🚩🚩బుద్ధావతారము.🚩🚩


🚩🚩బుద్ధావతారము.🚩🚩

♦#బుద్ధావతారము విష్ణువు దశావతారాలలో ఒకటి.

♦బుద్దావతారము క్షణ కాలము మాత్రమే ఉంది.

విష్ణుమూర్తి రాక్షసుని చంపడానికి దిగంబర అవతారము

ఎత్తుతాడు.

అందుకని ఈ అవతారమును పూజించరు.

అంతకు ముందరి అవతారమైన కృష్ణావతారమును పుజిస్తారు.

కృష్ణార్పణం అంటారు. బుద్దార్పణం అనరు.

❤పురాణ గాథ

♦త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేక పోతారు.అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింప చేయడానికి, లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు. ఇదే విషయం "ఆపన్నివారక స్తోత్రము "లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్ధం.

❤అన్నమయ్య వర్ణన

పైన వృత్తాంతాన్ని అన్నమయ్య "దశావతార వర్ణనలో" పేర్కొన్నాడు.

♦'పురసతుల మానములు పొల్లజేసినచేయి.

ఆకాసాన బారేపూరి

అతివలమానముల కాకుసేయువాడు"

ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు.

వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు.

అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩