🚩సా మెతలు (ఇ) ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది❤️

 

🚩సా మెతలు (ఇ)


ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది❤️

ఇంట ఆచారం - బయట అనాచారం

ఇంట గెల్చి - రచ్చ గెలువు

ఇంటాయనకు మగతనమేవుంటే పొరుగింటాయన పొందెందుకు? అందట

ఇంటింటా ఒక పొయ్యి - మా యింట మరో పొయ్యి

ఇంటి ఎద్దుకు బాడుగ ఏమిటి?

ఇంటికన్న గుడి పదిలం

ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది

ఇంటికి అవ్వ - కొలతకు తవ్వ కావాలి

ఇంటికి ఈల కత్తి - పొరుగుకు బంగారు కత్తి

ఇంటికి ఏబ్రాసి - పొరుగింటికి శ్రీమహాలక్ష్మి

ఇంటికి ఒక పువ్వు - ఈశ్వరుడికి ఒక మాల

ఇంటికి గుట్టు - మడికి గట్టు

ఇంటికి జ్యేష్ఠాదేవి - పొరుగింటికి శ్రీమహాలక్ష్మి

ఇంటికి పెద్ద కొడుకు, పెద్ద అల్లుడే లెక్కపడేది

ఇంటికి పెద్దకొడుకై పుట్టటం కంటే చాకలివాడి గాడిదగా పుట్టటం మేలు

ఇంటికి ముసలి - మడుగుకు మొసలి కీడు

ఇంటి కుక్కకు యింటి కుక్క పనికి రాదు

ఇంటి కూటికీ, బంతి కూటికీ రెంటికీ చెడినట్లు

ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక

ఇంటి గుట్టు లంకకు చేటు

ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మీసాలన్నీ తెగ కాలినాయట

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

ఇంటి పేరు కస్తూరివారు - ఇంట్లో గబ్బిలాల కంపు

ఇంటి పేరు పుణ్యాల వారు - చేసేవేమో పాపపు పనులు

ఇంటి మొగుడు చెమటకంపు - పొరుగింటి మొగుడు పూలవాసన

ఇంటి లక్ష్మిని వాకిలే చెబుతుంది

ఇంటివాడివలె చేసేవాడూ లేడు - బయటివాడివలె తినేవాడూ లేడు

ఇంటివాడు ఈకతో కొడితే పొరుగువాడు పోకతో కొడతాడు

ఇంటివాడు ఒసే అంటే, బయటివారూ ఒసే అంటారు

ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలు చూపుతారు

ఇంట్లో ఇగురు కూర కంటే పొరుగింటి పుల్లకూర రుచి

ఇంట్లో ఇల్లాలి పోరు - బయట బాకీల హోరు

ఇంట్లో ఈగల మోత - బయట పల్లకీల మోత

ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

ఇంట్లో పిల్లి - బయట పులి

ఇంత చక్కని పెళ్ళికి బాగా వాయించరా సన్నాయి మేళం అన్నట్లు

ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు

ఇక పుట్టేనా - ఇక పెరిగేనా - నలభై ఏళ్ళ కొడకా యింట్లో కూర్చో అన్నట్లు

ఇక్కడ మునిగి అక్కడ తేలినట్లు

ఇచిత్రాల పెళ్ళికొడుక్కి అక్షింతలు పెడితే నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాట్ట

ఇచ్చకాలకు ఉచ్చతాగితే గచ్చు కంపు కొట్టిందట

ఇచ్చకాలవారూ బుచ్చకాలవారూ పొట్టకోసం పొక్కులు గోకుతారు

ఇచ్చితినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్లు

ఇచ్చి తిరిగేది కోమటి తీసుకుని తిప్పేది కంసాలి

ఇచ్చి తీసుకుంటుంటే ఈలిగ నేస్తం

ఇచ్చింది యిచ్చి పుచ్చిన దాన్ని కొన్నట్లు

ఇచ్చింది ఇస్తే కరణమే కాదన్నట్లు

ఇచ్చిన నిష్ఠూరం కన్నా యివ్వని నిష్ఠూరమే మంచిది

ఇచ్చినమ్మ ఈగ - పుచ్చుకున్నమ్మ పులి

ఇచ్చినవాడు దాత - ఇవ్వనివాడు రోత

ఇచ్చినవాడే నచ్చినవాడు - చచ్చినవాడే అబ్బినవాడు

ఇచ్చే గొడ్డునే పితికేది

ఇచ్చేవాడు తీసుకునేవాడికి లోకువ

ఇచ్చేవాడ్ని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు

ఇచ్చేవి అందాలు పుచ్చుకునేవి తీర్థాలు అన్నట్లు

ఇత్తడి పుత్తడీ కాదు - తొత్తు దొరసానీ కాదు

ఇదిగో పసుపు - అదుగో ముసుగు అన్నట్లు

ఇదిగో పులి అంటే అదుగో తోక అన్నట్లు

ఇదిగో పాము అంటే అదుగో పడగ అన్నట్లు

ఇద్దరు దెబ్బలాడితే మూడోవాడికి లాభం

ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇరుకున పడి చచ్చినట్లు

ఇద్దరు మొగుళ్ళకు ముద్దుల పెళ్ళాంగా వుండటంలోనే మజా అందట

ఇనుప గుగ్గిళ్ళుకానీ మినప గుగ్గిళ్ళు కావు అన్నట్లు

ఇనుము కరిగే చోట ఈగలకేమి పని?

ఇనుముతో కూడిన అగ్నికే సమ్మెట పోట్లు

ఇనుము విరిగితే అతకవచ్చు మనసు విరిగితే అతకలేము

ఇరుగు ఇంగలం - పొరుగు మంగలం

ఇరుగును చూచి పొరుగు వాత పెట్టుకొన్నట్లు

ఇరుకులో యిబ్బందులు అన్నట్లు

ఇలను నమ్మి చెడినవాడు కలికానికి కూడా కన్పించడు

ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు - కొమ్ముల బర్రె కొట్టానికి చేటు

ఇల్లరికం కన్నా మాలరికం మేలు

ఇల్లలికి ముగ్గులు పెడితే ఈగల బాధ

ఇల్లలుకగానే పండుగా?

ఇల్లాలి శుచి యింటిని చూడగానే తెలుస్తుంది

ఇల్లాలు గుడ్డిదయితే ఇంటి కుండలకు చేటు

ఇల్లాలు లేని యిల్లు భూతాలకు నిలయం

ఇల్లు యిచ్చినవానికీ, మజ్జిగ పోసిన వానికీ మంచి లేదు

ఇల్లు ఇరకటం - ఆలి మరకటం

ఇల్లెక్కి కొరివి త్రిప్పినట్లు

ఇల్లు ఎక్కి కోక విప్పిందట

ఇల్లు కట్టి చూడు పెళ్ళిచేసి చూడు

ఇల్లు కాలుతుంటే జల్లెడతో నీళ్ళుపోసినట్లు

ఇల్లుకాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగినట్లు

ఇల్లు కాలుతుంటే బావి త్రవ్వినట్లు

ఇల్లుచూచి ఇల్లాలిని చూడు

ఇల్లు జానెడు - కర్ర మూరెడు

ఇల్లు తీరు వాకిలి - తల్లి తీరు పిల్ల

ఇల్లు దాటిన ఆడది లోకానికి లోకువ

ఇల్లు పీకి పందిరి వేసినట్లు

ఇల్లు మ్రింగే అత్తకు యుగం మ్రింగే కోడలు

ఇల్లు లేనమ్మ హీనం చూడు - మగడు లేనమ్మ మానం చూడు

ఇల్లు విడిచిన తర్వాత ఇల్లాలవుతుందా?

ఇల్లు విడిచిన ఆడది - చెట్టు విడిచిన కోతి ఒకటే

ఇల్లే తీర్థం - వాకిలే వారణాసి - కడుపే కైలాసం అన్నట్లు

ఇల్లే కైలాసం - వాకిలే వైకుంఠం అన్నట్లు

ఇవ్వడమన్నది ఈ యింట లేదు, తే అన్నది తరతరాలుగా వస్తున్నదన్నట్లు

ఇవ్వని మొండికి విడువని చండి

ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు? రేపు జోలె పట్టడమెందుకు?

ఇవ్వాళ చస్తే రేపటికి రెండు

ఇవిగో పూలంటే అందుకో అందాలు అందట

ఇష్టంలేని పెళ్ళాన్ని ఒసే అన్నా తప్పే - అమ్మా అన్నా తప్పే

ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం

ఇసంట రమ్మంటే ఇల్లంతా నాది అన్నట్లు

ఇసుక తక్కెడ - పేడ తక్కెడ

ఇస్తే చేసేది లేదు - చస్తే వచ్చేది లేదు

ఇస్తే పెండ్లి - ఇవ్వకపోతే పెటాకులు

ఇహం పరం లేని మొగుడు ఉంటేనేమి? పోతేనేమి?

ఈ ఇంట ఆచారమా మా గ్రహచారమా?

ఈ ఊపుడుక్కాదు ఆ ఊపుడుకు తట్టుకోవాలన్నాడట

ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు - దాతలెవరంటే చాకళ్ళు

ఈగ వ్రణం కోరు - నక్క పీనుగ కోరు

ఈగను కప్ప మ్రింగితే - కప్పను పాము మ్రింగుతుంది

ఈ చీరెట్లా వుందంటే, చీరే లేకుంటే నువ్వు మరీ బాగుంటావన్నాడట

ఈ చేత చేస్తారు - ఆ చేత అనుభవిస్తారు

ఈటె పోటు మానుతుంది గానీ మాట పోటు మానదు

ఈడుగానిది యింటికిరాదు

ఈడు చూసి పిల్లని యివ్వాలి - పిడి చూసి కొడవలి కొనాలి

ఈడ్పు కాళ్ళు, ఈడ్పు చేతుల ఇతడేనమ్మా యిల్లరికపుటల్లుడు

ఈతకు మించిన లోతు లేదు

ఈతగింజ ఇచ్చి తాటిగింజలాగినట్లు

ఈతచెట్టు ఇల్లు కాదు - తాడిచెట్టు తల్లి కాదు

ఈతచెట్టు క్రింద పాలు త్రాగినా కల్లే అంటారు

ఈత నేర్చిన వాడికే నీటి చావు

ఈత వచ్చినపుడు లోతనిపిస్తుందా?

ఈదబోతే త్రాగ నీళ్ళు లేవు

ఈనగాచి నక్కల పాలు చేసినట్లు

ఈ దెబ్బెలా వుందని అడిగితే నిన్నటి దెబ్బే బాగుందన్నదట

ఈనాడు ఇంటిలో - రేపు వీధిలో

ఈ నొక్కుళ్ళకన్నా ఆ దెబ్బలే బాగున్నాయందట

ఈ సంబడానికేనా ఇంత ఆర్భాటం 

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐