపణ అవుతుందో చూడండి. "బ్రహ్మదేవుని వయసు మహావిష్ణువుకు ఒక కనురెప్ప పాటుగా లెక్క అని, బ్రహ్మ వయసు ప్రభావం విష్ణువుపై రవ్వంత కూడా పడదు" అని చెప్తోంది భాగవతం. ఈ విషయం లో చాలా అంతరార్థం ఉంది. బ్రహ్మదేవుడు అనగా ప్రకృతి అని చెప్పుకున్నాము కదా! ప్రకృతి పుట్టినప్పటి నుండి అంతరించేవరకు గల కాలం ' బ్రహ్మదేవుని వయసు ' అవుతుంది. అనంతమైన ఈ బ్రహ్మాండ విశ్వములో ఎక్కడెక్కడో ప్రకృతి పుట్టడం, అంతరించడం అంటే - అది పెద్దగా చెప్పుకోవలసిన విషయమేమీ కాదు. ఎందువల్లనంటే విశ్వం యొక్క కాలపరిమాణములో ' అక్కడక్కడా గ్రహాల్లో ప్రకృతి ఉండే కాలం ' బహుతక్కువ. అందువల్లనే అనంతమైన విశ్వానికి (అనగా విష్ణువుకు) ' ప్రకృతికాలం అనబడే బ్రహ్మవయసు ' కనురెప్ప పాటుగా లెక్క అని చెప్పబడింది. విష్ణువు యొక్క అనంతమైన బ్రహ్మాండ తత్త్వం ఇందులో గోచరమౌతుంది. ఇలా ఎన్నివిధాల చూసినా, విశ్వమే శ్రీమహావిష్ణువని తెలియవస్తుంది.
⚜🚩⚜🚩⚜🚩⚜
🙏🙏అభివందనాలు..!sir
ReplyDelete