🔔-శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం-🔔

 🚩🚩 శుభోదయం . 🚩🚩 

         

  🔔-శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం-🔔

♦కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 1

♦తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.

♦ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2

♦తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము.

♦మాతః 2సమస్త జగతాం మధుకైటభారే:

వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ 3

♦తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.

♦తవ సుప్రభాత మరవిందలోచనే

భవతు ప్రసన్న ముఖచంద్రమండలే

విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే

వృషశైలనాద థయితే దయానిధే. 4

♦తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవీ! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీవేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.

♦అత్ర్యాధిసప్తఋషయస్య ముపాస్య సంధ్యాం

ఆకాశ సింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్‌ 5

♦తా. అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశగంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

♦పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:

త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి

భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్‌

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 6

♦తా. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నాడు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

♦ఈషత్ర్పఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాళికానాం

ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 7

♦తా. కొంచెం వికసించిన తామరపూల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

♦ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః

పాత్రావశిష్ట కదలీఫల పాయసాని

భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 8

♦తా. ఓ శేషశైలపతీ! చక్కని పంజరములలో వున్న పెంపుడు చిలుకలు తా మిదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను, పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక!

♦తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా

గాయన్త్యనంత చరితం తవ నారదో7పి

భాషాసమగ్ర మసకృత్కర చారురమ్యం

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 9

♦తా. ఓ అనంతా! నారదుడు కూడ మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచు, పెక్కు సారులు రమ్యముగా హస్తాభినయముచేయుచు, చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశా! నీకు సుప్రభాతమగు గాక.

♦భృంగావళీచ మకరంద రసానువిద్ధ

ఝంకారగీత నినదైః సహ సేవనాయ

నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 10

♦తా. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గా.

♦యోషాగణేన వరదధ్ని విమధ్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 11

♦తా. ఓ శేషాద్రినాధుడవగు ఓ వేంకటేశ్వరా! గొల్ల పల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనుల బట్టి పెరుగుకుండలు, దిక్కులు కలహించుచున్నవా? అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

♦పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః

భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం

శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ 12

♦తా. సూర్యుని మిత్రములగు కమలములయందున్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభూ! నీకు సుప్రభాతమగు గాక.

♦శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో

శ్రీ దేవతాగృహభుజాంతర దివ్యమూర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 13

♦తా. శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

♦శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవనిర్మలాంగాః

శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః

ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 14

♦తా. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్నను లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం

ఆఖ్యాం త్వదయవసతే రనిశం వదంతి

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 15

♦తా. ఓ వేంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

♦సేవాపరాః శివసురేశ కృశానుధర్మ

రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః

బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్ష దేశాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 16

♦తా. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపయి చేతులు మోడ్చి నీ సేవకయి కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

♦ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః

స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 17

♦తా. దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీ­ు సుప్రభాతమగు గాక.

♦సూర్యేందు భౌమబుధవాక్పతి కావ్యసౌరి

స్వర్భాను కేతుదివి షత్సరిషత్ప్రధానాః

త్వద్దాస దాస చరమావధిదాస దాసాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 18

♦తా. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములును నీ దాస, దాసచరమావధి దాసులకు దాసులయి యున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

♦త్వత్పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః

స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా

కల్పాగమా7కలనయా కులతాం లభంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 19

♦తా. ఓ స్వామీ! నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైనవారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనియే కలత పడుచుందురు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

♦త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః

మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయన్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 20

♦తా. స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

♦శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్ధే

దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే

శ్రీ మన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 21

♦తా. ఓ దేవాదిదేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములకన్నింటికి శరణమిచ్చువాడవు నీవొక్కడవే. అనంతుడు, గరుడుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

♦శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 22

♦తా. ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభియందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంఠుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.

♦కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే

కాంతాకుచాంబురుహ కుట్మలలోలదృష్టే

కల్యాణనిర్మల గుణాకర దివ్యకీర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 23

♦తా. మన్మధుని గర్వము నణచు దివ్యసుందర శరీరము కల ఓ దేవా! నీ దృష్టి తామర మొగ్గలవంటి యువతి కుచములపయి పరిభ్రమించు చుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాత మగుగాక.

♦మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్‌

స్వామిన్‌ పరశ్వథ తపోధన రామచంద్ర

శేషాంశరామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 24

♦తా. ఓ వేంకటేశ్వరా! నీవు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కిరూపములను ధరించితివి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

♦ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం

దివ్యం వియత్సరసిహేమఘటేషు పూర్ణం

ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్ఠాః

తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్‌ 25

♦తా. ఓ దేవా! వైదికులగు భక్తులు, ఏలకులతోను, పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్రగంగా జలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

♦భాస్వానుదేతి వికటాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః

శ్రీ వైష్ణవాః సతత మర్దిత మంగళాస్తే

ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్‌ 26

♦తా. ఓ దేవా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలరావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

♦బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే

సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః

ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 27

♦తా. ఓ దేవా! బ్రహ్మ మున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి, నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

♦లక్ష్మీనివాస నిరవద్యగుణైక సింధో

సంసారసాగర సముత్తరణైక సేతో

వేదాంతవేద్య నిజవైభవ భక్త భోగ్య

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 28

♦తా. ఓ దేవా! నీవు లక్ష్మీదేవికి నివాసమైనవాడవు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి. వేదాంతములచే తెలిసికొనదగిన వైభవమును కలవాడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతమ్‌ (ఇత్థం వృషాచలపతే తవ సుప్రభాతమ్‌- కొన్ని పుస్తకాలలొ ఇల కూడ ఉన్ది)

♦యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః

తేషాం ప్రభాతసమయే స్మృతిరంగ భాజాం

ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే

♦తా. వృషాచలపతియగు శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్షసాధనమగు ప్రజ్ఞ కలిగించు చుండును.

                       🔔🔔❤❤❤❤❤❤❤❤🔔🔔

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐